తెలంగాణ సీఎం కేసీఆర్‌తో నేడు అపాయింట్‌మెంట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అడ్వొకేట్ జనరల్(ఏజీ)గా ఉన్న ఎ. సుదర్శన్‌రెడ్డి, అదనపు అడ్వొకేట్స్ జనరల్ కె.జి.కృష్ణమూర్తి, బి. భాస్కరరావు తమ పదవులకు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారు మంగళవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావును కలవనున్నారు. ఈ మేరకు సీఎంతో వారికి అపాయింట్‌మెంట్ కూడా ఖరారైనట్టు సమాచారం. కేసీఆర్‌కే వారు స్వయంగా తమ రాజీనామా లేఖలను అందజేయనున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సుదర్శన్‌రెడ్డి ఏజీగా నియమితులయ్యారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందే, ప్రస్తుతం ఉన్న ఏజీ, అదనపు ఏజీలు, ప్రభుత్వ న్యాయవాదులను తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆ పోస్టుల్లోనే కొనసాగాలని ప్రభుత్వం గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ సుదర్శన్‌రెడ్డి రాజీనామాకు సిద్ధపడటం న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన సన్నిహితులతో చర్చించిన తర్వాతనే సుదర్శన్‌రెడ్డి ఏజీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా సోమవారం ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నించారు. అయితే కేసీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా సాధ్యం కాలేదు. దీంతో మంగళవారం ఉదయం వారు కేసీఆర్‌ను కలవనున్నారు.
రాజీనామాలు చేయనున్న ఏజీ, అదనపు ఏజీ!
Published Tue, Jun 3 2014 12:53 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement