Bhaskar Rao
-
మళ్లీ రిపీట్.. మరో సారి నోరు జారిన ఎమ్మెల్యే భాస్కర్ రావు!
సాక్షి, నల్గొండ: వేములపల్లి మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ నేతలకు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. నాలుగు చీరలిచ్చే కాంగ్రెస్ నాయకుడికి ఓట్లు వేయాలా.. అలా అయితే మేం వేసిన రోడ్లపై నడవకండంటూ భాస్కర్ రావు వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారేన్ని రేపుతున్నాయి. కాగా గతంలోనూ అడవిదేవులపల్లి మండలంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన ఈ ఎమ్మెల్యే విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. -
ఆప్‌కు ఊహించని షాక్.. బీజేపీలోకి కీలక నేత!
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. జంపింగ్ నేతలు పార్టీలు మారే యోచనల్లో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సమయంలో కొందరు ప్రతిపక్ష నేతలు అధికార పార్టీ నేతలను కలవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, ఆప్ నేత భాస్కర్ రావు బీజేపీలోకి ఎంట్రీ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీకి మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న బెంగళూరు మాజీ పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు తొందరలోనే పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. కాగా, భాస్కర్ రావు.. మంగళవారం కర్నాటక రెవెన్యూ శాఖ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై చర్చించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చర్చ సఫలం కావడంతో ఆయన కాషాయతీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, భాస్కర్ రావు.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే.అన్నామలై, కేంద్ర ప్రహ్లాద్ జోషిలను సైతం కలుసుకుని చర్చలు జరిపారు. అయితే, కర్నాటకకు అన్నామలై.. పోల్స్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. భాస్కర్ రావు గతేడాది తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అనంతరం, కేజ్రీవాల్ ఆయనను ఆప్ మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా నియమించారు. దీంతో, కర్నాటకలో భాస్కర్ రావు ఆప్‌కు కీలక నేతగా మారారు. ఇక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాస్కర్ రావును ఆప్.. బసవనగుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా బరిలో నిలిపే ప్లాన్ కూడా చేసింది. ఇంతలోనే ఆప్‌కు షాకిస్తూ భాస్కర్ రావు బీజేపీ నేతలతో టచ్‌లో ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. -
సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ విధుల్లోకి..
కారంచేడు: కరోనా బాధితులకు వైద్యం చేస్తూ తానూ ఆ వ్యాధి బారిన పడి ఊపిరితిత్తులు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న కారంచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నర్తు భాస్కరరావు సీఎం జగన్ సాయంతో చికిత్స చేయించుకుని ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరారు. గుంటూరు జిల్లా నల్లపాడు రీజినల్ ట్రైనింగ్ సెంటర్(ఆర్టీసీ)కి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ డి.రామిరెడ్డి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన కోవిడ్–19 సమయంలో కారంచేడు పీహెచ్సీ నుంచి సుమారు 10 వేల కోవిడ్ టెస్ట్‌లు చేసి.. అదే కరోనా కోరలకు చిక్కి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఊపిరితిత్తుల మార్పిడి తప్పనిసరని, అందుకు సుమారు రూ.2 కోట్ల వరకూ ఖర్చవుతుందని హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. దీంతో ఆయన భార్య డాక్టర్ భాగ్యలక్ష్మి విజ్ఞప్తి మేరకు ఐఎంఏ వైద్యులు, ఐఆర్‌ఐఏ వైద్యులు, కార్డియాలజీ, అనస్థీషియా అసోసియేషన్, గుంటూరు మెడికల్ కాలేజ్ ఓల్డు స్టూడెంట్స్, కారంచేడుకు చెందిన ప్రజలు, ఎన్ఆర్ఐలు, అనేక మంది దాతల సహకారంతో సుమారు రూ.50 లక్షలు సిద్ధం చేశారు. డాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు అప్పటి మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌ల సహకారంతో సీఎంను కలిసి వైద్యానికి అయ్చే ఖర్చు విషయమై విజ్ఞప్తి చేయగా.. వెంటనే స్పందించిన సీఎం జగన్.. భాస్కరరావు వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో వెంటనే ఆయనకు ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.1.50 కోట్లతో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అప్పటి నుంచి ఆయన వైద్యుల సూచనతో ఇంటి వద్దే ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నెల 21న తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపి, తాను మళ్లీ విధుల్లో చేరతానని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే ఆయనకు ఉత్తర్వులు వెలువడ్డాయి. -
ఏపీ ప్రభుత్వం సాయం.. డాక్టర్ భాస్కరరావు డిశ్చార్జి
కారంచేడు: కోవిడ్ నుండి అనేక మంది ప్రాణాలను కాపాడిన వైద్యాధికారి అదే వైరస్ కోరలకు చిక్కి ప్రాణాపాయ స్ధితికి చేరుకున్నారు. ఆయన వైద్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం అందించడంతో మృత్యుంజయుడై ఇంటికి చేరుకున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నర్తు భాస్కరరావు 5,000కు పైగా కోవిడ్ పరీక్షలు చేశారు. కోవిడ్ రోగులకు వైద్య సేవలందించారు. ఏప్రిల్ 24న ఆయన ఆదే కోవిడ్ కోరలకు చిక్కారు. కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. పరిస్ధితి విషమించడంతో మే 1న విజయవాడకు, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ఆయన ఊపిరితిత్తులు చెడిపోయాయని, వాటిని మార్పిడి చేయాల్సిందేనని, అందుకు రూ. 2 కోట్లు వరకు ఖర్చవుతుందని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. ఆయన భార్య డాక్టర్ భాగ్యలక్ష్మి అభ్యర్ధన మేరకు గ్రామానికి చెందిన ప్రజలు, ఎన్ఆర్ఐలు సుమారు రూ. 40 లక్షల వరకు సమకూర్చారు. ఇంకా రూ 1.5 కోట్లు అవసరమయ్యాయి. ప్రభుత్వ వైద్యుల సంఘం విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి పరిస్ధితిని వివరించింది. వెంటనే ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విషయం తెలిపారు. డాక్టర్ భాస్కరరావు వైద్యానికి అయ్యే ఖర్చు ఎంత అయినా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వెంటనే ఆపరేషన్‌కు అవసరమైన నిధులు కూడా కేటాయించారు. దీంతో జూలై 14న భాస్కరరావుకు ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. 100 రోజుల పాటు చికిత్స అనంతరం మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో రెండు నెలల పాటు ఆయన హైదరాబాద్‌లోనే అక్కడి వైద్యులకు అందుబాటులో ఉంటారని డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. పూర్తిగా కోలుకొని స్వస్థలానికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని, తన ఆరోగ్యం కోసం సహకరించిన ప్రతి ఒక్కరినీ కలిసి కృతజ్ఞతలు తెలుపుతారని ఆమె తెలిపారు. -
సీఎం జగన్ సహాయంతో ‘ఊపిరితిత్తుల మార్పిడి’ సక్సెస్
కారంచేడు: ప్రకాశం జిల్లా కారంచేడు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ నర్తు భాస్కరరావుకు హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో గురువారం ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. విధుల్లో ఉన్న ఆయనకు ఏప్రిల్ 24న కోవిడ్ సోకింది. దీంతో ఆయనకు విజయవాడ, హైదరాబాద్‌ల్లోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. భాస్కరరావు ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోవడంతో వాటిని మార్చాలని, అందుకు రూ.1.5 కోట్లు ఖర్చవుతుందని కిమ్స్ వైద్యులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి సమస్యను వివరించింది. ఈ విషయాన్ని వెంటనే ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలియజేయడంతో సీఎం స్పందించి డబ్బుకు వెనుకాడొద్దని, భాస్కరరావు చికిత్సకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చినట్టుగానే డాక్టర్ భాస్కరరావుకు ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఒక ప్రభుత్వ వైద్యుడికి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి ఆయన ప్రాణాలను కాపాడటంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. డాక్టర్ భాస్కరరావు భార్య డాక్టర్ బొమ్మినేని భాగ్యలక్ష్మి.. సీఎం వైఎస్ జగన్, మంత్రి బాలినేని, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఫ్రంట్‌లైన్ సిబ్బందికి సీఎం అండ
‘వైద్యులు, వైద్య సిబ్బంది విపత్తు సమయంలో చేస్తున్న సేవలను ఈ ప్రభుత్వం మరచిపోదు. కరోనా కష్టకాలంలో ధైర్యంగా ప్రజలకు సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఎప్పుడూ అండగా ఉంటుంది’ అని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలను ఆచరణలో నిలుపుకొన్నారు. సాక్షి, అమరావతి: ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వారి సేవలను మెచ్చుకోవడంతోనే సరిపెట్టుకోకుండా, కష్టం వచ్చిన సందర్భంలో ఎంత ఖర్చుకైనా వెనుకాడమని నిరూపించారు. ప్రకాశం జిల్లా కారంచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తూ కోవిడ్ బారిన పడ్డ డా.ఎన్.భాస్కర్‌రావు వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇతని ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బ తిన్నాయని, వైద్య ఖర్చులకు కోటిన్నర రూపాయల వ్యయం అవుతుందని అంచనా. దీంతో తక్షణం సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.50 లక్షలు మంజూరు చేశారు. మిగతా మొత్తాన్ని ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. డా.ఎన్.భాస్కర్‌రావుకు ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం ఒక పీహెచ్సీలో పని చేస్తున్న డాక్టర్ వైద్యానికి రూ.కోటిన్నర వ్యయం చేస్తామని సీఎం ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కష్టకాలంలో సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి సీఎం జగన్ భరోసా ఇచ్చారని పలు వర్గాలు అభినందిస్తున్నాయి. శనివారం జరిగిన మీడియా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖలో కోవిడ్ బారిన పడిన సిబ్బంది ఎవరికైనా వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. దీంతో వైద్యులతో పాటు వైద్యేతర సిబ్బంది కూడా ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, కరోనా సమయంలో ఆరోగ్య సిబ్బంది పట్ల ఇంత శ్రద్ధ తీసుకోవడం ద్వారా తమపై మరింత బాధ్యత పెరిగిందని పలువురు అభినందిస్తున్నారు. ఇది గొప్ప నిర్ణయం ఒక వైద్యుడికి వైద్యం చేయాలంటే కోటిన్నర అవుతుందంటే దాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం గొప్ప విషయం. గతంలో ఏ సీఎం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆరోగ్య శాఖ సిబ్బంది పట్ల సీఎంకి ఉన్న చిత్తశుద్ధి ఏంటన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇందుకు వైద్యుల సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. – డా.జయధీర్, ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ మా బాధ్యత మరింత పెరిగింది కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు చేస్తున్న నిరంతర పోరాటానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నుదన్నుగా నిలిచారు. కారంచేడు వైద్యుడికి చేసిన సాయం వల్ల మాలో భరోసా పెరిగింది. వైద్యులకు గుండె నిబ్బరం కలిగేలా సీఎం నిర్ణయం ఉంది. మా బాధ్యత పెరిగింది. – డా.పిడకాల శ్యాంసుందర్, ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి -
డాక్టర్‌కు అండగా నిలబడిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన పీహెచ్సీ వైద్యాదికారి ఎన్.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇటీవలే కరోనా బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. ఆయనకు ఊపిరితిత్తులు మార్చాలని తేల్చిన వైద్యులు అందుకు రూ.1.50 కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో డాక్టర్ భాస్కరరావు కుటుంబ సభ్యులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించారు. బాలినేని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. అతడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.కోటి వెంటనే చెల్లించాలని, అవసరమైతే మరో రూ.50 లక్షలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారని మంత్రి బాలినేని తెలిపారు. ఆయన చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్రం ప్రభుత్వం ముందుకు రావడంతో ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ శనివారం వైఎస్ జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపింది. వారు స్పందిస్తూ.. '' ఆపదలో ఆపదలో ఆదుకున్న సీఎం వైఎస్ జగన్ ఉదారతకు ఇవే మా కృతజ్ఞతలు. కష్టకాలంలో తోడుగా నిలిచిన సీఎంకు అభినందనలు తెలుపుతున్నాం. కరోనా విపత్తులో కారంచేడులో డాక్టర్ భాస్కర్‌రావు వైద్య సేవలు అందించారు. ఆరు వేల మందికి పైగా కోవిడ్ పరీక్షలు చేశారు. దురదృష్టవశాత్తూ ఆయన కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరారు. ఖరీదైన వైద్యం చేస్తే గానీ .. ప్రాణాలు నిలబడిని పరిస్థితికి భాస్కర్‌రావు ఆరోగ్యం చేరుకుంది. దీంతో దిక్కుతోచని స్థతిలో ఉన్న ఆయన కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. అత్యంత ఖరీదైన వైద్యానికి ఖర్చులు భరించేందుకు వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ పట్ల తన చిత్తశుద్ధిని మరోసారి సీఎం చాటుకున్నారు. సీఎం స్పందించిన తీరుతో మా బాధ్యత మరింత పెరిగిందని'' తెలిపారు. కాగా డాక్టర్ ఎన్.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలతో సుమారు 6 వేల మందికి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా తేలిన వారెందరికో అండగా నిలబడ్డారు. ఆయన అందించిన వైద్యంతో వేలాది మంది కోవిడ్ బారినుంచి బయటపడ్డారు. ఏప్రిల్ 24న ఆయనకు కరోనా సోకింది. నెలాఖరు వరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉండి వైద్యం పొందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో భార్య డాక్టర్ భాగ్యలక్ష్మి ఆయనను విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ 10 రోజుల వైద్యం తరువాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదా హాస్పిటల్, తరువాత గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడవటంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుండటంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. చదవండి: Andhra Pradesh: ఆ వైద్యుడి చికిత్స ఖర్చు ప్రభుత్వానిదే..! -
కొల్లు రవీంద్రకు షరతులతో బెయిల్
చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్సీపీ సీనియర్ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కోర్టు న్యాయమూర్తి వై.లక్ష్మణరావు సోమవారం తీర్పు ఇచ్చారు. జైలు నుంచి విడుదలైన తర్వాత 28 రోజులపాటు విజయవాడ హోం క్వారంటైన్లో ఉండాలని, పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించకూడదని, కేసు గురించి ఎవరితోనూ చర్చించకూడదని న్యాయస్థానం షరతులు పెట్టింది. విచారణ అధికారికి కేసు విషయంలో పూర్తిగా సహకరించాలని, ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. -
మరో 14 రోజుల పాటు రిమాండ్
-
కొల్లుకు రిమాండ్ పొడిగింపు
సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్సీపీ సీనీయర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రిమాండ్‌ను మరో 14 రోజులపాటు పొడిగించారు. ఈ మేరకు మచిలీపట్నం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గురు అరవింద్ ఆదేశాలు జారీ చేశారు. గత నెల 29న మచిలీపట్నం చేపల మార్కెట్ వద్ద పట్టపగలు వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కరరావును హతమార్చడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో చింతా నాంచారయ్య (చిన్ని), చింతా నాంచారయ్య (పులి), చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీకృష్ణ, పోల రాము, ధనలతో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కుట్ర దారునిగా పేర్కొంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఏ–4 నిందితుడిగా అరెస్ట్ చేశారు. వీరందర్ని వీడియో కాన్ఫరెన్స్‌లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా, బెయిల్ కోసం కొల్లు రవీంద్రతో పాటు ఇతర నిందితులు జిల్లా కోర్టులో వేర్వేరుగా ఫైల్ చేసిన పిటిషన్లు సోమవారం విచారణకు రానున్నాయి. -
పోలీసుల కస్టడీలో నిందితులు..
-
రాజకీయ హత్య
-
‘కొల్లు’ ప్రోద్బలంతోనే మోకా హత్య
కోనేరు సెంటర్ (మచిలీపట్నం)/ గూడూరు (పెడన): టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్టు కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యారు. ఆయన కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు తూర్పు గోదావరి జిల్లా తుని మండలం సీతారామపురం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అనం తరం ఆయనను కృష్ణా జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ఆరోగ్య పరీక్షలు, కోవిడ్–19 పరీక్షలు నిర్వహించారు. నిందితులందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మచిలీపట్నం రెండో అసిస్టెంట్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపర్చారు. జడ్జి ఆదేశాల మేరకు కొల్లు రవీంద్ర, మిగిలిన నిందితులను 14 రోజుల రిమాండ్ నిమిత్తం భారీ బందోబస్తు నడుమ మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ–4, ఏ–5గా ఉన్న నాగమల్లేశ్వరరావు, వంశీకృష్ణలను అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన విషయాలను ఎస్పీ ఎం.రవీంద్ర నాథ్‌బాబు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. ‘నా పేరు బయటకు రాకుండా చంపేయండి’ ► టీడీపీ మాజీ కౌన్సిలర్ చింతా నాంచారయ్య అలియాస్ చిన్నీకి మోకా భాస్కరరావుతో విభేదాలు ఉండటంతో అతడిని అడ్డు తొలగించు కోవాలనుకున్నాడు. ► కొల్లు రవీంద్రను కలిసి మోకాను అం తమొందిస్తే తప్ప తనకు స్థానికంగా బలం ఉండదని, సహకరించాలని చిన్నీ కోరగా.. స్థానిక ఎన్నికలు ముగిశాక ఆలోచిద్దామని కొల్లు చెప్పారు. ► కొన్ని రోజుల క్రితం చిన్నీ మరోసారి రవీంద్రను కలిసి మోకాను హతమా ర్చేందుకు సహకరించాలని కోరాడు. ► అందుకు అంగీకరించిన మాజీ మంత్రి రవీంద్ర ‘నా పేరు ఎక్కడా బయటకు రాకుండా చంపేయండి. ఈ విషయమై మాట్లాడటానికి నాకెలాంటి ఫోన్లు చేయకండి. ఏదైనా ఉంటే నా పీఏలతో మాట్లాడండి’ అని సూచించారు. ► దీంతో చింతా చిన్నీ గతనెల 29న మోకా భాస్కరరావు చేపల మార్కెట్లో ఒంటరిగా ఉండగా.. చింతా పులి, చింతా కిషోర్ (మైనర్)లతో కలిసి కత్తులతో పొడిచి చంపారు. ‘నేనున్నా.. ఏం జరిగినా చూసుకుంటా’ ► భాస్కరరావును హత్య చేసిన చిన్నీ నిందితులిద్దరితో కలిసి ఊరి చివరకు వెళ్లి కొల్లు రవీంద్ర పీఏకి ఫోన్ చేశాడు. ► కలెక్టరేట్లో ఉన్న రవీంద్ర పీఏ నుంచి ఆ ఫోన్ తీసుకుని మాట్లాడగా.. ‘అన్నా.. పని పూర్తయ్యింది. మోకాను వేసేశాం’ అని చిన్నీ చెప్పాడు. ► ‘సరే జాగ్రత్త. నేనున్నా.. ఏం జరిగినా నేను చూసుకుంటా. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి’ అని చిన్నీకి మాజీ మంత్రి అభయమిచ్చారు. ► నిందితుల వాంగ్మూలం, ఫోన్ కాల్స్ డేటా ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ కేసులో కొల్లు రవీంద్రను నాలుగో (ఏ–4) నిందితునిగా నిర్ధారించినట్టు ఎస్పీ చెప్పారు. -
నా భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యే
-
నేడు మోకా భాస్కర్‌రావు అంత్యక్రియలు
-
విదుర నీతి
పాండవులతో యుద్ధం తప్పదని తెలిసిన ధృతరాష్ట్రుడు, జరగబోయే పరిణామాల గురించి ఆలోచించి కలవరపడుతూ విదురుని పిలిచి ‘‘విదురా! నాకు మనసు అస్థిమితంగా ఉంది. నాకు మంచిమాటలు చెప్పి, ఉపశాంతి కలిగించు’’ అని అడిగాడు. అప్పుడు విదురుడు అతనితో ఇలా అన్నాడు. ‘పక్వానికి రాక మునుపే పండును కోస్తే తినడానికి రుచిగా ఉండక పోవడమే కాక, దాని విత్తనం తన ప్రయోజనాన్ని కోల్పోతుంది. దండలు కట్టేవాడు చెట్టునుంచి పువ్వులు కోసే విధంగా, తేనెటీగలు పూవు నుంచి తేనెను గ్రహించే విధంగా ఎదుటివాడు బాధ పడకుండా పనిచేసి ఫలితాన్ని పొందాలి. అంతేకాని బొగ్గుల కోసం చెట్టు మొదలంటా నరకకూడదు. పరుల ధనానికి, విద్యకు, పరాక్రమానికి, తేజస్సుకు, ఈర‡్ష్య చెందే వాడు ఏ రోగం లేకుండానే బాధ పడతాడు. ఎదుటి వానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేక పోతే మాట్లాడకుండా ఊరకే ఉండటం మంచిది. మాటల వలననే పగ, చెలిమి, తెలివి, కలత, ధర్మం, పాపం, కీర్తి, అపకీర్తి కలుగుతాయి. గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది. కాని మాటలతో చెడిన కార్యం సిద్ధించదు. శరీరంలో విరిగిన బాణాలను ఉపాయంతో తొలగించవచ్చు కానీ మనసులో నాటుకున్న మాటలనే గాయాలను ఎన్ని ఉపాయాలతోనైనా మాన్పలేము. ధర్మరాజు నోటి వెంట ఒక చెడు మాట కూడా రాదు. కాని నీ కొడుకులు ఒకరిని మించి ఒకరు నీచవాక్యాలు అనేకం పేలుతూ ఉంటే నీవు దానిని జంకూగొంకూ లేకుండా వింటూ ఊరుకుంటున్నావు. నీకు ఇది తగునా? చేటు కాలం దాపురించినప్పుడు చెడ్డ మాటలు, చెడు చేతలూ కూడా మనసుకు ధర్మ బద్ధంగానే కనిపిస్తాయి. పాండురాజు నీ సోదరుడు. అతని కుమారులు కూడా నీకు తేజస్సు, లాభం సంపాదించి పెట్టారు. వారిని ఆదరించు. ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం. దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది, మతి చెడుతుంది, శరీరం కృశిస్తుంది, రోగం వస్తుంది. మిక్కిలిగా దుఃఖిస్తే శత్రువుకు అది సంతోషాన్ని చేకూరుస్తుంది కనుక దుఃఖించడం మాను. జ్ఞాతి వైరం వదిలి పెట్టు. అన్నదమ్ములు కలిసి ఉంటే వారిని ఎవరూ కన్నెత్తి చూడలేరు. వేరుగా ఉంటే శత్రువుకు లోకువైపోతారు. కాబట్టి కౌరవులు, పాండవులు ఒకరికొకరు అండగా ఉంటే శత్రువుకు జయించరానివారు అవుతారు. పాండు పుత్రులను పిలిచి వారికి హితం కలిగించి నీ పుత్రులను రక్షించుకో. సహాయం సంపదను బట్టి, సంపద సహాయాన్ని బట్టి ఉంటాయి. ఇలా ఒకదానితో ఒకటి కూడి ఉంటే గాని సిద్ధించవు. కాబట్టి నీ సంపద పాండవులకు, వారి సహాయం నీకు ప్రీతి కలిగిస్తుంది. పరస్పరం కలిసి ఉండడం మేలు. ధర్మరాజును వదిలిపెట్టకు. మనసు గట్టిచేసుకొని నీ కొడుకులకు, మంత్రులకు సంధి చేసుకోమని చెప్పు’’ అన్నాడు. ధృతరాష్ట్రుడు ‘‘విదురా! నీ మాటలు నా మనసును తేటపరిచాయి. ఆలోచిస్తే ఇదే తగిన పని అనిపిస్తోంది. అలాగే చేస్తాను’’ అన్నాడు. పైకి అలా అన్నాడు కానీ ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహం, రాజ్యకాంక్ష, దాయాది వైరం వదులుకోలేక నశించిపోయాడు. ఇందులో మనం గ్రహించవలసిన నీతులు అనేకం ఉన్నాయి. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఎంపీ అరవిందును కలిస్తే తప్పేంటి..?
సాక్షి, హైదరాబాద్: ‘నేను పార్టీ మారితే బాగుండని మా పార్టీ నేతలే కొందరు ఆనందపడ్డారు. నేను వేరే పార్టీలోకి వెళ్లాలని వారు కోరుకుంటున్నారు. సెపె్టంబర్ 17న ఓ మైనార్టీ ఎమ్మెల్యేగా బీజేపీలో చేరతానని ఎలా అనుకుంటారు’అని టీఆర్ఎస్ పార్టీ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ వ్యాఖ్యా నించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శనివా రం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో పిచ్చాపాటీ గా మాట్లాడారు. ‘మా ఇంటి పక్కనే ఉండే నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరి్వంద్‌ను కలిస్తే తప్పేంటి. నేను పార్టీ మారాలనుకుంటే చెప్పే వెళ్తా. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. గోడమీద పిల్లిలా ఉండను’ అని షకీల్ కామెంట్ చేశారు. నేను గతం లో బీజేపీ నిజామాబాద్ జిల్లా మైనార్టీ మోర్చాలో పనిచేశా. నా మీద కేసులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. గతంలో నా మీద ఉన్న రెండు కేసుల్లో నిర్దోíÙగా నిరూపించుకున్నా. నా మీద ఒక్క కేసు ఉన్నట్లు నిరూపించినా ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తా’అని షకీల్ ప్రకటించారు. విప్ పదవితో గాంధీ సంతోషంగా లేరు ‘పదవులు రావాలని కోరుకోవడం.. రాకుంటే బాధ ఉండటం సహజం. అందరికీ పదవులు కావాలంటే సాధ్యం కాదు. మనలో ఎవరికి పదవులు వచి్చనా ఒకరికొకరు సహకరిం చుకోవాలి’అని మిర్యాలగూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు అన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తనకు విప్ పదవి రావడం పట్ల హ్యాపీగా లేరు. మంత్రి కావాలని అనుకున్నారు. ఈ విషయం తెలిసి తుమ్మల నాగేశ్వర్రావు తన ఇంటికి పిలిచి మంద లించారు. కమ్మ సామాజికవర్గానికి ఒక మంత్రి పదవితోపాటు విప్ పదవి కూడా ఇచ్చారు. ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వంతో చర్చించాలి తప్ప రచ్చ చేసుకోవద్దని చెప్పారు. ఎవరికి పదవి వచి్చనా జిల్లాలో అందరినీ కలుపుకుపోవాలని చెప్పామని భాస్కర్‌రావు వ్యాఖ్యానించారు. – ఎమ్మెల్యే భాస్కర్‌రావు నారదాసు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు ‘టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లు ఎవరు’ అనే అంశంపై ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్లు.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లోనూ ప్రస్తావనకు వస్తున్నాయి. అసెంబ్లీ లాబీలో ఎదురైన మీడియా ప్రతినిధులు ‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు అనే ది అప్రస్తుతమని’ ఇటీవల ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు చేసిన కామెంట్లను ప్రస్తావించారు. రామలింగారెడ్డి స్పందిస్తూ.. నక్సలిజం భావజాలం నుంచి వచి్చన నారదాసు అలా మాట్లాడటం కరెక్ట్‌గా లేదనే విషయాన్ని ఆయనకు ఫోన్ చేసి చెప్పానన్నారు. తన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వక్రీకరిస్తున్నారని సమాచారం అం దడంతో అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తులకు లింగ వివక్ష ఉండదు. ఇష్టాగోష్టిగా మాట్లాడిన మాటలను వక్రీకరించవద్దు’అని కోరారు. – ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి -
మిర్యాలగూడ ఎన్నికల్లో గురుశిష్యులే ప్రత్యర్థులు!
-
డూప్లికెట్ మెమోకు లంచం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి డూప్లికేట్ మెమోకు లంచం తీసుకుంటుండగా ప్రభుత్వ పరీక్షల విభాగం సూపరింటెండెంట్ భాస్కర్‌రావు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కాడు. తనకు డూప్లికేట్ మెమో జారీ చేయాలని అహ్మద్ అబ్దుల్ హసీబ్ అక్బర్ భాస్కర్‌రావును కోరాడు. అయితే మెమో ఇచ్చేందుకు రూ.5 వేలు లంచంగా ఇవ్వాలని భాస్కర్‌రావు డిమాండ్ చేశాడు. దీంతో హసీబ్ అక్బర్ ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం అక్బర్ వద్ద రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా భాస్కర్‌రావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే గతంలో కూడా భాస్కర్‌రావు డూపికేట్ మెమోకు రూ.1,500 లంచం తీసుకుంటూ పట్టుబడినట్టు ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్రావు తెలిపారు. మూడేళ్లలో ఇది రెండోసారని, భాస్కర్‌రావును కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్టు వెల్లడించారు. లంచం డిమాండ్ చేసే అధికారులపై టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. -
‘కాంగ్రెస్ నేతల ఆస్తులపై విచారణకు సిద్ధమేనా’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి ఆస్తులపై బహిరంగ విచారణకు సిద్ధమేనా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎన్.భాస్కర్‌రావు సవాల్ చేశారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ దశాబ్దాలుగా అధికారంలో ఉంటూ కోట్లాది రూపాయల అక్రమార్జన కు పాల్పడిన కాంగ్రెస్ నేతలే అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుం టే కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భం గా ద్రోహులకు సద్ది మోసిన చరిత్ర కాంగ్రెస్‌దని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని నవాజ్ షరీఫ్ కుటుంబంతో పోల్చిన కోమటిరెడ్డికి పిచ్చి ముది రిందని, కాంగ్రెస్ నేతలకు 2019 ఎన్నికలే చివరి వని హెచ్చరించారు. ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి వంటివారే కుటుంబపాలన గురించి మాట్లాడటం విడ్డూరమని భాస్కర్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల దిగజారుడు విమర్శలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని శేఖర్‌రెడ్డి అన్నారు. -
మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను చిన్న చూపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన వారిని చులకన చూస్తున్నందునే తమ నియోజక వర్గంలో బీటీ రోడ్ల పునరుద్దరణ జరపటంలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కర్‌రావు ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. ఆయన బాటలోనే బీటీ రోడ్ల వ్యవహారంపై మరికొంత మంది ఎమ్మెల్యేలు పెదవి విరిచారు. పదేళ్లుగా తన నియోజకవర్గంలో బీటీ రోడ్లు పునరుద్ధరణ చేపట్టలేదని, జరిగినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని అధికార పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి వ్యాఖ్యానించటంతో ఆశ్చర్యపోవడం అధికార పార్టీ నేతల వంతైంది. పనిలోపనిగా తన నియోజకవర్గం కూడా వెనకబడిందని, బీటీ రోడ్ల పై దృష్టి పెట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా కోరారు. ఈ సమస్య అన్ని నియోజకవర్గాల్లో ఉందని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. బీటీ రోడ్లపై సభ్యుల ప్రశ్నలకు పంచాయతీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానాలిస్తారని చెప్పారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన పలువురు ఎమ్మెల్యేలు ఇమడలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా లేక సొంతగూటికి వెళ్లేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది చర్చనీయాంశమైంది. -
లంచం తీసుకున్న ఇద్దరికి కఠిన శిక్ష
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): పట్టా భూమి పేరు మార్పునకు లంచం డిమాండ్ చేసిన వీఆర్వోకు ఏడాది, ఆయన అసిస్టెంట్‌కు ఆర్నెళ్లపాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం ఏసీబీ కోర్టు కరీంనగర్ ప్రత్యేక న్యాయమూర్తి భాస్కర్‌రావు తీర్పు చెప్పారు. బీర్కూర్ మండలం మైలారం గ్రామానికి చెందిన వెన్నం వెంకట్రామయ్య 1970లో మిర్జాపూర్ శివారులో 5.20 గుంటల భూమిని సబ్బిడి భూమయ్య, సబ్బిడి విఠల్ల నుంచి కొన్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు. ఈయన మరణాంతరం 5.20 గుంటల వ్యవసాయ భూమిని అన్నలిద్దరు తమతమ పేర్లమీదకు మార్చుకోగా చిన్నవాడైన వెన్నం రామకృష్ణ తన భాగం భూమిని తన పేరుమీదకు మార్చేందుకు 28 జనవరి 2009న మిర్జాపూర్ వీఆర్వో కొమ్ము మురళికి దరఖాస్తు చేశాడు. అందుకు వీఆర్వో తనకు రూ.2100లు లంచం ఇస్తేనే విచారించి తహసీల్దార్‌కు నివేదిక ఇచ్చి పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ ఇప్పిస్తానని, లేదంటే కుదరదని చెప్పాడు. అనంతరం వీఆర్వో కొద్దిరోజుల తర్వాత పాస్‌బుక్ టైటిల్ డీడ్లు సిద్ధంగా ఉన్నాయని, 26 ఫిబ్రవరి 2009న లంచం డబ్బులు తనను ఇంట్లో కలిసి ఇచ్చి వాటిని తీసుకెళ్లాలని చెప్పాడు. దాంతో రామకృష్ణ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అదే రోజు ఏసీబీ అధికారులను కలిసి వీఆర్వోపై ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడు రామకృష్ణ వీఆర్వోకు లంచం డబ్బులు ఇవ్వగా ఆయన ఆ డబ్బులను తన అసిస్టెంట్ శ్రీనివాస్‌కు ఇచ్చి దగ్గర పెట్టుకోవాలని చెప్పాడు. శ్రీనివాస్ డబ్బులు లెక్క పెడుతుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు వారిని రెడ్హాండ్గా పట్టుకున్నారు. ఈ కేసులో బుధవారం ఏసీబీ తరపున ప్రత్యేక పీపీ లక్ష్మీప్రసాద్ వాదనలు వినిపించారు. ఇరువార్గల వాదనలు విన్న న్యాయమూర్తి భాస్కర్‌రావు వీఆర్వో మురళీకి ఏడాది, రూ.5వేలు, అతడి అసిస్టెంట్ శ్రీనివాస్‌కు ఆర్నెళ్ల శిక్ష, రూ. 2500లు జరిమానాలు విధిస్తూ తీర్పు చెప్పారు. -
అమరావతి కేంద్రంగానే అభివృద్ధి తగదు!
