నేడు ఎర్రవల్లికి సీఎం
లబ్ధిదారులకు ట్రాక్టర్ల పంపిణీ
జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గ్రామచావిడి వద్ద గ్రామసభలో పాల్గొని ఇటీవల రెండు గ్రామాలకు మంజూరైన 42 ట్రాక్టర్లు అందజేస్తారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు ట్రాక్టర్లు వచ్చిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ ఫాంహౌస్ నుంచి ఎర్రవల్లికి చేరుకుని ముందుగా డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను పరిశీలిస్తారు. అనంతరం గ్రామసభలో లబ్ధిదారులకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తారు. సభ ముగించుకుని ఫాంహౌస్‌కు చేరుకుంటారు. గురువారం రాత్రి ఎర్రవల్లిలో జేసీ వెంకట్రాంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు సభ ఏర్పాట్లు పనులను పరిశీలించారు.