Students Reaction On Jagananna Videshi Vidya Deevena, Know Details Inside - Sakshi
Sakshi News home page

Jagananna Videshi Vidya Deevena: ‘థ్యాంక్యూ సీఎం జగన్‌ సార్‌.. మా కల నెరవేరుస్తున్నారు’

Published Fri, Feb 3 2023 7:13 PM | Last Updated on Fri, Feb 3 2023 7:36 PM

Students Reaction On Jagananna Videshi Vidya Deevena - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్‌ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సాయం అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ఏడాది టాప్‌ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్లను సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జమ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ దేశాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.


బండి సుచరిత

పథకం ఒక చారిత్రాత్మకం: బండి సుచరిత
బండి సుచరిత, కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్ధిని, హార్వర్డ్‌ యూనివర్శిటీలో గ్లోబల్‌ హెల్త్‌ అండ్‌ పాపులేషన్‌పై మాస్టర్స్‌ చదువుతూ బోస్టన్‌ నుంచి మాట్లాడారు. గుడ్‌ మార్నింగ్‌ సార్‌. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఈ స్కీమ్‌ చాలా అద్భుతంగా ఉంది, విద్యారంగంలో ఇది గొప్ప పథకం. మెరుగైన సమాజ నిర్మాణానికి విద్య ఒకటే మార్గమని సీఎం గారు చెప్పిన విధంగా ఈ పథకం ఒక చారిత్రాత్మకం. ఏపీ ప్రభుత్వానికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు, థ్యాంక్యూ సార్‌ అని ముగించగా వెల్కమ్, విష్‌ యూ ఆల్‌ ద వెరీ బెస్ట్, మే గాడ్‌ బ్లెస్‌ యూ అంటూ సీఎం చెప్పారు. 


అల్లాడి జ్యోతిర్మయి

ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు: అల్లాడి జ్యోతిర్మయి
అల్లాడి జ్యోతిర్మయి, ఏలూరుకు చెందిన విద్యార్ధిని, వార్విక్‌ యూనివర్శిటీలో పీజీ ఇన్‌ పబ్లిక్‌ హెల్త్, కోవెంటీ నుంచి మాట్లాడారు. హలో సార్, ఇంత గొప్ప యూనివర్శిటీలో చదవడం చాలా గర్వంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను చిన్నప్పటి నుంచి సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్స్, కాలేజీలలో చదివి ఈ రోజు ఇక్కడికి రాగలిగాను, ధ్యాంక్యూ సార్‌ అని ముగించగా వండర్‌ఫుల్‌ స్టోరీ అంటూ సీఎం గారు ఆల్‌ ద వెరీ బెస్ట్‌ చెప్పారు. 


నిరూషాదేవి

కొత్త ఆశలు చిగురిస్తున్నాయి: నిరూషాదేవి
నిరూషాదేవి, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన విద్యార్ధిని, యూనివర్శిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌లో ఎంబీఏ ఇన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్, బర్మింగ్‌హామ్‌ నుంచి మాట్లాడారు. గుడ్‌ మార్నింగ్‌ సార్‌. జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీమ్‌ ద్వారా నేను బర్మింగ్‌ హామ్‌ యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్నాను. సీఎం గారు మీరు విద్యావ్యవస్ధలో మీరు తీసుకొస్తున్న సంస్కరణల వల్ల మాలో ఆత్మవిశ్వాసం పెంపొందింది. మా విద్యార్ధుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

మా కుటుంబాలు కూడా ఆర్ధికంగా నిలదొక్కుంటున్నాయి. మా యువతకు మీరు ఒక ఆదర్శం. నేను చదువుతున్న ఇదే యూనివర్శిటీలో మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్ధులు కూడా ఉన్నారు కానీ వారికి ఎవరికీ కూడా ఇలాంటి స్కీమ్స్‌ లేవు. మన దేశంలో ఏ సీఎం కూడా ఇలాంటి స్కీమ్‌ ఏర్పాటుచేయలేదు, థ్యాంక్యూ సార్, విదేశాలలో ఉన్నత విద్యను చదవాలన్న కలను మీరు నెరవేరుస్తున్నారు. థ్యాంక్యూ సో మచ్‌ సార్‌.


యోగేంద్ర నాగ సాత్విక్

మా కల నెరవేరుస్తున్నారు: యోగేంద్ర నాగ సాత్విక్
యోగేంద్ర నాగ సాత్విక్, కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్ధి, గ్లాస్గో యూనివర్శిటీలో ఎంఎస్‌సీ ఇన్‌ డేటా సైన్స్, గ్లాస్గో నుంచి మాట్లాడారు. గుడ్‌ మార్నింగ్, థ్యాంక్యూ వెరీమచ్‌ సీఎం సార్, మా విద్యార్థుల కలను మీరు నెరవేరుస్తున్నారు. ఇలాంటి టాప్‌ యూనివర్శిటీలలో చదవాలన్న మా కోరికను మీరు నెరవేర్చుతున్నారు. కృతజ్ఞతలు. నేను ఇక్కడే పీహెచ్‌డీ చేసి ఫ్రొఫెసర్‌గా చేస్తూ ఎంతోమంది నాలాంటి విద్యార్ధులకు భోదించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నాను. నా కుటుంబానికి ఇంత పెద్ద యూనివర్శిటీలలో చదివించే స్ధోమత లేదు. కానీ మీరు మా కల నెరవేరుస్తున్నారు. నాలాంటి ఎంతోమంది పేద విద్యార్ధులకు మీరు చేసే సాయం ఎప్పటికీ మరువలేము, ధ్యాంక్యూ వెరీమచ్‌ సార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement