సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలోని లంగర్‌హౌస్ ఠాణా అది... శుక్రవారం సాయంత్రం పదమూడేళ్ల బాలిక విసురుగా నడుచుకుంటూ లోపలికి వెళ్లింది.. ఎవరినో కలవాడినికో లేదా పొరపాటునో వస్తోందని పోలీసులు భావించారు.. కానీ తీరా తన తల్లిపైనే ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సంగతి తెలుసుకొని కంగుతిన్నారు! స్కూలు నుంచి వచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు తన తల్లి బయటకు పంపడం లేదని, తన స్వేచ్ఛను హరిస్తోందని ఆ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ తరహా ఫిర్యాదు కొత్త కావడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. విశాఖపట్నానికి చెందిన భాస్కర్‌రావు, సారా దంపతులు నగరంలోని లంగర్‌హౌస్‌లో ఉన్న అంబేద్కర్‌నగర్‌లో నివసిస్తున్నారు.
వీరి కుమార్తె లీదా (13) తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజూ లాగానే శుక్రవారం కూడా లీదా పాఠశా ల నుంచి వచ్చి ఇంటి పక్కన ఉండే తన స్నేహితులతో ఆడుకుంటానని తల్లిని అడగగా ఆమె నో చెప్పింది. దీంతో బాలిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనకు స్వేచ్ఛ, హక్కులు కావాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తల్లి లీదా తమకు ఒక్కగానొక్క కుమార్తె అని, బయటికి వెళ్తే ఏదైనా జరగరానిది జరుగుతుందేమో అనే భయంతోనే ఇలా చేస్తున్నానని వివరించారు. దీంతో పోలీసులు తల్లీకూతుళ్లు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.
ఆడుకోనివ్వట్లేదని అమ్మపై ఫిర్యాదు!
Published Fri, Aug 30 2013 11:52 PM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement
Advertisement