నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు.
బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 40 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గత డిసెంబర్‌లో యాజమాన్యం కార్మికులకు లేఆఫ్ ప్రకటించింది.
దీనిపై రెండు నెలలుగా పని లేక, వేతనాలు లేక ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికులు నిరసనగా ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కార్మికులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్‌లకు నిరసనగా కార్మికుల ధర్నా
అరెస్ట్ చేసిన కాసేపటికి వారిని విడిచిపెట్టారు. అరెస్ట్‌లను నిరసిస్తూ వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు.