రోడ్డుపై బైఠాయించిన కుటుంబ సభ్యులు. హత్యకు గురైన శ్రీకాంత్ (ఫైల్)
సాక్షి, ఆదిలాబాద్: 80 రోజుల క్రితం అదృశ్యమైన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్గాం గ్రామానికి చెందిన శ్రీకాంత్ (20) పట్టణ శివారులోని పసుపువాగు వద్ద చెట్ల పొదల్లో శవమై కనిపించాడు. మృతుడి బ్యాగు, చెప్పులను గుర్తించి శ్రీకాంత్‌గా నిర్ధారించారు. బోధన్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న శ్రీకాంత్ సెపె్టంబర్ 23న కాలే జీ వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
కాగా శ్రీకాంత్ అదృశ్యం అనంతరం మండలంలోని భూ లక్ష్మీ క్యాంపు గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం బయటకు వచి్చంది. అతను కనిపించకుండా పోయిన నాలుగైదు రోజులకు యువతి బంధువులు ఐదుగురు ఇంటికి వచ్చి బెదిరించినట్టు తల్లిదండ్రులు జ్యోతి, లక్ష్మణ్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించలేదని, తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని అన్నారు.
పోలీసులు పట్టించుకోలేదంటూ ధర్నా
పోలీసుల నిర్లక్ష్యంతోనే తమ కొడుకు చనిపోయాడని, యువతి తరఫున వారే హత్య చేశారని ఆరోపి స్తూ మృతుని బంధువులు బోధన్ రుద్రూర్ రహదారిపై బైఠాయించి రాత్రి పొద్దుపోయే వరకు ఆందో ళన చేపట్టారు. హత్య కేసులో పోలీసుల పాత్రపై అనుమానాలున్నాయని ఆరోపించారు. డీసీపీ అరవింద్‌బాబు, ఆర్డీవో రాజేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడా రు. డివిజన్ పోలీసుల మీద నమ్మకం లేక పోతే వేరే డివిజన్ పోలీసులతో కేసు విచారణ చేపడతామని స్పష్టం చేసిన మీదట ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment