రాయదుర్గం : అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదంగొల్లలదొడ్డి పల్లేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటేనే చిరుత భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొంది. గ్రామం నుండి జెడ్పీ హైస్కూల్‌కు వెళ్లాంటే విద్యార్థులు కొండ సమీపంలో నుండి వెళ్లాలి. అయితే గత 15 రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. దీంతో వారు పాఠశాలకు వెళ్లడం మానేశారు. చిరుతపులి ఈ ప్రాంతంలో నాలుగు పశువులు, ఐదు మేకలను దాడి చేసి చంపేసింది. అటవీశాఖ అధికారులు పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారేగానీ.. దాన్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.