తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ప్రధాని నరేంద్ర మోదీని కోరనున్నారు.
న్యూఢిల్లీ: తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ప్రధాని నరేంద్ర మోదీని కోరనున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ మంగళవారం కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై కేసీఆర్ చర్చించనున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేసీఆర్.. మోదీని కోరనున్నారు.