‘ఎయిర్ పోర్టులో అప్రమత్తత అవసరం లేదు’
హైదరాబాద్: స్వైన్‌ప్లూతో జనవరి నుంచి ఇప్పటివరకు 16 మంది మృతి చెందారని, 1246 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. స్వైన్‌ప్లూకు భయపడాల్సిన పనిలేదని, కనీస జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. నిన్న ఆస్పత్రిలో చేరిన చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. 14 స్వైన్ ప్లూ ప్రికాషన్ కేంద్రాల్లో 2 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. కేంద్రం సాయంతో మరొకటి ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
ఎయిర్ పోర్టులో అప్రమత్తం చేయాల్సిన అత్యవసర పరిస్థితి లేదన్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో స్వైన్‌ప్లూ వ్యాప్తి ఎక్కువగా ఉందని వెల్లడించారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్వైన్‌ప్లూ కేసులు ఎక్కువగా నమోదైనట్టు తెలిపారు. ఈ సీజన్‌లో జెనెటిక్ షిప్ట్, జెనటిక్ డ్రిప్ట్ అనే వైరస్ ల ద్వారా స్వైన్‌ప్లూ వ్యాపిస్తోందన్నారు. వైరస్ ను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపి తీవ్రత నమోదు చేయటనున్నట్టు మనోహర్ తెలిపారు.