సాక్షి, న్యూఢిల్లీ : 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్ధేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. సులభతర వాణిజ్యమే (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కాకుండా సులభతర జీవనం (ఈజ్ ఆఫ్ లివింగ్) కూడా అవసరమని ప్రధాని స్పష్టం చేశారు.
ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గాలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోయేలా హైజంప్ చేయాల్సిన అవసరం నెలకొందని అన్నారు. రోజులు మారుతున్నాయని అందుకు తగ్గట్టుగా మనం మారాలని పిలుపు ఇచ్చారు. సంపద సృష్టితోనే సమస్యలు దూరమవుతాయని స్పష్టం చేశారు. దేశ మౌలిక రంగంలో కోటి కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment