చెక్‌పోస్టుపై మళ్లీ ఏసీబీ పంజా | CBI eyes on check post centres claw strike again | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్టుపై మళ్లీ ఏసీబీ పంజా

Published Sun, Dec 22 2013 4:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM

ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రావు నేతృత్వంలో అధికారులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత భీములవారిపాళెం సరిహద్దు ఉమ్మడి తనిఖీ కేంద్రంపై ఆకస్మికంగా దాడులు చేశారు.

బీవీపాళెం (తడ), న్యూస్‌లైన్ : ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రావు నేతృత్వంలో అధికారులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత భీములవారిపాళెం సరిహద్దు ఉమ్మడి తనిఖీ కేంద్రంపై ఆకస్మికంగా దాడులు చేశారు. నాలుగు బృందాలు గా విడిపోయి నిర్వహించిన దాడుల్లో చెక్‌పోస్టు పరిసరాల్లో సంచరిస్తున్న ఆరుగురు ప్రైవేటు వ్యక్తులతో పాటు చెక్‌పోస్టులో విధులు నిర్వర్తించే ము గ్గురు ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రూ. 1,10,990 స్వాధీనం చేసుకున్నారు.
 
 డీఎస్పీ భాస్కర్‌రావు శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో భాగంగా బీవీపాళెం లో నాలుగు బృందాలుగా దాడులు చేశామన్నారు. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ముగ్గురు రోడ్డుపై లారీలు ఆపి డబ్బులు వసూ లు చేస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. ఈ విభాగంపై తొలిసారిగా చేపట్టిన దాడుల్లో కానిస్టేబుళ్లు బల్లి శ్రీనివాసరావు నుంచి రూ. 1,750, షేక్ రిజ్వాన్ ఆహమ్మద్ నుంచి రూ.1,860, కే సుబ్బ య్య నుంచి రూ. 1,880 లభించినట్లు తెలిపారు. ఇక్కడ విధుల్లో ఉండాల్సిన ఎస్‌ఐ, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు విధులకు హాజరైనట్టు రికార్డుల్లో ఉన్నా అక్కడ లేకపోవడంపై కేసు నమోదు చేస్తున్నట్టు వివరించారు.
 
 రవాణా శాఖ కార్యాలయంలో ఇద్దరు ప్రైవేటు వ్యక్తు ల వద్ద రూ.14,440, ఏసీబీ అధికారు లు స్వాధీనం చేసుకున్న తరువాత వచ్చిన కలెక్షన్ రూ.20 వేలు, వాణిజ్య పన్నుల శాఖతో పాటు ఇతర శాఖలకు సంబంధించి ఇన్‌కమింగ్ కార్యాలయం వద్ద బయట పడవేసిన సొమ్ముతో పా టు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులనుంచి రూ. 55, 675, ఔట్ గోయింగ్ కార్యాల యంలో మరో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.12,385తో పాటు కార్యాలయంలో వసూలు చేసిన సొమ్ముకు సంబంధించి లెక్కలో తేలిని మరో రూ.3 వేలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ దాడుల్లో నెల్లూరు సీఐలు కే వెంకటేశ్వర్లు, ఎం కృపానందం, ఒం గోలు సీఐ, ఎస్‌ఐలు టీవీ శ్రీనివాసరా వు, ఎస్. వెంకటేశ్వర్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు, మధ్యవర్తులుగా ఇరిగేషన్, పీఆర్‌కు చెందిన మరో నలుగురు ఉద్యోగులు, ఇద్దరు డ్రైవర్లు పాల్గొన్నట్లు డీఎస్పీ తెలిపారు.
 
 డ్రైవర్ల వేషాల్లో సోదాలు  
 శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత చెక్‌పోస్టుపై దాడి చేసిన ఏసీబీ అధికారులు లుంగీలు కట్టుకుని బనియన్లతో లారీడ్రైవర్ల అవతారంలో చెక్‌పోస్టులో పరిస్థితులను గమనించారు. ఇదే వేషధారణలో ఎక్సైజ్ పోలీసులను పట్టుకున్నారు. కార్యాలయాల పరిసరాల్లో సం చరిస్తూ పరిస్థితిని పరిశీలించడంతో ఎ క్కువ మంది నిందితులు పట్టుబడ్డారు.
 
 ప్రైవేటు వ్యక్తిగా భావించి
 వ్యాపారి అరెస్ట్, ఉద్రిక్తత
 చెక్‌పోస్టు సమీపంలో ఫ్రైడ్‌రైస్ వ్యాపా రం చేసుకునే సమీపం గ్రామానికి చెం దిన ఓ వ్యాపారిని ప్రైవేటు వ్యక్తిగా భా వించి ఏసీబీ పోలీసులు రాత్రి అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న నగదును స్వా ధీనం చేసుకున్నారు. తనకు అక్రమ వసూళ్లకు సంబంధం లేదని, తనకు అనారోగ్యంగా ఉందని ప్రాధేయపడ్డా డు.
 
 శనివా రం ఉదయం ఈ విషయం తెలుసుకున్న బాధితుడి బంధువులు చెక్‌పోస్టు కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీబీ అధికారులు నిందితుడిని విడిచి పెట్టినట్టు తెలి పినా తనకు సంబంధించిన సొమ్మును ఇవ్వాల్సిందిగా పట్టుబట్టడంతో ఏసీబీ అధికారులు చేయి చేసుకున్నారు. విష యం తెలుసుకున్న గ్రామస్తులు ప్రశ్నిచడంతో వారిపై కూడా ఏసీబీ అధికారులు తరిమేశారు. దీంతో  కొంత ఉద్రిక్త పరి స్థితి నెలకొంది. ఇంతలో తడ ఎస్‌ఐ నాగేశ్వరరావు తన సిబ్బందితో చెక్‌పోస్టుకు చేరుకుని  సర్దుబాటు చేసి పంపించేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement