భూ పంపిణీలో కూలీలకే మొదటి ప్రాధాన్యం | The first priority in the distribution of land labors | Sakshi
Sakshi News home page

భూ పంపిణీలో కూలీలకే మొదటి ప్రాధాన్యం

Published Wed, May 20 2015 1:43 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

భూ పంపిణీలో కూలీలకే మొదటి ప్రాధాన్యం - Sakshi

భూ పంపిణీలో కూలీలకే మొదటి ప్రాధాన్యం

- జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్
- రైతుల భూముల పరిశీలన
నెక్కొండ/నర్సింహులపేట/దుగ్గొండి/చెన్నారావుపేట :
మూడెకరాల భూ పంపిణీలో లబ్ధిదారుల ఎంపికలో ఉపాధి కూలీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. నెక్కొండ మండలం నాగారం, నర్సింహులపేట మండలం వేములపల్లి, దుగ్గొండి మండలం తిమ్మంపేట, చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామాల్లో రైతుల భూములను కొనుగోలు చేసేందుకు మంగళవారం ఆయన పరిశీలించారు. నాగారం గ్రామానికి చెందిన కర్కాల వెంకట్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డికి చెందిన సర్వే నం.248,249,251లోని 17 ఎకరాల 8 గుంటల భూమిని జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సుమారు 48 దళిత కుటుంబాలు ఉండగా.. మొదటి విడతలో ఆరుగురు లబ్ధిదారులకు భూ పంపిణీ చేయూలని అన్నారు.

నెక్కొండ జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, ఆర్డీఓ భాస్కర్‌రావు, జిల్లా కోఆప్షన్ సభ్యుడు షేక్ అబ్దుల్‌నబీ, తహసీల్దార్ రాములు, డీటీ విక్రమ్‌కుమార్, సర్పంచ్ పర్కాల బిక్షం, వీఆర్‌ఓ అలీం, సంపత్, నాయకులు చిల్లా వెంకటేశ్, చల్లా వినయ్‌రెడ్డి, అమ్జత్‌ఖాన్, పాషా పాల్గొన్నారు. నర్సింహులపేట మండలం వేములపల్లిలో సర్వే నం.5లో 51 ఎకరాలు, 230లో 8-37 ఎకరాలు, 231లో 4-32 ఎకరాల భూములను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ భాస్కర్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, తహసీల్దార్ అమర్‌నాథ్, మూడావత్ కోమి, సర్పంచ్ గుమ్మడవల్లి పర్శయ్య, ఎంపీటీసీ సభ్యుడు రవి, సర్వేయర్లు గోపీసింగ్, మధు, ప్రసన్న పాల్గొన్నారు. కాగా, గ్రామంలోని ఊర చెరువులో సుమారు 4 ఎకరాల భూమిని కొందరు స్వాధీనం చేసుకొని సాగు చేసుకుంటున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సర్వేయర్‌లతో కొలతలు వేయించి రికార్డు ప్రకారం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. దుగ్గొండి మండలం తిమ్మంపేటలో 10 మంది రైతులకు చెందిన 21 ఎకరాల వ్యవసాయ భూమిని జేసీ పరిశీలించారు.

ఇదే మండలం వెంకటాపురంలో 13 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మడానికి రైతులు ముందుకొచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీఓ రామకృష్ణారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోటకూరి రమేష్, రైతులు బీరం ప్రభాకర్‌రెడ్డి, వీరారెడ్డి, ఇంద్రారెడ్డి, గంట రాజిరెడ్డి, వీఆర్‌ఓ రాజు పాల్గొన్నారు. చెన్నారావుపేట వుండలం లింగగిరి గ్రావుంలోని ప్రభుత్వ భూమిని జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయున వూట్లాడుతూ గ్రావుంలో ప్రభుత్వ భూమి 22 ఎకరాలు ఉందన్నారు. నిరుపేద దళితులకు ప్రభుత్వం 3 ఎకరాలు భూమి అందించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రవుంలో తహసీల్దార్ ఆంజనేయుులు, సర్పంచ్ గణేష్, ఆర్‌ఐలు విఠలేశ్వర్ సిరంగి, ఉవూరాణి, వీఆర్వో నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement