ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలి
Published Sun, Sep 4 2016 12:32 AM | Last Updated on Thu, Jul 11 2019 8:03 PM
ఖిలా వరంగల్ : ఏటూరునాగారం కేంద్రంగా ఆదివాసీ స్వయంపాలిత జిల్లాను ఏర్పాటు చేయాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి గాదగోని రవి డిమాండ్ చేశారు. వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద గల ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపురం, ములుగు కొత్తగూడ, గూడూరు, ఖానాపురం, నల్లబెల్లి, భూపాలపల్లి, గణపురం, మహాముత్తారం మహదేవ్‌పూర్ ప్రాంతాలను కలిపి ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గాదె ప్రభాకర్‌రెడ్డి, సీసీఐ నాయకులు మేకల రవి, కత్తి నాగార్జున, న్యూడెమోక్రసీ నాయకులు పసునూటి రాజు, ఆరెల్లి కృష్ణ, ఎంసీపీఐ(యూ) నేతలు గోనె కుమారస్వామి, హంసారెడ్డి, నాగెల్లి కొముర య్య, రవి, రాజమౌళి, మల్లికార్జున్, రవీందర్, బాబురావు పాల్గొన్నారు.
Advertisement