సాక్షి, హైదరాబాద్: పదో తరగతి డూప్లికేట్ మెమోకు లంచం తీసుకుంటుండగా ప్రభుత్వ పరీక్షల విభాగం సూపరింటెండెంట్ భాస్కర్‌రావు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కాడు. తనకు డూప్లికేట్ మెమో జారీ చేయాలని అహ్మద్ అబ్దుల్ హసీబ్ అక్బర్ భాస్కర్‌రావును కోరాడు. అయితే మెమో ఇచ్చేందుకు రూ.5 వేలు లంచంగా ఇవ్వాలని భాస్కర్‌రావు డిమాండ్ చేశాడు. దీంతో హసీబ్ అక్బర్ ఏసీబీని ఆశ్రయించాడు.
సోమవారం అక్బర్ వద్ద రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా భాస్కర్‌రావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే గతంలో కూడా భాస్కర్‌రావు డూపికేట్ మెమోకు రూ.1,500 లంచం తీసుకుంటూ పట్టుబడినట్టు ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్‌రావు తెలిపారు. మూడేళ్లలో ఇది రెండోసారని, భాస్కర్‌రావును కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్టు వెల్లడించారు. లంచం డిమాండ్ చేసే అధికారులపై టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment