మొయిన్‌పేట మండలం చక్రంపేట గ్రామ శివారులోని పొలాల్లో బుధవారం మధ్యాహ్నం పులి సంచరిస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. వారు ఈ విషయాన్ని అధికారులకు తెలిపారు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు పొలాలను పరిశీలించారు. పులి అడుగు జాడలు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రజలు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరో వైపు పులిని బంధించేందుకు అటవీ సిబ్బంది ఏర్పాట్లు చేస్తారని తెలియజేశారు.