అసెంబ్లీలో ఘనంగా జెండావందనం
Published Wed, Aug 16 2017 4:05 AM | Last Updated on Tue, Aug 14 2018 2:34 PM
జెండా ఆవిష్కరించిన స్పీకర్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్ మధుసూదనా చారి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు అసెంబ్లీలోని అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత జాతి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించా రన్నారు. ఇక శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ భవన్‌లో హోంమంత్రి
టీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి జెండా ఎగుర వేశా రు. ఇందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొన్నారు. పేదల సంక్షేమానికి సీఎం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని, రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేశారని నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.
మగ్దూం భవన్‌లో చాడ
సీపీఐ కార్యాలయం మగ్దూం భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి జాతీయ పతా కాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బంధుప్రీతి, అవినీతి అంతమైన రోజునే నిజమైన స్వాతంత్య్రమని ఆయన అన్నారు.
Advertisement