ఆర్ట్‌ గ్యాలరీలో ఆరంభ్‌ చిత్రప్రదర్శన | State Art Gallery In Madapur | Sakshi
Sakshi News home page

ఆర్ట్‌ గ్యాలరీలో ఆరంభ్‌ చిత్రప్రదర్శన

Published Sun, Jul 21 2024 11:44 AM | Last Updated on Sun, Jul 21 2024 11:44 AM

State Art Gallery In Madapur

మాదాపూర్‌: స్థానిక చిత్రమయి స్టేట్‌ అర్ట్‌ గ్యాలరీలో ఆరంభ్‌ పేరిట చిత్రప్రదర్శనను శనివారం ఏర్పాటు చేశారు. కళాకారులు వేసిన చిత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. చారూస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్న 28 మంది కళాకారులు వేసిన 36 చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. 

ఈ ప్రదర్శనను మెరీడియన్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ ఆకృశబెల్లాని ప్రారంభించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె కోరారు. విద్యార్థులు వేసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శన ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement