
'డిపాజిట్ తెచ్చుకుంటే వాచ్‌మెన్‌గా పనిచేస్తా'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బుధవారం ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావులు పరస్పరం మాటల యుద్దానికి దిగారు. పార్టీ మారిన ఎమ్మెల్యే భాస్కర్‌రావు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి డిపాజిట్ తెచ్చుకుంటే.. తాను టీఆర్‌ఎస్ ఆఫీసులో వాచ్‌మెన్‌గా పనిచేస్తానని కోమటి రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై భాస‍్కర్ రావు స్పందిస్తూ.. 'ఇద్దరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే.. ఎవరి సత్తా ఏంటో తెలుస్తోంది. నేను ఓడిపోతే అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటా' అని అన్నారు.