సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బోధన్‌లోని నిజాం షుగర్స్ భవిత వ్యం తేల్చేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగా ణ రాష్ట్రం సిద్ధిస్తున్న తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాక్టరీ సైతం ప్రభుత్వ ప రం అవుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడి హయాంలో ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమీక్షించేందుకు తెలంగాణ మంత్రుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈనెల 13న కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు పి.సుదర్శన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డితో పాటు సీమాంధ్రకు చెందిన మరో ముగ్గురు మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్‌కమిటీకి పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర కన్వీనర్‌గా వ్యవహరి స్తున్నారు. పది రోజుల్లో నివేదిక సమర్పిం చాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సబ్‌కమిటీని ఆదేశించారు.
ఆసియా ఖండంలో నే ఒకప్పుడు అతి పెద్ద వ్యవసాయాధారిత పరిశ్రమగా ప్రఖ్యాతి పొందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ(ఎన్‌ఎస్‌ఎఫ్)ని 1936లో నిర్మించారు. 16 వేల ఎకరాలలో చెరు కు సాగుకు నీటి సౌకర్యం కల్పించేందుకు వీలు గా నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. నిజాం పాలన ముగిసిన తర్వాత ఫ్యాక్టరీ ప్రభుత్వ స్వాధీనమైంది. జిల్లా అభివృద్ధికే కాక రాష్ట్రంలో చక్కెర పరిశ్రమ విస్తరణకు దోహదపడింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించింది. పొరుగు జిల్లా కరీంనగర్‌తో పాటు మహారాష్ట్ర ప్రాంతవాసులు ఫ్యాక్టరీలో పని చేసి, ఇక్కడే స్థిరపడ్డారు.
బాబు హయాంలో..
చాలాకాలం లాభాల్లో నడిచిన ఈ చక్కెర కర్మాగారం పాలకులు, ఫ్యాక్టరీ ఉన్నతాధికారుల స్వార్థానికి బలైంది. నష్టాల సాకు చూపిన చంద్రబాబు ప్రభుత్వం 2002లో ప్రైవేట్‌పరం చేసింది. రూ.300 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీ ఆస్తులను రూ.67 కోట్లకే డెల్టా పేపర్ సంస్థకు కట్టబెట్టింది. ప్రైవేట్ సంస్థకు 51 శాతం, ఎన్‌ఎస్‌ఎఫ్‌కు 49 శాతం వాటాతో జాయింట్ వెంచర్ పేరుతో వారికి స్వాధీనం చేసింది. దీం తో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కాస్తా నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. బోధన్‌లోని శక్కర్‌నగర్ ప్రధాన యూనిట్‌తో పాటు కరీంనగర్ జిల్లాలోని మెట్‌పల్లి, మెదక్ జిల్లాలోని ముంబాజీపేట ఫ్యాక్టరీలూ ప్రైవేట్ సంస్థ పరమయ్యాయి. రైతు, కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించినా అప్పటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదు.
రోడ్డున పడ్డ కార్మికులు
ప్రైవేటీకరణతో ఫ్యాక్టరీ గత వైభవాన్ని కోల్పోయింది. వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఫ్యాక్టరీ గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతన్నకు పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా బిల్లుల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోం ది. దీంతో ప్రతి క్రషింగ్ సీజన్‌లో మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులున్నాయి.
వైఎస్‌ఆర్ హయాంలో..
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిజాం షుగర్స్ ప్రైవేటీకరణలో అవినీ తి అక్రమాలను నిగ్గుతేల్చేందుకు శాసనసభా కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి రత్నాకర్‌రావు చైర్మన్‌గా, ఎమ్మెల్యేలు పి.సుదర్శన్‌రెడ్డి, ఎస్.గంగారాం, సురేశ్ షెట్కార్, బాజిరెడ్డి గోవర్ధన్, జి.చిన్నారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, కళా వెంకట్రావు, మర్రి శశిధర్‌రెడ్డి సభ్యులుగా సభా సంఘాన్ని నియమించారు. ఈ సంఘం విచారణ చేసి 350 పేజీ ల నివేదికను ప్రభుత్వానికి అందించింది. ప్రైవేటీకరణ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించిన సంఘం.. ఫ్యాక్టరీని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది.
హైకోర్టులో అప్పీలు
నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అప్పిరెడ్డి సభా సంఘం సిఫారసులు అమలు చేయాలని కోరుతూ 2007లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికొన్ని కార్మిక సంఘాలు సైతం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. పలుమార్లు కోర్టులో విచారణకు వచ్చింది. ఏవో సాకులు చూపి ప్రభుత్వం తప్పించుకుంటోంది.
విజయమ్మ పిటిషన్
చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని 2011 అక్టోబర్‌లో వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. ఇందులో నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ వ్యవహారాన్నీ చేర్చారు.
రోశయ్య, కిరణ్‌ల హయాంలో..
2010 నవంబర్11న అప్పటి సీఎం రోశయ్య సభా సంఘం సిఫారసులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. దీంతో బోధన్ ప్రాంత ప్రజల్లో హర్షం వ్యక్తమయ్యింది. ఫ్యాక్టరీ వద్ద పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఈ విషయం మరుగున పడింది. సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా శంకర్‌రావు 2011 నవంబర్ 21న నిజామాబాద్ వచ్చారు. చక్కెర ఫ్యాక్టరీ ప్రైవేట్ సంస్థతో ఉన్న జాయింట్ వెంచర్ రద్దు జీవోపై సంతకం చేశానని అప్పట్లో ప్రకటించారు. దీంతో బోధన్ ప్రాంత రైతులు, కార్మికులు మళ్లీ సంబరాలు జరుపుకున్నారు. కానీ శంకర్‌రావు పదవీచ్యుతులు కావడంతో సభా సంఘం సిఫారసుల్లో పురోగతి లేదు.
మళ్లీ ఆశలు..
బోధన్‌లోని చక్కెర కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో రైతులు, కార్మికుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నా యి. పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతుండడం వారి ఆశలకు జీవం పోస్తోంది. ఇప్పుడు కాకపోయినా తెలంగాణ రాష్ట్రంలోనైనా ఫ్యాక్టరీ ప్రభుత్వ పరం అవుతుం దని నమ్ముతున్నారు. మంత్రులు ఒత్తిడి తెచ్చి శాసనసభా సంఘం సిఫారసులు త్వరగా అమలయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
తీపి కబురు అందేనా !
Published Thu, Dec 19 2013 6:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement