ములుగు ఎన్‌కౌంటర్‌..హైకోర్టు కీలక ఆదేశాలు | Telangana High Court Key Order On Mulugu Encounter | Sakshi
Sakshi News home page

ములుగు ఎన్‌కౌంటర్‌..హైకోర్టు కీలక ఆదేశాలు

Published Tue, Dec 3 2024 1:32 PM | Last Updated on Tue, Dec 3 2024 4:04 PM

Telangana High Court Key Order On Mulugu Encounter

సాక్షి,హైదరాబాద్‌:ఏటూరునాగారంలో ఇటీవల జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై మంగళవారం(డిసెంబర్‌3) హైకోర్టులో విచారణ జరిగింది.పిటిషనర్‌,ప్రభుత్వం తరపున వాదనలను కోర్టు విన్నది. పిటిషనర్‌ ఐలమ్మ భర్త మధు అలియాస్‌ మల్లయ్య మృతదేహాన్ని భద్రపరచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తన భర్త మృతదేహంపై తీవ్ర గాయాలున్నాయన్న ఐలమ్మ తరపు న్యాయవాది వాదనల మేరకు హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది.

కుటుంబ సభ్యులు అడిగితే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇతర మావోయిస్టుల మృతదేహాలను హ్యాండ్‌ఓవర్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా,ఆదివారం ఏటూరునాగారం చల్పాక వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.

అయితే మావోయిస్టుల మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులతో పాటు పౌరహక్కుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.హైకోర్టు ఆదేశాలతో మావోయిస్టుల మృతదేహాలను కాకతీయ మెడికల్‌ కాలేజీ(కేఎంసీ) మార్చురిలో పోలీసులు భద్రపరిచారు. కోర్టు మంగళవారం ఇచ్చిన ఆదేశాల తర్వాత మధు బాడీ తప్ప మిగిలిన మావోయిస్టుల  మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

ఇదీ చదవండి: వారి మృతదేహాలను భద్రపర్చండి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement