సుందరగిరిగుట్ట (కరీంనగర్) : చిగురుమామిడి మండలం సుందరగిరి గుట్టపై చిరుత సంచారం కలకలం సృష్టించింది. గురువారం గుట్టపై సంచరించిన చిరుత ఓ లేగదూడను, కుక్కను చంపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చిరుత సంచారంపై అటవీ అధికారులకు సమాచారం అందించారు.