consumer bussiness
-
విప్రో కన్జూమర్ అమ్మకాలు @ రూ. 10 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం రూ. 10,000 కోట్ల మైలురాయిని దాటినట్లు విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ వెల్లడించింది. వివిధ ప్రాంతాలు, బ్రాండ్లు, కేటగిరీలవారీగా విక్రయాలు గణనీయంగా వృద్ధి చెందడం ఇందుకు దోహదపడినట్లు పేర్కొంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 8,634 కోట్లుగా నమోదైంది. (ఈ–కామర్స్ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) దేశీయంగా ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్)వ్యాపార విభాగం 17 శాతం పెరిగినట్లు తెలిపింది. సబ్బుల బ్రాండ్ సంతూర్ ఇప్పుడు నిర్దిష్ట విభాగంలో రూ. 2,650 కోట్ల అమ్మకాలతో రెండో స్థానానికి చేరిందని పేర్కొంది. అటు వియత్నాం మార్కెట్లో రెండంకెల స్థాయి వృద్ధితో 10 కోట్ల డాలర్ల ఆదాయం మార్కును దాటినట్లు .. దక్షిణాఫ్రికా, మధ్యప్రాచ్యం, ఫిలిప్పీన్స్ తదితర మార్కెట్లలోను రెండంకెల స్థాయి వృద్ధి సాధించినట్లు కంపెనీ తెలిపింది. 2003లో రూ. 300 కోట్ల ఆదాయం ఉండగా .. గత రెండు దశాబ్దాల్లో 33 రెట్లు పెంచుకుని నేడు అంతర్జాతీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజంగా ఎదిగామని సంస్థ సీఈవో వినీత్ అగ్రవాల్ తెలిపారు. 1945లో వనస్పతి సంస్థగా ప్రారంభమైన విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్‌కు ప్రస్తుతం 60 పైగా దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. 18 ఫ్యాక్టరీలు, 10,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. ఆదాయంలో 51 శాతం వాటా అంతర్జాతీయ వ్యాపారం నుంచి ఉంటోంది. -
ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలోకి విప్రో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎఫ్ఎంసీజీ రంగ దిగ్గజం విప్రో కంజ్యూమర్ కేర్, లైటింగ్ తాజాగా ప్యాకేజ్డ్ ఫుడ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. చిరుతిళ్లు, మసాలా దినుసులు, రెడీ టు ఈట్ విభాగంలో సుస్థిర స్థానం సంపాదించాలన్నది సంస్థ లక్ష్యం. కాగా, సంతూర్, యార్డ్లీ, చంద్రిక, గ్లూకోవిట, సేఫ్‌వాష్ వంటి బ్రాండ్లను సంస్థ ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే కంపెనీ తన ఉత్పత్తులను ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య మార్కెట్లలో విక్రయిస్తోంది. 2021–22లో విప్రో కంజ్యూమర్ కేర్ రూ.8,634 కోట్ల టర్నోవర్ సాధిచింది. -
ఆస్ట్రల్ పాలీ జోష్- యాంబర్ డౌన్
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీవీసి పైపుల కంపెనీ ఆస్ట్రల్ పాలీటెక్నిక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో పనితీరు నిరాశపరచడంతో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ యాంబర్ ఎంటర్ ప్రైజెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ లాభాలతో కళకళలాడుతుంటే.. రికార్డుల మార్కెట్లోనూ యాంబర్ ఎంటర్ ప్రైజెస్ కౌంటర్ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం.. ఆస్ట్రల్ పాలీటెక్నిక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆస్ట్రల్ పాలీటెక్నిక్ నికర లాభం దాదాపు 7 శాతం బలపడి రూ. 88 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 10 శాతం పెరిగి రూ. 747 కోట్లను అధిగమించాయి. అధెసివ్స్ బిజినెస్ 29 శాతం ఎగసి రూ. 190 కోట్లకు చేరడం మెరుగైన పనితీరుకు దోహదం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇబిటా మార్జిన్లు 2.2 శాతం పుంజుకుని 21 శాతాన్ని దాటాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రల్ పాలీటెక్నిక్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం జంప్ చేసి రూ. 1,200 వద్ద ట్రేడవుతోంది. తొలుత 7.2 శాతం పురోగమించి రూ. 1,249ను తాకింది. యాంబర్ ఎంటర్ ప్రైజెస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో యాంబర్ ఎంటర్ ప్రైజెస్ నికర లాభం 77 శాతం పడిపోయి రూ. 3 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 35 శాతం నీరసించి రూ. 408 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 1.34 శాతం క్షీణించి 4.8 శాతానికి చేరాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం యాంబర్ ఎంటర్ ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో 5.5 శాతం పతనమై రూ. 2,193 వద్ద ట్రేడవుతోంది. తొలుత 7.3 శాతం వెనకడుగుతో రూ. 2,150ను తాకింది. -
బడ్జెట్ ఎక్కువగా మేలు చేసింది వీరికేనట..!
