సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యక్ష నగదు బదిలీ కింద ఎరువుల సబ్సిడీ లబ్ధిదారులకు కాకుండా ఫెర్టిలైజర్ కంపెనీలకే విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.లబ్ధిదారులకు రిటైలర్లు ఎరువులు విక్రయించిన అనంతరం సబ్సిడీని ఆయా కంపెనీలకు చెల్లిస్తామని ఎరువులు, రసాయనాల మంత్రి రావు ఇంద్రజిత్‌సింగ్ మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు.ఈ వ్యవహారంపై లోతైన విశ్లేషణ జరిపిన నీతి ఆయోగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు.
ఎల్‌పీజీ తరహాలో సబ్సిడీని నేరుగా లబ్ధిదారులకు అందచేయడం ఎరువుల సబ్సిడీ విషయంలో సాధ్యపడదని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో దశలవారీగా ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని ప్రత్యక్ష నగదు బదిలీని ప్రవేశపెడుతుందని చెప్పారు. రిటైలర్లు లబ్ధిదారులకు విక్రయించిన ఎరువుల ఆధారంగా సబ్సిడీని గ్రేడ్ల వారీగా ఆయా ఎరువుల కంపెనీలకు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఆధార్ కార్డులు లేని లబ్ధిదారులు సైతం కిసాన్ క్రెడిట్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులు చూపి సబ్సిడీపై ఎరువులను కొనుగోలు చేయవచ్చని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment