
చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కోర్టు న్యాయమూర్తి వై.లక్ష్మణరావు సోమవారం తీర్పు ఇచ్చారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత 28 రోజులపాటు విజయవాడ హోం క్వారంటైన్‌లో ఉండాలని, పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించకూడదని, కేసు గురించి ఎవరితోనూ చర్చించకూడదని న్యాయస్థానం షరతులు పెట్టింది. విచారణ అధికారికి కేసు విషయంలో పూర్తిగా సహకరించాలని, ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.