ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు శేరిలింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్ గురువారం తెలిపారు. 40 మైక్రాన్‌ల లోపు సామర్ధ్యం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సర్కిల్ పరిదిలోని మార్కెట్‌లు, వ్యాపార సముదాయాల్లో ఎంత సామర్ధ్యం ఉన్న బ్యాగ్‌లను విక్రయిస్తున్నారో పరిశీలించేందుకు తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 40 మైక్రాన్‌ల కన్నా సామర్ధ్యం తక్కువ ఉన్న కవర్లు విక్రయిస్తే వారిపై ఫైన్‌లు విధిస్తామని హెచ్చరించారు.
ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల విక్రయాలపై తనిఖీలు
Published Thu, Aug 4 2016 5:49 PM | Last Updated on Tue, Sep 18 2018 6:38 PM
Advertisement