సాక్షి, న్యూఢిల్లీ: రూరల్ ఫ్రెండ్లీ బడ్జెట్‌గా ప్రభుత్వం ప్రకటించిన 2018 ఆర్థిక బడ్జెట్లో ఎఫ్ఎంసీజీ రంగానికే ఎక్కువ బూస్ట్ లభించిందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలపై దృష్టిపెట్టి, లాభపడుతున్న కన్జ్యూమర్, ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్రస్తుత బడ్జెట్‌తో మరింత భారీగా లాభపడనున్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలతో అసంఘటిత రంగం కుదేలవుతుండగా.. బడ్జెట్ ప్రోత్సాహకాలతో భారీ ఎఫ్ఎంసీజీ కంపెనీలు మరింత పుంజుకోనున్నాయి. అలాగే దిగుమతులపై సుంకం పెంచడం కూడా ఈ కంపెనీలకు లాభదాయకం. అంతేకాదు దిగుమతి సుంకం పెంపు స్థానిక కంపెనీలకు, ఉత్పత్తులకు ఊతమివ్వనుంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు. ప్రధాన కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టోర్స్ అన్నీ పల్లెల్లోకి విస్తరించాయి. ఇప్పటికే గ్రామీణ మార్కెట్‌పై దిగ్గజ కంపెనీలు ఆకర్షణీయ ఉత్పత్తులను అందుబాటులోకి తేవడంతోపాటు, మంచి ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ వినియోగదారుడు లోకల్‌బ్రాండ్ కంటే నేషనల్ బ్రాండ్ వైపు మొగ్గుచూపుతారని భావిస్తున్నారు. దీనికి తోడు ప్రధానంగా 2022నాటికి రైతులు ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంతో ఉన్నామని ఆర్థికమంత్రి ప్రకటించారు. అలాగే పంటలకు కనీస మద్దతు ధర 150 శాతం పెరగనుందని వెల్లడించారు. దీంతో గ్రామీణుల వినిమయ శక్తిని ఇప్పటికే విస్తరించిన ఈ కంపెనీలు సొమ్ము చేసుకుంటాయని అంచనా. -
ఎయిర్టెల్ కస్టమైజ్డ్ ప్లాన్స్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం కస్టమైజ్డ్ ప్లాన్స్‌ను అందిస్తోంది. వినియోగదారులు తమ వినియోగ ప్రాధాన్యతలను బట్టి ఈ ప్లాన్లను కస్టమైజ్ చేసుకోవచ్చని భారతీ ఎయిర్టెల్ సీఎంఓ(కన్సూమర్ బిజినెస్) గోవింద్ రాజన్ పేర్కొన్నారు. రూ.199 నుంచి రూ.999 రేంజ్లో ఐదు రెంటల్ ఆప్షన్లనందిస్తున్నామని వివరించారు. తామందిస్తున్న ఈ ప్లాన్స్ల్లో ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్లు, డేటా యూసేజ్.. ఇవన్నీ నిర్దేశిత యూనిట్లలో ఉంటాయని వివరిం చారు. కొంత మంది లోకల్ కాల్స్ మీద, మరికొంతమంది ఎస్టీడీ కాల్స్ మీద, ఇంకొంతమంది డేటా వినియోగంపైనే ఎక్కువ ఖర్చు చేస్తారని పేర్కొన్నా రు. వినియోగదారులు తమ అవసరాలకనుగుణంగా ఈ ప్లాన్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చని వివరించారు.