దేశంలో అర్హులైన పౌరులకు 60 ఏళ్ల తర్వాత స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందించే లక్ష్యంతో కేంద్రం 2015-16 ఆర్థిక సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది . ఈ పథకం పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఆర్డీఏ) నియంత్రణలో పనిచేస్తుంది.
బెన్‌ఫిట్స్
ఈ పథకం కింద ఒక వ్యక్తి 60 ఏళ్లు నిండిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి కనీసం నెలకు రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000, రూ. 4,000, గరిష్టంగా రూ. 5,000 పెన్షన్ పొందవచ్చు.
అటల్ పెన్షన్ పథకానికి అర్హులు
ఇంతకుముందు ఈ పథకం అసంఘటిత రంగాల్లో పనిచేసే వ్యక్తుల కోసం మాత్రమే ప్రారంభించబడింది. ఇప్పుడు 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో డిపాజిటర్లు 60 ఏళ్ల తర్వాత నెల నెల పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు.
అయితే, పన్ను చెల్లింపుదారులు ఇకపై అక్టోబర్ 1, 2022 నాటికి ఈ ప్రభుత్వ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అన్హరులు. ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకునేవారికి ఈ పథకాన్ని పొందేందుకు, ఒక వ్యక్తి తప్పనిసరిగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేదా ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పోస్టాఫీస్ ఖాతాను కలిగి ఉండాలి.
రూ. 5000 పెన్షన్ ఎలా పొందాలి
లబ్ధిదారులు తప్పనిసరిగా నెలవారీ, త్రైమాసిక, సెమీ యాన్యవల్ డిపాజిట్ చేయాలి. ఇలా చేస్తే 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1,000 నుండి రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు.
రూ.7లతో..రూ.5000 పెన్షన్
ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో పథకంలో చేరి నెలకు రూ. 210, లేదా రోజుకు రూ.7 డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ. 5వేలు పెన్షగా తీసుకోవచ్చు.
అదేవిధంగా త్రైమాసికానికి (3నెలల కాలానికి) రూ. 626, 6 నెలలకు రూ.1239, నెలకు రూ.42 డిపాజిట్ చేస్తే నెలకు పెన్షన్ రూ. 1000 పొందవచ్చు.
లేదంటే రూ.2వేలు పెన్షన్ కావాలంటే నెలకు రూ.84, రూ.3వేలు కావాలంటే నెలకు రూ.126 డిపాజిట్ చేయాలి.
నెలవారీ పెన్షన్ రూ. 4000 కావాలనుకుంటే రూ.168 డిపాజిట్ చేయాలి.
పన్ను ప్రయోజనాలు
పథకంలో పెట్టుబడి పెట్టే వారు ఆదాయపు పన్ను చట్టం 80 సి కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందుతారు.
ఇది కాకుండా, కొన్ని సందర్భాల్లో రూ. 50,000 వరకు అదనపు పన్ను ప్రయోజనం లభిస్తుంది. మొత్తంగా ఈ పథకం ద్వారా రూ. 2 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.
అటల్ పెన్షన్ స్కీమ్‌లో చేరడం ఎలా?
మీ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌లో అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
ఆధార్ కార్డు తో పాటు వ్యక్తిగత వివరాల్ని అందించాలి.
యాక్టీవ్‌గా ఉన్న ఫోన్ నెంబర్‌ను అందిస్తే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment