టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్‌ | Perni Nani Fires on TDP Leader Kollu Ravindra | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్‌

Published Fri, Feb 23 2024 5:41 PM | Last Updated on Fri, Feb 23 2024 6:02 PM

Perni Nani Fires on TDP Leader Kollu Ravindra - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: కొల్లు రవీంద్రకు ఓటమి భయం పట్టుకుందని.. ఇంగితజ్ఞానం లేకుండా అబద్ధాలు చెబుతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మచిలీపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పేదలకు మూడు సెంట్ల స్థలం ఇస్తానని మోసం చేశారని, ఐదేళ్లు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర ఒక్కరికీ మేలు చేయలేదంటూ దుయ్యబట్టారు.

‘‘కొల్లు రవీంద్రలా నాటకాలాడటం మాకు రాదు. నవయుగ సంస్థను అడ్డుపెట్టుకుని కోర్టులో అడ్డంకులు సృష్టించింది మీరు కాదా?. 2004లో పోర్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తిని నేను. మోసం చేసే కుటుంబం ఎవరిదో ప్రజలకు తెలుసు. విజయవాడ నుంచి మచిలీపట్నం వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. కళ్లుతెరిచి అభివృద్ధిని చూడు ఒకసారి. నీలాంటి స్థాయిలేనివాడితో.. గతిలేనివాడితో నేను చర్చకు రావడమేంటి?. ఏనాడైనా పేదవాడికి మేలు చేశావా?. మీలా దొంగ శంకుస్థాపనలు చేయడం మా వల్ల కాదు. మీ కుటుంబం కోసం నేను మాట్లాడను.. నాకు సభ్యత ఉంది’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.

నీకు చేతనైతే పేర్ని కృష్ణమూర్తిలా ఒక్కరోజు బతికి చూపించు. మత్స్యకార గ్రామాలను దగా చేసిన మోసగాడు కొల్లు రవీంద్ర. ఈ డ్రామా కోర్ ఒట్టి మోసగాడు. దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నాడు. మా కుటుంబం గురించి వేలెత్తి చూపించే అర్హత నీకు లేదు. మీ తప్పుడు ఆలోచనలు మచిలీపట్నంలో సాగవు. రైతులకు భూ హక్కు కల్పించడానికి యజ్ఞం చేస్తున్న రెవెన్యూ సిబ్బందికి సీఎం జగన్ అండగా ఉంటారు. ఉడత ఊపులకు చింతకాయలు రాలవు’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.

ఇదీ చదవండి: కుప్పం నుంచే చంద్రబాబు బైబై అంటున్నాడు: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement