
చింతపల్లిలో చిరుత సంచారం!
గుట్టపై మేక కళేబరం
హైనా అయి ఉంటుందంటున్న అటవీ శాఖాధికారి
చింతపల్లి(కురవి) : మండలంలోని చింతపల్లి గుట్ట ల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతోంది. చింతపల్లి శివారులోని సీరోలు క్రాస్‌రోడ్ సమీపంలో ఉ న్న బోడ గుట్టపైన మేకను తిన్న ఆనవా ళ్లు సోమవారం కనిపించించారుు. తండా కు చెందిన భూక్య సూక్యకు చెందిన మేక ల మంద ఆదివారం మేత కోసం వెళ్లగా అందులో నుంచి ఒకటి ఇంటికి తిరిగి రా లేదు. దాన్ని వెతికేందుకు గుట్టపైకి వెళ్లగా కళేబరం(నాలుగుకాళ్లు) కనిపించింది. దీంతో సూక్య భయంతో తండాకు వచ్చి గ్రామస్తుల ద్వారా సీరోలు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌కు సమాచారం అందజేశారు. ఆయన వెంటనే గుట్టపైకి వచ్చి పరిశీలిం చి మహబూబాబాద్‌లోని డిప్యూటీ రేంజ్ అధికారి రాజేందర్‌కి సమాచారం అందించగా తన సిబ్బందితో సంఘటనా స్థలాని కి చేరుకున్నారు.
మేక కళేబరాన్ని పరిశీ లించి చిరుతపులి కాదని నిర్ధారించుకుని హైనా అయి ఉంటుందని డిప్యూటీ రేంజ్ అధికారి తెలిపారు. హైనా తోడేలు జాతి కి చెందిన జంతువు అని వివరించి వెళ్లిపోయూరు. తండా గిరిజనులు ఎవరు భయపడవద్దని అటవీశాఖ అధికారులు చెప్పి వెళ్లిపోయూరు. అనంతరం అదే గుట్ట వద్ద పశువులపై జంతువు దాడికి యత్నించడంతో పశువుల కాపర్లు భయంతో పరుగులు తీశారు. పశువులు సైతం పరుగు లు తీశాయి. దీంతో తండావాసులు భ యంతో వణికిపోతున్నారు. జంతువును పట్టుకుని తండావాసులకు రక్షణ కల్పిం చాలని వేడుకుంటున్నారు. ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారిలో బీట్ అధికారి పూ ల్య, సిబ్బంది మహేశ్, భాస్కర్, బిక్షపతి, పోలీస్ సిబ్బంది, తండావాసులు, మాజీ సర్పంచ్ జెర్రిపోతుల రంగన్నగౌడ్, మా జీఎంపీటీసీ చందూలాల్ ఉన్నారు.