సాక్షి, ఆదిలాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత 15 రోజులుగా రెబ్బన, ఆసిఫాబాద్ మండలాల్లో పులి సంచారం చేస్తూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే రెండు ఆవులను చంపటంతో పశువులు, గొర్రెల కాపరులు బయటకు వెళ్లేందుకు వణుకుతున్నారు. గత శనివారం ఉదయం పెద్దపులది చిర్రకుంట గ్రామం వద్ద రోడ్డు దాటుతూ ఫారెస్ట్ సిబ్బందికి కనిపించినట్లు సమాచారం. ఇక అదే రోజు రాత్రి కూడా పులి రోడ్డు మీదకు వచ్చేందుకు ప్రయత్నించగా ఆటవీ సిబ్బంది దానిని అడవిలోకి పంపించారు. ఈరోజు ఉదయం కైరిగూడ ఓసిసి వద్ద వాగు దాటుతుండగా చూసిన స్థానికులు మొబైల్‌లో వీడియో తీసి అధికారులకు పంపించారు. కాగా ఏప్రిల్ 21న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు కూడా పెద్దపులి కనిపించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment