అనంతపురం రూరల్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం మరో ఇద్దరు వడదెబ్బకు గురై మరణించారు. అనంతపురం రూరల్ మండలం పామురాయి గ్రామానికి చెందిన మనోహర్(50) వడదెబ్బతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సోములదొడ్డిలోని ఓ ప్రైవేటు షోరూంలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే మనోహర్ వడదెబ్బకు గురై కుప్పకూలిపోయారన్నారు. గమనించిన సహచరులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య నాగలక్ష్మి ఉన్నారు.
గుత్తిలో మరొకరు..
గుత్తి (గుంతకల్లు) : గుత్తి చెర్లోపల్లి కాలనీలో వడ్డే ఉలిగన్న(49) వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారని కాలనీవాసులు తెలిపారు. శనివారం రాళ్లు కొట్టేందుకు పట్టణ సమీపంలోని గుట్టకు వెళ్లిన అతను మధ్యాహ్నం సొమ్ముసిల్లి పడిపోయాడని వివరించారు. వెంటనే స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచినట్లు చెప్పారు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.
వడదెబ్బకు మరో ఇద్దరి మృతి
Published Mon, May 22 2017 12:17 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM
Advertisement
Advertisement