అనతపురం రూరల్: తాటిచెర్లలో రెండు రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు సోమవారం అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు చిరుత కోసం గ్రామ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఎలాగైనా దాన్ని పట్టుకునేందుకు వలలు సిద్ధం చేశారు. రాత్రి వేళల్లో సిబ్బంది ఇక్కడే ఉంటారని, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని అటవీ శాఖ అధికారి సాయిప్రసాద్ గ్రామ ప్రజలకు సూచించారు. నీటి కోసం గ్రామ సమీపంలోకి చిరుతలు వచ్చి ఉంటాయన్నారు.