'గోల్కొండ కోటపైనే పంద్రాగష్టు వేడుకలు'
Published Thu, Aug 7 2014 5:41 PM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM
హైదరాబాద్: పంద్రాగష్టు వేడుకలు గోల్కొండ కోటపైనే జరుగుతాయని తెలంగాణ సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా స్పష్టం చేశారు. రాణీమహల్‌ను ఆగష్ట్ 15 వేడుకల ప్రదేశంగా గుర్తించామని ఆయన మీడియాకు వెల్లడించారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర పురావస్తుశాఖ, ఆర్మీకి లేఖలు రాసిందని అజయ్ మిశ్రా తెలిపారు. వేడుకల కోసం వారి నుంచి అనుమతి పొందడం లాంఛనప్రాయమేనని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Advertisement
Advertisement