వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం జంగంరెడ్డిపల్లె పొలాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది.
సాక్షి, సింహాద్రిపురం: వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం జంగంరెడ్డిపల్లె పొలాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్థులు సోమవారం అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.