కడప రూరల్: కేవలం అమరావతి కేంద్రంగా అభివృద్ధి చేయాలనుకోవడం ఎంతమాత్రం తగదని, అది అనర్థాలకు దారి తీస్తుందని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపీడీఆర్) కేంద్ర కమిటీ అధ్యక్షుడు సి.భాస్కర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం వైఎస్సార్ జిల్లా కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల్లో 15 శాతం కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఇక రాయలసీమ గురించైతే ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అనంతపురం జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ‘ఎయిమ్స్’ను ఏర్పాటు చేస్తామని చెప్పి దానిని మరొక జిల్లాకు తరలించారని మండిపడ్డారు. అలాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ప్రకటించి నేడు పట్టించుకోవడం లేదన్నారు. కరువు‘సీమ’ హక్కుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం తూముకుంట గ్రామంలో సోలార్ ప్రాజెక్ట్‌కు కేటాయించిన భూముల విషయంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కడపలో 17వ రాష్ట్ర మహసభలు ఓపీడీఆర్ను 1975లో స్థాపించామని, ఇంతవరకు 17 రాష్ట్రాల్లో మహాసభలు ఏర్పాటు చేశామని భాస్కర్‌రావు తెలిపారు. అనంతపురం జిల్లాలో రెండుసార్లు సభలు నిర్వహించామని, 2018 జనవరి 20, 21వ తేదీల్లో కడపలో 17వ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆర్.రామకుమార్, ఉపాధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
భాస్కర్ రావుకు సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు
-
నిజాం మ్యూజియంలో ఫొటో ఎగ్జిబిషన్
యాకుత్‌పురా: ఏడో నిజాం హెచ్‌ఈహెచ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 50వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పురానీహవేలిలోని నిజాం మ్యూజియంలో ఆయన అంత్యక్రియలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1967 ఫిబ్రవరి 24న దివంగతులయా్యరని నిజాం మ్యూజియం క్యూరేటర్ భాస్కర్ రావు తెలిపారు. మ్యూజియంలో ఉస్మాన్ అలీ ఖాన్ ధరించిన బట్టలు, వస్తువులు, ఆభరణాలతో పాటు ఇప్పటికే సిటీ మ్యూజియం కొనసాగుతుందన్నారు. ఆయన అంత్యక్రియల్లో 10 లక్షల మంది ప్రజలు హజరయా్యరన్నారు. అంత్యక్రియల సందర్భంగా తీసిన ఫోటోలను ప్రత్యేకంగా ప్రదర్శనలో ఉంచారు. ఈ నెల 28వ తేదీ వరకు ఈ ఫోటో ప్రదర్శన కొనసాగనుంది. -
ఏసీబీ వలలో విజిలెన్స్ అధికారి
రూ.లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు నల్లగొండ, హన్మకొండలోని ఇళ్లల్లో సోదాలు నల్లగొండ టూటౌన్/వరంగల్: నల్లగొండ రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి (ఏఎస్పీ)భాస్కర్‌రావు గురువారం రూ.లక్ష తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. నల్లగొండలో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో, వరంగల్ జిల్లా హన్మకొండలోని ఆయన సొంత ఇంట్లో ఏక కాలంగా సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ డి.సునీత కథనం ప్రకారం... నల్ల గొండ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ ఏఎస్పీ భాస్కర్‌రావు పట్టణ రైస్ మిల్లర్స్ నుంచి రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉందని, కొంత తగ్గించాలని వేడుకు న్నా ఒప్పుకోలేదు. దీంతో నల్లగొండ పట్టణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రేపాల భద్రాద్రి రాములు ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నల్లగొండలోని తన అద్దె ఇంట్లో రాములు రూ.లక్ష నగదు ఇస్తుండగా ఏసీబీ హైదరాబాద్, నల్లగొండ అధికారుల బృందం పట్టుకుంది. తన స్వస్థలమైన హన్మకొండ లోని ఇల్లు మామ వీరస్వామి పేరుతో ఉన్న దని, వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మం డలంలో వ్యవసాయ భూమి, వరంగల్‌లో లేబర్ కాలనీలో ఒక భవనం ఉన్నట్లు గుర్తిం చారు. సుమారు లక్ష రూపాయల నగదు, కారు, టూ వీలర్ వెహికిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
'డిపాజిట్ తెచ్చుకుంటే వాచ్‌మెన్‌గా పనిచేస్తా'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బుధవారం ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావులు పరస్పరం మాటల యుద్దానికి దిగారు. పార్టీ మారిన ఎమ్మెల్యే భాస్కర్‌రావు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి డిపాజిట్ తెచ్చుకుంటే.. తాను టీఆర్ఎస్ ఆఫీసులో వాచ్‌మెన్‌గా పనిచేస్తానని కోమటి రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై భాస్కర్ రావు స్పందిస్తూ.. 'ఇద్దరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే.. ఎవరి సత్తా ఏంటో తెలుస్తోంది. నేను ఓడిపోతే అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటా' అని అన్నారు. -
అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడులు
ఏలూరు అర్బన్ : జిల్లాలో సారాతో పాటు అక్రమ మద్యం అమ్మకం దార్లపై నిరంతరంగా తమ సిబ్బంది దాడులు నిర్వహిస్తుందని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ (డీసీ) వైబీ భాస్కరరావు స్పష్టం చే శారు. శనివారం జిల్లావ్యాప్తంగా చింతలపూడి, కొవ్వూరు. పోలవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఎక్సైజ్ అ«ధికారులు సారా తయారీ కేంద్రాలు, అక్రమ మద్యం విక్రయాలు, సమయ వేళలు పాటించని దుకాణాలపై దాడులు నిర ్వహించారు. ఈ సందర్భంగా నిర్ణీత వేళలు పాటించని రెండు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. అదే క్రమంలో సారా తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 100 లీటర్ల సారా, 18 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని డీసీ భాస్కరరావు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచామన్నారు. -
కరెంటుషాక్‌తో ఇద్దరు మృత్యువాత
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఓ రైతు పొలంలో వరికోత యంత్రంతో కోతలు జరుపుతుండగా ప్రమాదవశాత్తు పైనుంచి వెళ్తున్న కరెంటు తీగలు మిషన్‌కు తాకాయి. దీంతో షాక్‌కు గురై యంత్రం నడుపుతున్న జగపతి(26), భాస్కర్‌రావు(30) అక్కడికక్కడే చనిపోయారు. పవన్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి..
పశ్చిమగోదావరి: బైక్ పై వెళ్తున్న ఓ యువకుడు ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసం మండలంలోని పంజావేమవరం గ్రామానికి చెందిన భాస్కరరావు(23) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో ఇంటి నుంచి బైక్ పై భీమవరానికి బయల్దేరాడు. గ్రామ శివారులో ట్రాక్టర్ ను దాటుతున్న సమయంలో ఎదురుగా ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు రావడంతో బైక్ తో దాన్ని ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలపైన భాస్కర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్ధానికుల సమాచారంతో అక్కడి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?
కాంగ్రెస్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు నాడు మా 26 మంది ఎమ్మెల్యేల్లో 10 మందిని చేర్చుకోలేదా? రాష్ట్రం వ చ్చాక కూడా కాంగ్రెస్, టీడీపీ కుట్రలు చేశాయి బెర్లిన్ గోడ బద్దలైనట్టు మళ్లీ రెండు రాష్ట్రాలు కలుస్తాయన్నాడు చంద్రబాబు.. ఈ ప్రభుత్వం ఎల్లుండే పడిపోతుందన్నడు భట్టి తెలంగాణకు నీళ్లు వద్దన్న తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ జతకట్టడం ఏం నీతో జానారెడ్డి చెప్పాలి రాష్ట్రం రాజకీ య, ఆర్థిక సుస్థిరత సాధించాలి.. తెలంగాణకు టీఆర్ఎస్సే రక్షణ కవచం మేం పిలవడం లేదు.. అభివృద్ధిని చూసి వారే వస్తున్నారు టీఆర్ఎస్లో చేరిన ఎంపీ గుత్తా, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, కాంగ్రెస్ నేతలు వివేక్, వినోద్ సాక్షి, హైదరాబాద్: ‘‘నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమం కోసం గెలిచిన 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 10 మందిని చేర్చుకున్నారు. ఆనాడు లేని నీతి ఇప్పుడెలా గుర్తుకొచ్చింది? సరిగ్గా ఎన్నికల ముందు మా ఎంపీ విజయశాంతిని, ఎమ్మెల్యే అరవిందరెడ్డిని చేర్చుకోలేదా..? మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా..?’’ అని సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రం రాజకీయ, ఆర్థిక సుస్థిరత సాధించాలని, తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టంచేశారు. బుధవారం కాంగ్రెస్‌కు చెందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, దేవరకొండ నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కాంగ్రెస్ మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ గుత్తా మాత్రం టీఆర్ఎస్ కండువా కప్పుకోలేదు. కాంగ్రెస్ నుంచి ఒక జెడ్పీ వైస్ చైర్మన్, ముగ్గురు ఎంపీపీలు, ఆరుగురు జెడ్పీటీసీ సభ్యులు, ఒక మున్సిపల్ చైర్పర్సన్, ఐదుగురు కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ నేతల తీరును తూర్పారబట్టారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. నేను బతికా.. ప్రజలు ఆనందపడ్డరు.. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో 14ఎఫ్ మార్పిడికి నిరసనగా ఆమరణ దీక్షకు దిగా. కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది. దీక్ష సమయంలో నేను చావాల్సింది.. కానీ చావలేదు. ప్రజలు ఆనందపడ్డరు. అంతకుముందు ఎన్నోసార్లు తెలంగాణ కోసం మేం మూకుమ్మడి రాజీనామాలు చేసి పోటీకి వెళ్తే మాపై పోటీకి వచ్చారు. కానీ ప్రజలు మమ్ముల్నే గెలిపించారు. రాష్ట్రం వచ్చాక కూడా అనేక చర్యలకు పాల్పడ్డరు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే 63 సీట్లలో గెలిచినం. మరో 14 సీట్లలో వెయ్యిలోపు ఓట్ల తేడాతో ఓడిపోయినం. బాబు మామూలు కుట్రలు చేయలే.. తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు మామూలు కుట్రలు చేయలేదు. బెర్లిన్ గోడ బద్దలై జర్మనీ ప్రజలు కలసిపోయినట్లు ఏపీ, తెలంగాణ మళ్లీ కలసిపోతయని మాట్లాడిండు. కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అయితే.. ఎల్లుండే ప్రభుత్వం పడిపోతదన్నడు. నేను సీఎంగా బాధ్యతలు తీసుకోక ముందే కుట్రలు చేసిండ్రు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నాకు ఫోన్ చేసి ఇంటికొచ్చిండు. టీడీపీ, కాంగ్రెస్ ఏకమై టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకుండా కుట్రలు చేస్తున్నయని చెప్పిండు. రాష్ట్రపతి పాలన తెచ్చే కుట్రలు చేస్తున్నరని చెప్పిండు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇదేందన్నడు. టీఆర్ఎస్కు మద్దతిస్తామని తెల్లారే ప్రకటించిండు. కాంగ్రెస్, టీడీపీ నేతల లక్ష్యం ఒక్కటే.. తెలంగాణ రాష్ర్టం ఏర్పడొద్దు. ఏర్పడితే బతకొద్దు. జానారెడ్డి రాష్ట్రం భ్రష్టు పడుతోందని అంటున్నడు. కాదు కాదు.. కాంగ్రెస్ భ్రష్టు పడుతోంది. కేసీఆర్‌కు ఒక్కటే నీతి.. తెలంగాణ రాష్ట్రం తన శక్తి మీద తాను నిలబడాలి. రాజకీయ సుస్థిరత, ఆర్థిక సుస్థిరత సాధించాలి. సమైక్యవాదుల కుట్రలకు బలికావొద్దు. బలంగా ఉండాలి. తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. 2019 కంటే ముందే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు అంటడు. చంద్రబాబూ.. ప్రభుత్వం కూలిపోతుందని అనడం ఏం నీతి? అది సక్రమమైన ఆలోచనా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఉండగానే అట్లెట్ల అంటడు? తెలంగాణకు నీళ్లు వద్దంటడు. పాలేరు ఉప ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ జతకట్టడం ఏ రకమైన నీతో జానారెడ్డి చెప్పాలి. అచ్చంపేట ఎన్నికల్లో అందరూ కలసి కూటమి కడతరు. ఇదేం నీతి? మీరు చేస్తే నీతి.. మేం చేస్తే అవినీతా? అభివృద్ధిని చూసే వస్తున్నారు.. టీఆర్ఎస్లోకి వలస వస్తున్న వారిని మేం పిలవడం లేదు. జరుగుతున్న అభివృద్ధిని చూసి వస్తున్నరు. ఇవి చిల్లర మల్లర రాజకీయ చేరికలు కావు. వీటిని అలా చూడటం లేదు. చాలా మందికి అనుమానాలు, అపోహలు ఉన్నాయి. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సొంత నిర్ణయంతో వచ్చారు. మేం రమ్మన లేదు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు కూడా ఏడాదిన్నరగా మాతో టచ్‌లో ఉన్నారు. అమ్ముడుపోయారని, కేసీఆర్ కొన్నాడని అంటున్నారు. మాజీ ఎంపీ వివేక్ కేవలం తన తండ్రి కోరిక మేరకే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. వెళ్లే ముందు నాకు చెప్పి వెళ్లారు. మీ పాలనలో మంచి పనులు జరుగుతున్నాయి. కలసి పనిచేస్తానని, మళ్లీ పార్టీలోకి వస్తానన్నారు. సుఖేందర్‌రెడ్డి, నేనూ ఆప్త మిత్రులం. 1996లోనే శ్రీరాంసాగర్ డ్యామ్‌పై కూర్చుని తెలంగాణ గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆంధ్రా ప్రాంతానికి నీళ్లు తీసుకుపోయే నాగార్జున సాగర్ వైష్ణవాలయంలా ఉంటే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు శివాలయంలా ఉందన్న. ఏపీలో ఉన్నన్ని రోజులు తెలంగాణకు న్యాయం జరగద ని ఆ రోజే చెప్పిన. 2001లో నేనే ఉద్యమం మొదలు పెట్టా. తెలంగాణది వందేళ్ల దుఃఖం. సమైక్య రాష్ట్రంలో చేరి కష్టాలు పడ్డాం. ఇప్పుడు ప్రతి పేద కుటుంబానికి మేలు చేస్తాం. పేదరికాన్ని రూపుమాపుతం. 2019లోగానే కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తం. సాదా బైనామాల రిజిస్ట్రేషన్‌కు గడువు పొడిగింపు ఈ సమావేశానికి వచ్చే ముందే సీసీఎల్ఎతో మాట్లాడా. సాదా బైనామాల రిజిస్ట్రేషన్లకు డిమాండ్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సాదా బైనామాలకు సంబంధించి 6 లక్షల మంది ఆర్వోఆర్ పట్టాలు పొందారు. మరో వారం రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగిస్తున్నాం. చరిత్రలో ఎవరూ ఈ ఆలోచన చేయలేదు. దీంతోపాటు హైదరాబాద్‌లో పేదలకు ఇప్పటికే లక్ష మందికి పట్టాలిచ్చాం. తెలంగాణ సమాజాన్ని సుస్థిరం చేయడమే మా లక్ష్యం. నేను మళ్లీ చెబుతున్నా.. టీఆర్ఎస్కు ప్రజలే బాసులు. సొల్లు కబుర్లు వద్దు. నిర్మాణాత్మక సలహాలివ్వండి. కేసీఆర్‌ను తిడితే ఏం జరగదు. 2019లోనూ గెలిచేది కూడా టీఆర్ఎస్సే. -
వారి చర్య మాతృద్రోహం
గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్‌రావులపై వీహెచ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నంతకాలం పదవులను అనుభవించి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీపై నిందలు వేసి టీఆర్ఎస్లోకి వెళ్తున్న గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్రావులది మాతృద్రోహమని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంతర్గత ప్రజాస్వామ్యం కేవలం కాంగ్రెస్ లోనే ఉందని, టీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం ఎంతుందో త్వరలోనే వారికి తెలుస్తుందన్నా రు. పార్క్ హయత్ పక్కన ఉన్న స్థలాన్ని దక్కించుకోవడానికి వివేక్, వినోద్, సాగునీటి పనుల కాంట్రాక్టుల కోసం గుత్తా టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. గుత్తా విలువ లు, ఆత్మను అమ్ముకున్నారని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేకు న్నా ఎంపీ టికెట్ వచ్చే లా సహకరించిన జైపాల్‌రెడ్డి, జానారెడ్డిలకు ద్రోహం చేసి టీఆర్ఎస్లోకి వెళ్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ మారడం వ్యభిచారంతో సమానమని చెప్పిన గుత్తా ఇప్పుడు ఎలా మారుతున్నారన్నారు. దమ్ముంటే ఎంపీ పదవికి గుత్తా రాజీనామా చేసి పోటీ చేయాలని వీహెచ్ సవాల్ విసిరారు. పార్టీ మారే నాయకులు పందికొక్కులకన్నా ప్రమాదకరమని, వారి అసలు స్వరూపం కేసీఆర్‌కు కూడా త్వరలోనే తెలుస్తుందని వీహెచ్ హెచ్చరించారు. పదవులకు రాజీనామా చేయాలి... కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్ఎస్లో చేరనున్న ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ వెంటనే పదవులకు రాజీనామా చేయాలని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు బి.బిక్షమయ్యగౌడ్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. కాంట్రాక్టులు, పదవుల కోసమే వారు పార్టీలు మారుతూ బంగారు తెలంగాణ అంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ మారడం అంటే తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని మోసం చేయడమేనన్నారు. టీఆర్ఎస్కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నా రు. మిషన్ భగీరథ అక్రమాలపై 120 కిలోల పేపర్లను సేకరించిన గుత్తా టీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. -
బంగారు తెలంగాణ కోసమే...
టీఆర్ఎస్లోకి వెళుతున్నామన్న గుత్తా, వివేక్, భాస్కర్‌రావు, రవీంద్రకుమార్ సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సహకరించాలనే టీఆర్ఎస్లో చేరుతున్నామని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్, మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, దేవరకొండ సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌నాయక్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని వివేక్ నివాసంలో సోమవారం విలేకరులతో వారు మాట్లాడారు. బుధవారం టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. ఓటర్లు ఒత్తిడి తెచ్చారు: గుత్తా కాంగ్రెస్ పార్టీని వీడాల్సి రావడం బాధాకరంగానే ఉందని గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్‌రావు పేర్కొన్నారు. అయితే పార్టీలోని అంతర్గత కలహాలు, నాయకుల మధ్య విబేధాలతో తాము తీవ్రంగా కలత చెందామన్నారు. సీనియర్ల మధ్య అంతర్గత విభేదాలు నాయకులను అయోమయానికి, గందరగోళానికి గురిచేస్తున్నాయని గుత్తా ఆరోపించా రు. వీటి వల్ల పార్టీ బలహీనపడుతోందన్నా రు. షోకాజ్ నోటీసులు ఇచ్చి పార్టీని కాపాడుకునే పరిస్థితి కాంగ్రెస్‌కు వచ్చిందన్నారు. టీఆర్ఎస్లో చేరాలంటూ తన ఓటర్లు ఒత్తిడి తెచ్చారని గుత్తా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహించానని...ఎంపీగా పోటీ చేయడానికి పార్టీ రెండుసార్లు అవకాశం ఇచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తెలంగాణ దేవతగా గుత్తా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. సమయం, సందర్భాన్ని బట్టి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. పదవులు ఇస్తామని టీఆర్ఎస్ ఇప్పటిదాకా తనకు కమిట్మెంట్ ఇవ్వలేదన్నారు. జిల్లాలో ఏర్పాటవుతున్న యాదాద్రి పవర్‌ప్లాంటు, నల్లగొండ జిల్లా అభివృద్ధికోసం సీఎం కేసీఆర్‌తో కలసి పనిచేస్తానని ప్రకటించారు. పథకాలు ఆకర్షించాయి: వివేక్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మిషన్ కాకతీయ వంటి పథకాలు తనను ఎంతగానో ఆకర్షించాయని మాజీ ఎంపీ వివేక్ చెప్పారు. పార్టీలోకి వస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అడిగారని వెల్లడించారు. పార్టీలో ఇప్పటిదాకా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో కృష్ణా పుష్కరాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 300 కోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటిదాకా కేసీఆర్‌ను తాను కలవలేదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పారు. -
సర్పంచ్ మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం కల్కనూరు గ్రామ సర్పంచ్ ముత్తమ్మ (70) శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఎంపీపీ కరుణాకర్‌రెడ్డి ఆదివారం ముత్తమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
పిస్టల్ కలకలం...
పిస్టల్, ఐదు బుల్లెట్లతో ఇద్దరి అరెస్టు గంజాయి స్మగ్లర్లు ఇచ్చారంటున్న నిందితులు మావోలకు చేరవేస్తున్నారని అనుమానం పెదబయలు : మండలంలో ఆదివారం రాత్రి పోలీసులు ఇద్దరు గిరిజనులకు ఆదుపులో తీసుకుని వారి నుంచి పిస్టల్, ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న సంఘటన మండలంలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం, పెదకోడాపల్లి పంచాయితీ కొత్తపోయిపల్లి గ్రామానికి చెందిన పాంగి భాస్కర్‌రావు, ఇదే గ్రామానికి చెందిన భాస్కర్‌రావుల నుంచి ఐదు నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన గంజా యి స్మగ్లర్ గంజాయి కొనుగోలు చేసి, కొంత సొమ్ము చెల్లించాడు. మిగతా డబ్బు కోసం పిస్టల్‌ను తనఖా పెట్టాడు. అయితే ఐదు నెలలు గడిచినా మహారాష్ట్ర స్మగ్లర్ రాకపోవడంలో పిస్టల్‌ను విక్రయించాలని భాస్కరరావులు ఇద్దరూ భావించారు. మారుమూల ప్రాంతంలో దానిని విక్రయించడానికి ఇద్దరూ కలిసి ఆదివారం పిస్టల్ పట్టుకుని వెళుతున్న సమయంలో పెదకోడాపల్లి లక్ష్మీపేట మార్గమధ్యంలో పోలీసులకు దొరికిపోయారు. పిస్టల్‌తో దొరికిన పాంగి భాస్కర్‌రావు గతంలో 15 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. పాడేరులో రెడ్డి జ్యూయలరీపై దాడి కేసులో నిందితుడు కావడంతో పోలీసులు అతను చెప్పినదానిపై ఆధారపడకుండా భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వారి వద్ద నిజంగా గంజాయి స్మగ్లర్లు పిస్టల్, బుల్లెట్లు డబ్బు కోసం ఉంచి వెళ్లారా? లేక మావోయిస్టులకు చేరవేతకు తరలిస్తున్నారా? అనేది విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై పాడేరు సీఐ సాయిని ‘సాక్షి’ వివరణ కోరగా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. -
ఏ ఫిర్యాదులు తీసుకోకండి...
సిబ్బందికి లోకాయుక్త మౌఖిక ఆదేశాలు ! లోకాయుక్త రాజీనామాపై శుక్రవారం సైతం కొనసాగిన ఆందోళనలు బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు లోకాయుక్తలో ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు సమాచారం. స్వయంగా లోకాయుక్త పైనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే వరకు ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించరాదని ఆయన లోకాయుక్త సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. లోకాయుక్త వై.భాస్కర్‌రావు కుమారుడు అశ్విన్‌రావుపై కోట్ల రూపాయల్లో అవినీతి ఆరోపణలు వస్తుండడంతో పాటు ఇందుకు భాస్కర్‌రావు సైతం మద్దతుగా నిలిచారనే ఆరోపణల మధ్య లోకాయుక్త రాజీనామా చేయాలంటూ ప్రజాసంఘాలు, న్యాయవాదులు లోకాయుక్త కార్యాలయంతో పాటు ఆయన నివాసం ఎదుట సైతం నిరసనకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారుల అవినీతికి సంబంధించి ఆర్టీఐ కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించవద్దని, ఎలాంటి విచారణను చేపట్టవద్దని లోకాయుక్త భాస్కర్‌రావు, లోకాయుక్త ఏడీజీపీ ప్రేమ్‌శంకర్ మీనాను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఫిర్యాదులు చేసేందుకు వస్తున్న సామాన్యులను లోకాయుక్త కార్యాలయం ఎదుట ఉన్న పోలీసులు బయటి నుంచే పంపించి వేస్తున్నారు. తమను ఇబ్బంది పెట్టే అవినీతి అధికారుల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి నగరానికి వచ్చిన సామాన్యులు తమ ఫిర్యాదులు నమోదు చేసుకోకుండానే వెనక్కు పంపేస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక తీవ్ర ఆవేదనతో లోకాయుక్త కార్యాలయం నుంచి వెనుదిరుగుతున్నారు. శుక్రవారం సైతం కొనసాగిన ఆందోళనలు.... ఇక లోకాయుక్త వై.భాస్కర్‌రావు తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం సైతం ఆందోళనలు కొనసాగాయి. లోకాయుక్త రాజీనామాను డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు నగరంలో ర్యాలీని నిర్వహించారు. గాంధీనగర నుంచి ర్యాలీగా బయలుదేరిన కరవే కార్యకర్తలు లోకాయుక్త కార్యాలయానికి చేరుకొని, లోకాయుక్తను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో కొంతమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక బార్‌కౌన్సిల్ సభ్యులు సైతం లోకాయుక్త కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ కేసును సీబీఐకి అప్పగించే వరకు తమ పోరాటాన్ని ఆపబోమని న్యాయవాదులు, ప్రజాసంఘాల నేతలు తెలిపారు. ఇక లోకాయుక్త పై వచ్చిన ఆరోపణలను సాకుగా చూపుతూ కొన్ని చిన్న చేపలను బలిపశువులు చేసి ఎన్నో పెద్ద తిమింగళాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తునానయని ‘న్యాయక్కాగి నావు’ సంస్థ విమర్శించింది. శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ పదాధికారుల్లో ఒకరైన అగ్ని శ్రీధర్ మాట్లాడుతూ....‘ఎంతో కాలంగా లోకాయుక్తలో అవినీతి జరుగుతూనే ఉంది. ఈ అవినీతిని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇందుకు ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన రావాలి’ అని పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై ప్రముఖ న్యాయవాది ఎ.కె.సుబ్బయ్య స్పందిస్తూ అవినీతి ఆరోపణలు వచ్చినంత మాత్రాన లోకాయుక్త పదవిలో ఉన్న వారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆరోపణలు రుజువైతేనే రాజీనామా కోరాల్సి ఉంటుందంటూ భాస్కర్‌రావుకు మద్దతుగా నిలిచారు. -
శ్రీశైలం సొరంగం పూర్తి చేయాలి
మిర్యాలగూడ : శ్రీశైలం సొరంగ మార్గాన్ని త్వరగా పూర్తిచేసి జిల్లాకు సాగునీటిని అందించాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం స్థానిక ఆయన నివాసంలో ఎమ్మెల్యే ఎన్.భాస్కర్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.4500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చెల్లింపులు నిలిచిపోవడం వల్ల సొరంగం పనులు ఆగిపోయాయని, నిధులు విడుదల చేసి 2015-16 వరకు పూర్తిచేయాలన్నారు. శ్రీశైలం సొరం గం 53 కిలోమీటర్లకు ఇప్పటివరకు 31కిలోమీటర్లు పూర్తయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పనులు పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు జిల్లాలో ఏఎమ్మార్పీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అదే విధంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు తెలంగాణకు ఏదో మంచి చేయాలని తపన ఉన్నప్పటికీ మంత్రులకు శాఖలపై పట్టులేదన్నారు. ఉద్యమ కాలంలో అన్ని రాజకీయ పార్టీలను తిట్టినట్లుగానే అధికారంలోకి ఇచ్చినా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలపై ఆరోపణలు మాని ప్రస్తుతం బంగారు తెలంగాణ సాధనకు కృషి చేయాలన్నారు. అదే విధంగా మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెలే భాస్కర్‌రావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి తన మార్కును నిలబెట్టుకోవాలన్నారు. గత ప్రభుత్వాలనే విమర్శిస్తూ జగదీష్‌రెడ్డి కాలం వెల్లదీస్తున్నాడన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు నాగలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోశయ్య తదితరులు పాల్గొన్నారు. -
రూ. 5.5 కోట్ల పొగాకు బుగ్గి
చిలకలూరిపేట రూరల్: మండలంలోని బొప్పూడి రెవెన్యూ పరిధిలో మంగళవారం అగ్నిప్రమాదంలో గోదాములోని పొగాకు బుగ్గి పాలైంది.చిలకలూరిపేట అగ్నిమాపక శాఖాధికారి వేలూరు భాస్కరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ రహదారి సమీపంలో మెసెస్ సుబ్బయ్య పిళ్ళై (మద్ది లక్ష్మయ్య) కంపెనీ ఆవరణలో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో రెండో వరుసలోని రెండో గోడౌన్ నుంచి మంటలు చెలరేగడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే కంపెనీ ప్రతినిధులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. గోదాములో నిల్వ ఉంచిన 3.50 లక్షల కిలోల పొగాకు బేళ్లకు మంటలు వ్యాపించాయి. అధికారులు చిలకలూరిపేట, బాపట్ల, గుంటూరు-1,2, నరసరావుపేటలకు చెందిన ఐదు అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ప్రమాదంలో రూ.5.5 కోట్ల పొగాకు కాలి బూడిదైంది. గోడౌన్‌పై కప్పుగా ఏర్పాటు చేసిన రేకులు కుప్పకూలాయి. రూ 1.5 కోట్లు విలువ చేసే గోడౌన్ నిరుపయోగంగా మారింది. ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్న పొగాకు అగ్నిప్రమాదంలో బూడిదగా మారడంతో కంపెనీ ప్రతినిధులు వాపోయారు. జిల్లా అగ్నిమాపకశాఖాధికారి జిలానీ, సహాయాధికారి రత్నబాబు, తహశీల్దార్ ఫణీంద్రబాబు, రూరల్ సీఐ సంజీవ్‌కుమార్, ఎస్ఐ జగదీష్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
రాజీనామాలు చేయనున్న ఏజీ, అదనపు ఏజీ!
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో నేడు అపాయింట్మెంట్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అడ్వొకేట్ జనరల్(ఏజీ)గా ఉన్న ఎ. సుదర్శన్‌రెడ్డి, అదనపు అడ్వొకేట్స్ జనరల్ కె.జి.కృష్ణమూర్తి, బి. భాస్కరరావు తమ పదవులకు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారు మంగళవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావును కలవనున్నారు. ఈ మేరకు సీఎంతో వారికి అపాయింట్మెంట్ కూడా ఖరారైనట్టు సమాచారం. కేసీఆర్‌కే వారు స్వయంగా తమ రాజీనామా లేఖలను అందజేయనున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సుదర్శన్‌రెడ్డి ఏజీగా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందే, ప్రస్తుతం ఉన్న ఏజీ, అదనపు ఏజీలు, ప్రభుత్వ న్యాయవాదులను తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆ పోస్టుల్లోనే కొనసాగాలని ప్రభుత్వం గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ సుదర్శన్‌రెడ్డి రాజీనామాకు సిద్ధపడటం న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన సన్నిహితులతో చర్చించిన తర్వాతనే సుదర్శన్‌రెడ్డి ఏజీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా సోమవారం ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నించారు. అయితే కేసీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా సాధ్యం కాలేదు. దీంతో మంగళవారం ఉదయం వారు కేసీఆర్‌ను కలవనున్నారు. -
ప్రాణాలు తీశాయా..?
మూడేళ్లుగా కోర్టులో నలుగుతున్న భూతగాదా కేసు నేపథ్యంలోనే ఆ దంపతుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారా అన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ విధులు నిర్వహిస్తున్న భార్యాభర్తలు గురువారం రాత్రి మక్కువ మం డ లంలో హత్యకు గురయ్యారు. భూతగాదా కేసు వాయిదా శుక్రవారం ఉండగా ప్రత్యర్థులే మాటువేసి ముందు రోజు హత్యలకు తెగబడ్డారని స్థానికులు, బంధువులు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మక్కువ మండలంలోని ఎస్.పెద్దవలస గ్రామానికి చెందిన వేమల భాస్కరరావు(56), లక్ష్మీకాంతం(50) గురువారం రాత్రి హత్యకు గురైనా శుక్రవారం ఉదయం వరకూ బయట ప్రపంచానికి తెలియ లేదు. సొంత గ్రామానికి కూతవేటు దూరంలో ఈ సంఘటన జరిగినా, అది నిర్జన ప్రదేశం కావడంతో రాత్రంతా మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయారు. గ్రామానికి చెందిన భాస్కరరావు అదే వెంకటభైరిపురంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, భార్య లక్ష్మీకాంతం పాచిపెంట జెడ్పీ హైస్కూలులో పనిచేస్తున్నారు. లక్ష్మీకాంతం పనిచేస్తున్న పాఠశాలలో గురువారం జరిగిన వార్షికోత్సవానికి ఆమె హాజరై తిరిగి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది. ఆటోలో శంబర వరకు ఆమె చేరుకోగా గ్రామం నుంచి భాస్కరరావు ద్విచక్రవాహనం తీసుకుని శంబర వెళ్లారు. రాత్రి సుమారు 9.30గంటల సమయంలో ఎస్.పెద్దవలస గ్రామం ముందు తీళ్లవాని చెరువు వద్ద దారికాసిన దుండగులు ఇనుప రాడ్డుతో ఇద్దరి తలలపై బలంగా మోదడంతో ఆ దంపతులు అక్కడే పడిపోయారు. తీవ్ర రక్తస్రావం అవడంతో భాస్కరరావు అక్కడే మృ తి చెందారు. శంబర గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు శుక్రవారం ఉదయం చూడడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. స్థానికుల సమాచారం మేరకు పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ సంఘటనా స్థలానికి వచ్చి లక్ష్మీకాంతం కొనఊపిరితో ఉన్నట్లు గమనించి వెంటనే 108 వాహనంలో బొబ్బిలి తరలించారు. అయితే ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. మృతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె నీలిమరాణి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి-భీమవరంలో, చిన్నకుమార్తె భారతీ దేవి విశాఖలో, కుమారుడు సాయిఅభిలాష్ ఒడిశాలోని రౌర్కెలాలో చదువుతున్నారు. పిల్లలు ముగ్గురు చదువుకునే వయసులో ఉండగా తల్లిదండ్రులు హత్యకు గురికావడంతో వారు అనాథలయ్యారని బంధువులు, గ్రామస్తులు రోదించారు. తగాదా నేపథ్యం ఇది.. గ్రామానికి చెందిన అల్లు సత్యనారాయణకు, హత్యకు గురైన ఉపాధ్యాయ దంపతులకు మధ్య కొంతకాలంగా భూవివాదం ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామసమీపంలో ఉన్న భూమిని అల్లు సత్యనారాయణ తల్లి అప్పలనరసమ్మ గతంలో భాస్కరరావుకు విక్రయిం చారు. అయితే అప్పట్లో తక్కువ ధరకు భూమిని అమ్మేశారని అపోహ పెట్టుకున్న సత్యనారాయణ మూడేళ్లుగా భాస్కరరావుతో గొడవ పడుతున్నాడు. వీటిపై పోలీస్‌స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ ఎప్పటికప్పుడు తిరుగుతున్నారు. శుక్రవారం బొబ్బిలి కోర్టులో వాయిదా ఉండగా గురువారం రాత్రి హత్యకు గురయ్యారు. మద్యం సేవించి...రాడ్డుతో బాది ఉపాధ్యాయ దంపతులు హత్యకు గురైన ప్రదేశానికి సమీపంలో హంతకులకు చెందిన పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. తీళ్లవాని చెరువు సమీపంలోని అరటితోటలో మద్యం సీసాలు, వాటర్ ప్యాకెట్లు, గారెలు వంటివి లభ్యమయ్యాయి. దీనిని బట్టి భా స్కరరావు ఒంటరిగా ద్విచక్రవాహనంపై వెళ్లడాన్ని గమనించి పక్కా ప్రణాళిక వేసుకున్నట్టు అర్థమవుతోంది.. అలాగే హంతకుల్లో ఒకరి సెల్‌ఫోన్, చెప్పులు కూడా అక్కడే ఉన్నాయి. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు కూడా సంఘటనా స్థలానికి సమీపంలోనే దొరికింది. అయితే భూ తగదా జరుగుతున్న సత్యనారాయణపై అనుమానంతో పొలీసులు ఆరాతీయగా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆదిశగా పోలీసు లు విచారణ మొదలు పెట్టారు. శోకసంద్రంలో గ్రామం గ్రామానికి చెందిన భార్యాభర్తలు హత్యకు గురికావడంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉపాధ్యాయ దంపతులు హత్య వార్త తెలుసుకుని మక్కువ, సాలూరు ,పాచిపెంట మండలాలనుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న నాయకులు హత్య జరిగిన విషయం తెలుసుకున్న సాలూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీడిక రాజన్నదొర, మక్కువ మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు బొంగుచిట్టినాయుడు, లండ నరసింహమూర్తి, బొమ్మి కృష్టమూర్తిలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన ఉపాధ్యాయుల మృతదేహాలను చూసి విచారం వ్యకం చేశారు. సాలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పి.భంజ్ధేవ్, మాజీ ఎంపీపీ మావుడి శ్రీనివాసరావు, మండలకాంగ్రెస్నాయుకులు మావుడి రంగునాయుడు, మండలటీడీపీ అధ్యక్షుడు పెంట తిరుపతిరావు, సీపీఎం మండల నాయకులు చింతల తవిటినాయుడులు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
కడగండ్లు
ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌లైన్: అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. వడగళ్ల వానలతో మిర్చి, మొక్కజొన్న, వరి, పెసర, నువ్వులు, బొబ్బెర తదితర పంటలతో పాటు మామిడితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత నాలుగు రోజులుగా జిల్లాలోని పలుప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బయ్యారం, ఇల్లెందు, గుండాల, టేకులపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, ముల్కలపల్లి, బూర్గంపాడు, పినపాక, భద్రాచలం, వెంకటాపురం, వాజేడు, చర్ల, చింతూరు, దుమ్ముగూడెం, మణుగూరు తదితర మండలాల్లో వడగళ్ల వర్షాలు కురిసి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది. భద్రాచలం ఏరియాలో దాదాపు 50 వేల క్వింటాళ్లకు పైగా మిర్చి కల్లాల్లో తడిసింది. ఈ పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బయ్యారం, ఇల్లెందు, గుండాల, టేకులపల్లి తదితర మండలాల్లో దాదాపు 2 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేల వాలింది. పాల్వంచ, కొత్తగూడెం, బూర్గంపాడు, పినపాక తదితర మండలాల్లో వరి, పెసర, బొబ్బెర, నువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లితే, వ్యవసాయ శాఖ మాత్రం అందుకు బిన్నంగా లెక్కలు చూపుతోంది. నిబంధనల మేరకు 50 శాతం నష్టం జరిగితేనే ఆ పంటకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. ఈ నిబంధన ప్రకారం వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వేలు నిర్వహించాలి. ఆ తరువాత వ్యవసాయ నిపుణులు వారి నిబంధనల మేరకు నష్టాలను నిర్ధారించాలి. ఆయా రిపోర్టుల ఆధారంగా పంట నష్టాల నివేదికలను గుర్తిస్తారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాల ప్రాథమిక రిపోర్టును పంపాలని జేడీఏ పి,బి భాస్కర్‌రావు ఆదేశం మేరకు మండల వ్యవసాయాధికారులు నివేదిక పంపారు. దీని ప్రకారం జిల్లాలో 1296 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం సంభవించినట్లు గుర్తించారు. ఇల్లందు మండలం రొంపేడు, కొమరారం, టేకులపల్లి మండలం గంగారం, కోయగూడెం, కొప్పురాయి, బూర్గం పాడు మండలం టేకులచెరువు, నాచిరిపేట, ఎన్.కె.బంజర, పాల్వంచ మండలం యానంబైలు, పాయకారి యానంబైలు, కొత్తగూడెం మండలం రేగళ్ల గ్రామాల్లో వడగండ్ల వాన, ఈదురుగాలుల ప్రభావంతో వరి, పెసర, బొబ్బర, మొక్కజొన్న, నువ్వులు పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ గుర్తించింది. పాల్వంచ డివిజన్లో 60 మంది రైతులకు చెందిన 42 హెక్టార్లలో వరి, 25 మంది రైతులకు చెందిన 20 హెక్టార్లలో పెసర, 20 మంది రైతులకు చెందిన 12 హెక్టార్లలో బొబ్బర, 50మంది రైతులకు చెందిన 50 హెక్టార్లలో మొక్కజొన్న, 10 మంది రైతులకు చెందిన 12 హెక్టార్లలో నువ్వుల పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనాలు వేశారు. ఇల్లందు డివిజన్లో 336 మంది రైతులకు చెందిన 118 హెక్టార్లలో, కొత్తగూడెం డివిజన్లో నలుగురు రైతులకు చెందిన 2 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు అంచనా వేశా రు. మోరంపల్లి బంజర డివిజన్లో 220 మంది రైతులకు చెందిన 140 హెక్టార్లలో వరి, 18 మంది రైతులకు చెందిన 12 హెక్టార్లలో పెసర, 20 మంది రైతులకు చెందిన 24 హెక్టార్లలో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. స్థానిక వ్యవసాయాధికారుల నుంచి ప్రాథమికంగా అందిన నివేదికను కలెక్టర్‌కు, వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అందజేసినట్లు భాస్కర్‌రావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. కాగా, వడగండ్ల వర్షాలతో ఉద్యానవన పంట లకు ఎలాంటి నష్టం జరగలేదని ఆశాఖ సహా య సంచాలకులు సూర్యనారాయణ, మరియన్న చెప్పారు. -
ఏసీబీ దూకుడు
సాక్షి, ఒంగోలు: ‘మేము సిద్ధం..లంచం అడిగేవారి సమాచారం అందించడంలో మీదే ఆలస్యం’ అన్నట్లుగానే చేసి చూపుతున్నారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది ఎవరైనా సరే ప్రజల నుంచి లంచాలు గుంజాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఈ విషయంలో తమకు ప్రజల నుంచి సహకారం అవసరమని చెబుతున్న ఏసీబీ అధికారులు ఇటీవల తమ దూకుడు పెంచారు. అవినీతి నిరోధకశాఖ ఏర్పడి 60ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ శాఖ ఉన్నతాధికారులు అవినీతి ఉద్యోగుల భరతం పట్టేందుకు విస్తృతంగా చేస్తున్న ప్రచారం ఫలితాలు ఇస్తున్నట్లుగానే కనిపిస్తోంది. డీఎస్పీ భాస్కరరావు నేతృత్వంలోని ఆశాఖ సిబ్బంది లంచావతారాల ఆట కట్టిస్తున్నారు. గతేడాది కూడా ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో భారీగా కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, ఈ ఏడాది ప్రారంభం నుంచే తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులపై, తడలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుపై కేసులు నమోదు చేసిన ఏసీబీ గతనెల రోజుల కాలంలో ప్రకాశం జిల్లాలో లంచాలు తీసుకుంటున్న ముగ్గురు ఉద్యోగులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని రిమాండ్‌కు పంపారు. ఇవీ కేసులు... గతనెల 19న కొత్తపట్నం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ షాజిదా, వెంకటేశ్వరమ్మ అనే మహిళ నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈనెల 4న ప్రకాశం భవన్‌లోని సీనియర్ ఆడిట్ అధికారి విజయభాస్కర్, పొదిలికి చెందిన నాగరాజు అనే వ్యక్తి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. తాజాగా సోమవారం కొనకనమిట్ల మండలంలోని చినారికట్ల వీఆర్వో శివప్రసాద్ పట్టాదారు పాస్‌పుస్తకం కోసం బరిగే గురువులు అనేవ్యక్తి నుంచి రూ.3,500 లంచం తీసుకుంటుండగా తహశీల్దార్ కార్యాలయంలో, ఓవైపు ప్రజావిజ్ఞప్తుల దినం కొనసాగుతుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కేవలం నెల రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో జిల్లాలో పనిచేస్తూ లంచాల కోసం అర్రులు చాచే పలువురు అవినీతి అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రకాశం భవనంలో సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయం మిద్దెపైన, కొనకనమిట్ల తహశీల్దార్ కార్యాలయాల్లో జరిగిన సంఘటనలు ఆయా ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని కలవరపెట్టాయి. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజలకు తమ పరిధిలో సేవ చేయాలే తప్పవారిని ఇబ్బందులకు గురిచేస్తూ లంచాల కోసం పీడిస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని ఏసీబీ అధికారులు ఇతర ఉద్యోగులకు ఈ సంఘటనలు సంకేతాలు పంపినట్లయింది. అవినీతి అధికారులు, సిబ్బంది విషయంలో తాము నిరంతరం అప్రమత్తంగానే వ్యవహరిస్తామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. -
సాహితీ.. ఎక్కడకు పోయావురా
భూత్పూర్, న్యూస్‌లైన్ : పాఠశాల యాజమాన్యం మానసిక ఒత్తిడి కారణంగానే తన కూ తురు క్షోభకు గురై మృతి చెందిందంటూ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే అమిస్తాపూర్‌కు చెందిన అరుణ, భాస్కర్‌రావు దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలోచిన్న కుమార్తె సాహితీ (సోని) భూత్పూర్కు సమీపంలోని పంచవటి విద్యాలయంలో మూడో తరగతి చదువుతోంది. ఇక్కడే సోదరీమణులు సాయిప్రియ ఏడో, నీరజ ఐదో తరగతి చదువుతున్నా రు. అయితే ఫీజులు చెల్లించలేదని సాహితిని రెండు రోజులుగా తరగతి నుంచి యాజమాన్యం బయటకు పంపించి ఎండలో నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు. గురువారం నుంచి అర్ధవార్షిక పరీక్షలు ప్రారంభం కానుండటంతో పరీక్షలు రాయిస్తోరో లేదోనని తీవ్రంగా మానసికక్షోభ కు గురైంది. ఉదయం తొమ్మిది గంటలకు సోద రీమణులతో కలిసి ఆటోలో పాఠశాలకు చేరుకున్న వెంటనే తల తిరిగినట్లవుతున్నదని క్లాసు టీచర్‌కు చెప్పింది. దీంతో తల్లికి ఫోన్లో సమాచారమివ్వగా తన కూతురిని అమిస్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ వైద్యుని వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరైంది. పాఠశాల యాజమాన్యం మానసిక ఒత్తిడి కారణంగానే తన కూతురు క్షోభకు గురై అస్వస్థతతో ప్రాణం పోగొట్టుకుందని తండ్రి భాస్కర్‌రావు ఆరోపించారు. పాఠశాల కరస్పాండెంట్‌తో వాగ్వాదం అనంతరం తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు కలిసి వివిధ పార్టీల నాయకులు పాఠశాల వద్దకు సాహితి మృతదేహంతో ఉదయం 10.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆందోళన చేశారు. సంఘటన స్థలానికి డీఈఓ చంద్రమోహన్ వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఎంఈఓ కృష్టయ్యను ఆదేశించారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్‌రెడ్డితో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. ‘ముగ్గురు పిల్లలను మీ పాఠశాలలోనే చదివిస్తున్నారు. కనీసం మానవత్వం లేకుండా విద్యార్థిని మానసిక క్షో భకు గురి చేసినందునే అస్వస్థతకు గురై మృతి చెందింది..’ అని మండిపడ్డారు. ట్రెయినీ డీఎస్పీ పూజిత, సీఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, నష్ట పరిహారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. పునరావృతం కాకుండా చూస్తాం పాఠశాలలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని పంచవటి విద్యాలయ కరస్పాండెంట్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. విద్యార్థి సాహితి మృతి దురదృష్టకరమన్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పీయూ విద్యార్థుల దాడి గురువారం రాత్రి పంచవటి విద్యాలయంపై పాలమూర్ యూనివర్సిటీ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఆవరణలోని ఫర్నిచర్‌ను చిందరవందర చేశారు. ఇంతలో అక్కడికి కారులో వచ్చిన సింగిల్‌విండో అధ్యక్షుడు నర్సింహారెడ్డి కారుపై రాళ్లతో దాడి చేసి అద్దాలను పగులగొట్టారు. ఈ కార్యక్రమంలో పీయూ విద్యార్ధి జేఏసీ చైర్మన్ ప్రకాశ్‌తో పాటు మరో నలభై మంది విద్యార్థులు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని బయటకు పంపించి వేశారు. అనంతరం పది మంది విద్యార్థులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. -
చెక్‌పోస్టుపై మళ్లీ పంజా
బీవీపాళెం(తడ), న్యూస్‌లైన్ : ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులోని బీవీపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రంపై ఏసీబీ మరోసారి పంజా విసిరింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు చెక్పోస్టులపై వెంట వెంటనే దాడులు చేసి అవినీతి అధికారుల గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీ, ఈ నెల 20వ తేదీన ఏసీబీ డీఎస్పీ జే భాస్కర్‌రావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు తాజాగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేటు వ్యక్తితో సహా పలు విభాగాల్లో రూ.59,610 పట్టుబడింది. ఇన్కమింగ్ చెక్‌పోస్టులో రూ.31,390, వివిధ శాఖలు ఉన్న అవుట్ గోయింగ్‌లో రూ.6,910, రవాణా శాఖ వద్ద రూ.21, 310 లభ్యమయింది. వారం క్రితం జరిపిన దాడిలో రూ.1,10,990 పట్టుబడగా ఈ సారి మాత్రం అందులో సగం లభించింది. ఇప్పటికే ఏసీబీ దాడులు, చార్జ్ మెమోలతో భయాందోళనలతో ఉన్న సిబ్బంది కొంత జాగ్రత్తగానే వ్యవహరించడంతో ఏసీబీ అధికారులకు పెద్దగా పట్టుబడలేదు. డ్రైవర్లు, క్లీనర్ల వేషధారణలో దాడులు ఈ నెల 20వ తేదీ జరిగిన దాడుల తరహాలోనే ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి డ్రైవర్లు, క్లీనర్ల వేషధారణలో చెక్‌పోస్టుపై దాడులు చేశారు. ఈ దఫా ఇరిగేషన్‌శాఖ అధికారులను మధ్యవర్తులుగా పెట్టుకుని దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రావు నేతృత్వంలో ముగ్గురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు ఈ దాడిలో పాలుపంచుకున్నారు. శనివారం రాత్రి 12.30 ప్రాం తంలో లుంగీలు, బనియన్లు ధరించి తలపాగాలు చుట్టకుని లారీ డ్రైవర్లు, క్లీనర్ల వేషధారణలో కొందరు, చెక్‌పోస్టు సిబ్బందిగా మరికొంత మంది చెక్‌పోస్టులో అడుగుపెట్టారు. వీరు చెక్‌పోస్టులో వచ్చిపోయే మార్గంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, ఇతర శాఖల సముదాయ కార్యాలయం వద్ద, రవాణాశాఖ, ఎక్సైజ్ శాఖల వద్దకు చేరి పరిస్థితులు గమనించారు. కొంత పరిశీలన అనంతరం అధికారులందరూ మూకుమ్మడిగా రంగంలోకి దిగారు. దాడిని గుర్తించిన చెక్‌పోస్టు సిబ్బంది తమ వద్ద ఉన్న అక్రమ సంపాదనను విసిరి పారేశారు. ఇలా పారేసిన నగదు రవాణా శాఖ వద్ద రెండు వేర్వేరు ప్రాంతాల్లో రూ.2,300, రూ.1,900 లభిం చగా, వాణిజ్యపన్నుల శాఖ ఇన్కమింగ్ కార్యాలయం వద్ద రూ.13 వేల వరకు లభించింది. నెల్లూరుకు చెందిన నాగిశెట్టి పెంచలయ్య అనే ఓ ప్రైవేటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రవాణా శాఖ వద్ద స్టాంపు డ్యూటీ నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌తో పాటు మరో కానిస్టేబుల్‌ను, ఇన్కమింగ్ సిటీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఏసీటీఓ వద్ద సొంత సొమ్ముగా చూపిన రూ.500 కన్నా అధికంగా రూ.610 లభించింది. ఔట్‌గోయింగ్‌లో అటెండర్‌గా ఉన్న వ్యక్తి వద్ద రూ.70 దొరకడంతో వారిపై కేసులు నమోదు చేశారు. గత దాడుల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖలో మాత్రం ఈ దఫా సిబ్బంది అందరూ విధులకు హాజరైనట్టు డీఎస్పీ తెలిపారు. 2012లో జరిపిన దాడులకు సంబంధించి విచారణలు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. చెక్‌పోస్టుతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ దాడులు చేస్తున్నామని, చెక్‌పోస్టు నుంచి లారీల వారి వద్ద నుంచి ఫోనుల్లో ఫిర్యాదులే తప్ప ప్రత్యక్షంగా ఎవరూ ముందుకురాని పరిస్థితుల్లో తాము సుమోటోగా దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ దాడుల్లో సీఐలు కే వెంకటేశ్వరావు, కృపానందం, టీవీ శ్రీనివాస్(ఒంగోలు), ఇన్స్పెక్టర్ ఎస్. వెంకటేశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
చెక్‌పోస్టుపై మళ్లీ ఏసీబీ పంజా
బీవీపాళెం (తడ), న్యూస్‌లైన్ : ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రావు నేతృత్వంలో అధికారులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత భీములవారిపాళెం సరిహద్దు ఉమ్మడి తనిఖీ కేంద్రంపై ఆకస్మికంగా దాడులు చేశారు. నాలుగు బృందాలు గా విడిపోయి నిర్వహించిన దాడుల్లో చెక్‌పోస్టు పరిసరాల్లో సంచరిస్తున్న ఆరుగురు ప్రైవేటు వ్యక్తులతో పాటు చెక్‌పోస్టులో విధులు నిర్వర్తించే ము గ్గురు ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రూ. 1,10,990 స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ భాస్కర్‌రావు శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో భాగంగా బీవీపాళెం లో నాలుగు బృందాలుగా దాడులు చేశామన్నారు. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ముగ్గురు రోడ్డుపై లారీలు ఆపి డబ్బులు వసూ లు చేస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. ఈ విభాగంపై తొలిసారిగా చేపట్టిన దాడుల్లో కానిస్టేబుళ్లు బల్లి శ్రీనివాసరావు నుంచి రూ. 1,750, షేక్ రిజ్వాన్ ఆహమ్మద్ నుంచి రూ.1,860, కే సుబ్బ య్య నుంచి రూ. 1,880 లభించినట్లు తెలిపారు. ఇక్కడ విధుల్లో ఉండాల్సిన ఎస్ఐ, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు విధులకు హాజరైనట్టు రికార్డుల్లో ఉన్నా అక్కడ లేకపోవడంపై కేసు నమోదు చేస్తున్నట్టు వివరించారు. రవాణా శాఖ కార్యాలయంలో ఇద్దరు ప్రైవేటు వ్యక్తు ల వద్ద రూ.14,440, ఏసీబీ అధికారు లు స్వాధీనం చేసుకున్న తరువాత వచ్చిన కలెక్షన్ రూ.20 వేలు, వాణిజ్య పన్నుల శాఖతో పాటు ఇతర శాఖలకు సంబంధించి ఇన్కమింగ్ కార్యాలయం వద్ద బయట పడవేసిన సొమ్ముతో పా టు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులనుంచి రూ. 55, 675, ఔట్ గోయింగ్ కార్యాల యంలో మరో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.12,385తో పాటు కార్యాలయంలో వసూలు చేసిన సొమ్ముకు సంబంధించి లెక్కలో తేలిని మరో రూ.3 వేలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ దాడుల్లో నెల్లూరు సీఐలు కే వెంకటేశ్వర్లు, ఎం కృపానందం, ఒం గోలు సీఐ, ఎస్ఐలు టీవీ శ్రీనివాసరా వు, ఎస్. వెంకటేశ్వర్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు, మధ్యవర్తులుగా ఇరిగేషన్, పీఆర్‌కు చెందిన మరో నలుగురు ఉద్యోగులు, ఇద్దరు డ్రైవర్లు పాల్గొన్నట్లు డీఎస్పీ తెలిపారు. డ్రైవర్ల వేషాల్లో సోదాలు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత చెక్‌పోస్టుపై దాడి చేసిన ఏసీబీ అధికారులు లుంగీలు కట్టుకుని బనియన్లతో లారీడ్రైవర్ల అవతారంలో చెక్‌పోస్టులో పరిస్థితులను గమనించారు. ఇదే వేషధారణలో ఎక్సైజ్ పోలీసులను పట్టుకున్నారు. కార్యాలయాల పరిసరాల్లో సం చరిస్తూ పరిస్థితిని పరిశీలించడంతో ఎ క్కువ మంది నిందితులు పట్టుబడ్డారు. ప్రైవేటు వ్యక్తిగా భావించి వ్యాపారి అరెస్ట్, ఉద్రిక్తత చెక్‌పోస్టు సమీపంలో ఫ్రైడ్‌రైస్ వ్యాపా రం చేసుకునే సమీపం గ్రామానికి చెం దిన ఓ వ్యాపారిని ప్రైవేటు వ్యక్తిగా భా వించి ఏసీబీ పోలీసులు రాత్రి అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న నగదును స్వా ధీనం చేసుకున్నారు. తనకు అక్రమ వసూళ్లకు సంబంధం లేదని, తనకు అనారోగ్యంగా ఉందని ప్రాధేయపడ్డా డు. శనివా రం ఉదయం ఈ విషయం తెలుసుకున్న బాధితుడి బంధువులు చెక్‌పోస్టు కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీబీ అధికారులు నిందితుడిని విడిచి పెట్టినట్టు తెలి పినా తనకు సంబంధించిన సొమ్మును ఇవ్వాల్సిందిగా పట్టుబట్టడంతో ఏసీబీ అధికారులు చేయి చేసుకున్నారు. విష యం తెలుసుకున్న గ్రామస్తులు ప్రశ్నిచడంతో వారిపై కూడా ఏసీబీ అధికారులు తరిమేశారు. దీంతో కొంత ఉద్రిక్త పరి స్థితి నెలకొంది. ఇంతలో తడ ఎస్ఐ నాగేశ్వరరావు తన సిబ్బందితో చెక్‌పోస్టుకు చేరుకుని సర్దుబాటు చేసి పంపించేశారు. -
ఆడుకోనివ్వట్లేదని అమ్మపై ఫిర్యాదు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలోని లంగర్‌హౌస్ ఠాణా అది... శుక్రవారం సాయంత్రం పదమూడేళ్ల బాలిక విసురుగా నడుచుకుంటూ లోపలికి వెళ్లింది.. ఎవరినో కలవాడినికో లేదా పొరపాటునో వస్తోందని పోలీసులు భావించారు.. కానీ తీరా తన తల్లిపైనే ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సంగతి తెలుసుకొని కంగుతిన్నారు! స్కూలు నుంచి వచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు తన తల్లి బయటకు పంపడం లేదని, తన స్వేచ్ఛను హరిస్తోందని ఆ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ తరహా ఫిర్యాదు కొత్త కావడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. విశాఖపట్నానికి చెందిన భాస్కర్‌రావు, సారా దంపతులు నగరంలోని లంగర్‌హౌస్‌లో ఉన్న అంబేద్కర్‌నగర్‌లో నివసిస్తున్నారు. వీరి కుమార్తె లీదా (13) తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజూ లాగానే శుక్రవారం కూడా లీదా పాఠశా ల నుంచి వచ్చి ఇంటి పక్కన ఉండే తన స్నేహితులతో ఆడుకుంటానని తల్లిని అడగగా ఆమె నో చెప్పింది. దీంతో బాలిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనకు స్వేచ్ఛ, హక్కులు కావాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తల్లి లీదా తమకు ఒక్కగానొక్క కుమార్తె అని, బయటికి వెళ్తే ఏదైనా జరగరానిది జరుగుతుందేమో అనే భయంతోనే ఇలా చేస్తున్నానని వివరించారు. దీంతో పోలీసులు తల్లీకూతుళ్లు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. -
ఆడుకోనివ్వట్లేదని అమ్మపై ఫిర్యాదు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలోని లంగర్‌హౌస్ ఠాణా అది... శుక్రవారం సాయంత్రం పదమూడేళ్ల బాలిక విసురుగా నడుచుకుంటూ లోపలికి వెళ్లింది.. ఎవరినో కలవాడినికో లేదా పొరపాటునో వస్తోందని పోలీసులు భావించారు.. కానీ తీరా తన తల్లిపైనే ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సంగతి తెలుసుకొని కంగుతిన్నారు! స్కూలు నుంచి వచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు తన తల్లి బయటకు పంపడం లేదని, తన స్వేచ్ఛను హరిస్తోందని ఆ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ తరహా ఫిర్యాదు కొత్త కావడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. విశాఖపట్నానికి చెందిన భాస్కర్‌రావు, సారా దంపతులు నగరంలోని లంగర్‌హౌస్‌లో ఉన్న అంబేద్కర్‌నగర్‌లో నివసిస్తున్నారు. వీరి కుమార్తె లీదా (13) తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజూ లాగానే శుక్రవారం కూడా లీదా పాఠశా ల నుంచి వచ్చి ఇంటి పక్కన ఉండే తన స్నేహితులతో ఆడుకుంటానని తల్లిని అడగగా ఆమె నో చెప్పింది. దీంతో బాలిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనకు స్వేచ్ఛ, హక్కులు కావాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తల్లి లీదా తమకు ఒక్కగానొక్క కుమార్తె అని, బయటికి వెళ్తే ఏదైనా జరగరానిది జరుగుతుందేమో అనే భయంతోనే ఇలా చేస్తున్నానని వివరించారు. దీంతో పోలీసులు తల్లీకూతుళ్లు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.