సాక్షి, నల్గొండ: వేములపల్లి మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ నేతలకు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు.
నాలుగు చీరలిచ్చే కాంగ్రెస్ నాయకుడికి ఓట్లు వేయాలా.. అలా అయితే మేం వేసిన రోడ్లపై నడవకండంటూ భాస్కర్ రావు వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారేన్ని రేపుతున్నాయి. కాగా గతంలోనూ అడవిదేవులపల్లి మండలంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన ఈ ఎమ్మెల్యే విమర్శలకు గురైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment