హుస్నాబాద్, న్యూస్‌లైన్ : హుస్నాబాద్ కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవీణ్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి మధ్య ఏర్పడిన విభేదాలు ఇప్పటికీ రగులుతూ నే ఉన్నాయి. హుస్నాబాద్ అసెంబ్లీ టికెట్‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన సుదర్శన్‌రెడ్డి, బొమ్మ వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌రెడ్డి ఆశించగా.. అధిష్టానం ప్రవీణ్‌రెడ్డి వైపు మొగ్గుచూపడంతో ఇద్దరు నేతలు మనస్తాపానికి గురయ్యారు. అధిష్టానం కలుగజేసుకుని వారిని సముదాయించింది.
దీం తో వారు ఎన్నికల్లో ప్రవీణ్‌రెడ్డికి మద్దతుగా నిలవడంతో.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిం చింది. టికెట్ విషయంలో జరిగిన అన్యాయం, ఎన్నికల అనంతరం జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, ఇతర పరిణామాలు తమను కార్యకర్తల నుంచి దూరం చేస్తున్నారనే భావన వారిలో ఏర్పడింది. దీనికితోడు తాజాగా హుజూరాబాద్ మార్కెట్ చైర్మన్ నియామకం విషయంలో ప్రవీణ్‌రెడ్డి అడ్డుపడుతున్నాడంటూ సుదర్శన్‌రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు.
బహిరంగంగానే అసంతృప్తి
పార్టీ కార్యక్రమాల విషయంలో ఎమ్మెల్యే తన ను, తమ వర్గాన్ని దూరం పెడుతున్నారంటూ పలు వేదికలపై సుదర్శన్‌రెడ్డి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు పార్టీ నాయకులకు సైతం ఫిర్యాదు చేశారు. జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరు నెలల క్రితం ప్రవీణ్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిని సమన్వయపరిచి, హుజూరాబాద్ నియోజకవర్గంపై కేతిరి దృష్టి పెట్టేలా ఒప్పించినట్లు సమాచారం.
హుజూరాబాద్ మార్కెట్ చైర్మన్‌గా సుదర్శన్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చేలా నేతలు అంగీకారానికి రావడంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, శ్రీధర్‌బాబు, ఎంపీ, విప్, ఎమ్మెల్యేలతో సీఎంకు ఐదు నెలల క్రితమే సిఫారసు లేఖలు పంపారు. దీనిపై సీఎం ఆమోదం తెలిపే సందర్భంలో ప్రవీణ్‌రెడ్డి సీఎంతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి ఫైల్‌ను నిలిపివేయించారని సుదర్శన్‌రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. హుజూరాబాద్ మార్కెట్ పరిధిలోకి హుస్నాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాలు కూడా వస్తున్నందున తమ నియోజకవర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే అడ్డుకోవడంతోనే కమిటీ నియామకం నిలిచిపోయిందని ప్రచారం జరుగుతోంది.
టార్గెట్.. సహకార ఎన్నికలు
మార్కెట్ చైర్మన్ పదవి రాకుండా అడ్డుపడుతున్నారనే భావనతో నేరుగా ప్రవీణ్‌రెడ్డితోనే తల పడేందుకు సుదర్శన్‌రెడ్డి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రవీణ్‌రెడ్డికి పట్టున్న ముల్కనూర్ సహకార గ్రామీణబ్యాంకు ఎన్నికలను ఎంచుకున్నారు. బ్యాంకు పరిధిలో ఐదు డెరైక్టర్ పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. ప్రవీణ్‌రెడ్డి ప్యానెల్‌ను ఎలాగైనా ఓడించాలని సుదర్శన్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారని ఆయన వర్గీయులు తెలిపారు. ఇటీవల తన వర్గీయులతో వరంగల్‌లో సమావేశం నిర్వహించిన సుదర్శన్‌రెడ్డి తాజాగా టీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఐతోపాటు జేఏసీలను ఒకతాటిపైకి తీసుకువచ్చేదిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేర కు కొత్తకొండలో శుక్రవారం సమావేశం నిర్వహి ంచనున్నట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో దెబ్బతీస్తే ఆ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనా ఉం టుందని ఆ దిశగా పావులు కదుపుతున్నారు. వీరికి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనాయకుడు సైతం మద్దతిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రవీణ్‌రెడ్డి సైతం దీన్ని ఎదుర్కొనేందుకు ఒంట రిగానే సిద్ధమవుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం పార్టీ కార్యకర్తలను ఇరకాటంలో పడేస్తోంది. నాయకుల వర్గపోరుతో బ్యాంకు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒకే పార్టీ నాయకులు ప్రత్యర్థులుగా ప్రచారం సాగించడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
అల్గిరెడ్డి వర్సెస్ కేతిరి
Published Thu, Nov 14 2013 4:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement
Advertisement