Tribal district
-
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం
-
జిల్లాల విభజనకు ప్రాతిపదిక ఏమిటో?:కోదండరాం
ఏ ప్రాతిపదికన జిల్లాలను విభజిస్తున్నారో అర్దం కాని పరిస్థితి అని, ఇది ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాల విభజన ప్రాతిపదికను ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయాలను చెప్పేందుకు నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే విభజన నిర్ణయాలు జరగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల ప్రాంతాల విషయంలో షెడ్యూల్ 5, భూరియా కమిటీ సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ ప్రత్యేక జిల్లాల ఏర్పాటుతో వారికి సంబంధించిన అటవీ హక్కుల చట్టం, పంచారుుతీరాజ్ చట్టాలు సక్రమంగా అమలవుతాయని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాజకీయ జేఏసీ కూడా ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపుతుందని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఆదివాసీలు బలహీనంగా ఉన్నారనే వారిని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్నారని, 1/70 చట్టం అమలు కావడం లేదని అన్నారు. ప్రత్యేక నాగరికత, అలవాట్లు ఉన్న గిరిజనులు వారి పంచారుుతీల్లో కోర్ట్‌ల కంటే భిన్నంగా చైతన్యవంతమైన తీర్పులిస్తారని అన్నారు. రాజ్యాంగంలో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, కేసీఆర్‌కు నిజమైన ప్రేమ ఉంటే గిరిజనులకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డియాండ్ చేశారు. సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేస్తున్న జిల్లాల్లో ఆదివాసీ జిల్లాల ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ర్టంలో 12శాతం ఉన్న ఆదివాసీలు స్వయంపాలిత జిల్లాలు కావాలని ఎంతోకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారని దీన్ని విస్మరించడం బాధాకరమన్నారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ముందు తరాల కోసం ప్రకృతి సంపదను కాపాడుతున్న ఆదివాసీల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కేసీఆర్‌కు యాదాద్రి సెంటిమెంట్ తప్ప మరోకటి లేదని ఎందుకంటే అది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ అని ఎద్దేవా చేశారు. కెచ్చల రంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, టిడిపి రాష్ర్ట నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్, కరుణం రామకృష్ణ, ఆర్ఎస్పీ నాయకులు జానకి రాములు, న్యూ డెమోక్రసీ నాయకులు పోటు రంగారావు, ఆదివాసీ నాయకులు వట్టం నారాయణ, పీవోడబ్ల్యూ అధ్యక్షులు ఝాన్సీ, కె. సూర్యం, ఎం.హన్మేష్, గౌతం ప్రసాద్, ఎస్ఎల్ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలి
ఖిలా వరంగల్ : ఏటూరునాగారం కేంద్రంగా ఆదివాసీ స్వయంపాలిత జిల్లాను ఏర్పాటు చేయాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి గాదగోని రవి డిమాండ్ చేశారు. వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద గల ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపురం, ములుగు కొత్తగూడ, గూడూరు, ఖానాపురం, నల్లబెల్లి, భూపాలపల్లి, గణపురం, మహాముత్తారం మహదేవ్పూర్ ప్రాంతాలను కలిపి ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గాదె ప్రభాకర్‌రెడ్డి, సీసీఐ నాయకులు మేకల రవి, కత్తి నాగార్జున, న్యూడెమోక్రసీ నాయకులు పసునూటి రాజు, ఆరెల్లి కృష్ణ, ఎంసీపీఐ(యూ) నేతలు గోనె కుమారస్వామి, హంసారెడ్డి, నాగెల్లి కొముర య్య, రవి, రాజమౌళి, మల్లికార్జున్, రవీందర్, బాబురావు పాల్గొన్నారు. -
భద్రాచలంను గిరిజన జిల్లాగా ప్రకటించాలి
ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ మండలాలతో భద్రాచలం కేంద్రంగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని ఆదివాసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. సోమవారం భద్రాచలంలో ఆదివాసీ విద్యార్థులు, ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పెండింగ్ లో ఉన్న ఆదివాసీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
గిరిజన జిల్లాలో జంగారెడ్డిగూడెం లేదు
జంగారెడ్డిగూడెం :నూతనంగా ఏర్పాటు చేసే గిరిజన జిల్లాలో జంగారెడ్డిగూడెం మండలాన్ని విలీనం చేసే అంశం ప్రభుత్వ దృష్టిలో లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. బుధవారం ఆయన జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ గిరిజన జిల్లాలో కలిపే మండలాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రస్తుతం అభిప్రాయ సేకరణ మాత్రమే చేపట్టారన్నారు. గిరిజన మండలాలతో మైదాన ప్రాంత మండలాలను కలిపే అవకాశం ఉండదని తెలిపారు. అలాకాకుండా జంగారెడ్డిగూడెంను గిరిజన జిల్లాలో కలపాల్సి వస్తే తప్పనిసరిగా కేబినెట్లో చర్చించాల్సి వస్తుందన్నారు. ఆ సమయంలో తామే ఆ ప్రతిపాదనలను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేస్తాం నామినేటెడ్ పదవుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చినరాజప్ప చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తామని, అన్నివిధాలుగా వారిని ఆదుకుంటామని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో చోరీలు, ఇతర నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇక్కడ నేర పరిశోధన స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరగా, దీనిపై ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. కోర్టు భవనాల పరిశీలన శిథిలావస్థలో ఉన్న జంగారెడ్డిగూడెం కోర్టు భవనాలను ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మంగళవారం పరిశీలించారు. కోర్టు ఏర్పాటు చేసిన స్థలాన్ని ప్రభుత్వం ఇంకా అప్పగించలేదని, దీంతో నిధులు ఉన్నప్పటికీ నూతన భవనాలు నిర్మించుకోలేక శిథిలావస్ధలో ఉన్న భవనాల్లో విధులు నిర్వహించాల్సి వస్తోందని బార్ అసోషియేషన్ అధ్యక్షుడు గన్నమనేని శేఖర్, న్యాయవాదులు అచ్యుత శ్రీనివాసరావు, మాండ్రు మోహన్ మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు గదులను పరిశీలించిన మంత్రులు సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఉద్దండం ఏసుబాబు, కైకాల చంద్రశేఖర్, మాజీ బార్ అసోషియేషన్ అధ్యక్షులు నిమ్మగడ్డ రాంబాబు ఉన్నారు. సీసీ రోడ్లు, పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో రూ.5.45 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, రూ.3 లక్షలతో చేపట్టే పైప్‌లైన్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.14.80 లక్షలతో అదనపు తరగతుల భవనాల నిర్మాణ పనులకు చినరాజప్ప శంకుస్థాపన చేశారు. తహిసిల్దార్ కార్యాలయం సమీపంలో టీటీడీ కల్యాణ మండపం వద్ద లో వోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన 63కేవీ ట్రాన్స్ఫార్మర్ను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రారంభించారు. ఆర్డీవో వి.మురళీమోహన్రావు, తహసిల్దార్ జేవీవీ సత్యనారాయణ, నగర పంచాయతీ కమిషనర్ వి.నటరాజన్, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంఈవో డి.సుబ్బారావు, టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మండవ లక్ష్మణరావు, నాయకులు షేక్ ముస్తఫా, రాజాన సత్యనారాయణ (పండు), దల్లి కృష్ణారెడ్డి, పెనుమర్తి రామ్‌కుమార్, అబ్బిన దత్తాత్రేయ, డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, సీఐ కె.అంబికాకృష్ణ పాల్గొన్నారు. -
జంగారెడ్డిగూడెంను కలిపితే పోరాటం
జంగారెడ్డిగూడెం : ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటులో జంగారెడ్డిగూడెం కలవకపోవచ్చని రాష్ట్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. మంగళవారం ఆమె జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ పాలకవర్గంతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. జంగారెడ్డిగూడెం ప్రాంతాన్ని ప్రత్యేక గిరిజన జిల్లాలో కలిపే అవకాశం లేదని, దీనిపై ఆందోళన చెందవద్దన్నారు. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదన్నారు. ఒకవేళ జంగారెడ్డిగూడెం గిరిజన జిల్లాలో కలిస్తే తానుకూడా ఇక్కడి ప్రజలతో పాటు ఆందోళనలో పాల్గొని పోరాడతానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రిని పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, కమిషనర్ వి.నటరాజన, డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, టీడీపీ నాయకులు షేక్‌ముస్తఫా, రాజా సత్యనారాయణ, కోఆప్షన్‌సభ్యుడు ఇస్మాయేల్, రామ్‌కుమార్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంను పశ్చిమలోనే ఉంచాలి జంగారెడ్డిగూడెం రూరల్ : గిరిజన ప్రత్యేక జిల్లా ఏర్పాటుపై మంగళవారం గుర్వాయిగూడెం, పుట్లగట్లగూడెం, నాగులగూడెం, దేవులపల్లి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలు నిర్వహించారు. తహసిల్దార్ జీవీవీ సత్యనారాయణ, ఆర్ఐ భుజంగం అభిప్రాయాలను స్వీకరించారు. రంపచోడవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని, జంగారెడ్డిగూడెం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉంచాలని, లేకపోతే జంగారెడ్డిగూడెం పట్టణాన్ని జిల్లా ముఖ్య కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజలు, వివిధ పార్టీల నాయకులు తమ అభిప్రాయాన్ని వెలిబుచాచరు. సర్పంచ్‌లు బాకి శ్రీనివాసరెడ్డి, దండ్రు రంగమ్మ, డి.అప్పారావు, దోరేపల్లి గంగాపార్వతి, వైస్ ఎంపీపీ ఉమ్మడి రాంబాబు, నాయకులు దల్లి రామాంజనేయరెడ్డి, దల్లి కృష్ణారెడ్డి తమ అభిప్రాయాలను అధికారులకు అందజేశారు. బుధవారం మండలంలోని లక్కవరం, టెక్కినవారిగూడెం, అమ్మపాలెం, నిమ్మగూడెం గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలు నిర్వహిస్తామని తహసిల్దార్ సత్యనారాయణ చెప్పారు. -
గిరి‘జన గోడు’
సాక్షి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లోని గిరిజన మండలాలతోపాటు రాష్ట్ర విభజన తర్వాత రెండు జిల్లాల్లో కలిసిన పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలతో ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, గిరిజన జిల్లా ఏర్పాటు అంశం క్రమంగా జఠిలమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం లేదా మన జిల్లాలోని పోలవరాన్ని కొత్త జిల్లాకు కేంద్రంగా చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ విషయంపై రచ్చ సాగుతోంది. మరోవైపు గిరిజన జిల్లాలో కలవడం తమకు ఇష్టం లేదని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లోని గిరిజనేతరులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు ఇలా.. జిల్లాలో ఇప్పటికే 39లక్షల పైగా జనాభా ఉన్నారు. మొన్నటివరకూ ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న వేలేరుపాడు, బూర్గంపాడు మండల పరిధిలోని కొన్ని గ్రామాలు కలిసిన కుక్కునూరు మండలాలు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో విలీనం అయ్యూరుు. తద్వారా ఆ మండలాలకు చెందిన దాదాపు 70వేల జనాభా మన జిల్లాలో చేరింది. దీంతో జిల్లా జనాభా 40 లక్షలు దాటిపోనుంది. జనాభాతోపాటు భూ విస్తీర్ణం, అటవీ విస్తీర్ణం కూడా పెరుగుతున్నారుు. ఈ నేపథ్యంలో గిరిజన మండలాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, టి.నరసాపురం, కొత్తగా కలిసిన కుకునూరు, వేలేరుపాడు మండలాలతోపాటు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, దేవీపట్నం, ఆ జిల్లాలో కలిసిన కూనవరం, చింతూరు, భద్రాచలం రూరల్ మండలాలతో కలిపి గిరిజన జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గిరిజనేతరుల ఆందోళన ప్రత్యేక జిల్లా ఏర్పాటుపై జంగారెడ్డిగూడెం మండలం ఎ.పోలవరం, తాడువాయి, వేగవరం, చక్రదేవరపల్లి గ్రామాల్లో సోమవారం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో నాలుగురోజుల క్రితం జిల్లా కలెక్టర్ స్వయంగా ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించారు. గిరిజనులు ప్రత్యేక జిల్లాకు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నప్పటికీ గిరిజనేతరులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కొయ్యలగూడెం మండలాన్ని కొత్త జిల్లాలో విలీనం చేయూలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా కన్నాపురం పంచాయతీ సోమవారం తీర్మానం చేసింది. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలో తరచూ నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. గోపాలపురం మండలంలోని గిరిజనేతరులు సైతం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. గిరి జన ప్రత్యేక చట్టాల వల్ల తాము నష్టపోతామని ఆ మండలాల్లోని గిరిజనేతరులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంపై రచ్చ గిరిజన జిల్లా ఏర్పాటు అనివార్యమైతే ఆ జిల్లా కేంద్రం ఎక్కడ ఉండాలనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా గిరిజనులు గట్టిగానే పట్టుపడుతున్నారు. జిల్లాలోని పోలవరం లేదా కేఆర్ పురంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇక్కడి గిరిజనుల నుంచి వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరాన్ని జిల్లా కేంద్రం చేయాలని అక్కడి గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని పోల వరం నుంచి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వెళ్లేందుకు ప్రస్తుతం నేరుగా మార్గం లేదు. పోలవరం నుంచి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీదుగా గోదావరిని దాటి రాజమండ్రికి.. అక్కడి నుంచి రంపచోడవరం వెళ్లాలి. అంటే దాదాపు 120 కిలోమీటర్లు చుట్టుతిరిగి వెళ్లాల్సి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి పోలవరం నుంచి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వరకూ రోడ్డు నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే ఈ రెండు ప్రాం తాల మధ్య దూరం 50 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. ఇటు ఖమ్మం జిల్లా నుంచి కలిసిన మండలాలకు సైతం దూరం తగ్గుతుంది. ఈ సౌలభ్యం ఉందనే కారణంగా పోలవరాన్ని జిల్లా కేంద్రం చేయాలని జిల్లాలోని గిరిజనులు కోరుతున్నారు. ఐటీడీఏను విస్తరిస్తారా గిరిజన జిల్లా ఏర్పాటు ఆలస్యమయ్యేలా ఉంటే గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ)ను విస్తరించాల్సి వస్తుంది. ఖమ్మం జిల్లా పాల్వంచ రెవెన్యూ డివిజన్లోని కుకునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా (73 గ్రామాలు), బూర్గంపాడు మండలాన్ని పాక్షికంగా (6 గ్రామా లు) జిల్లాలోని జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో కలపాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఈ మండలాలు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉండేవి. వీటిని జిల్లాలోని కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాల్సి ఉంది. ప్రస్తుతం కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలు ఉన్నాయి. కలెక్టర్‌ను కలిసిన బాలరాజు కొత్తగా ఏర్పాటయ్యే గిరిజన జిల్లా కేంద్రంగా పోలవరాన్ని ఎంపిక చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ కన్వీనర్, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను సోమవారం కోరారు. ఇరు జిల్లాలకు అందుబాటులో ఉండటంతోపాటు ఇందిరా సాగర్ జాతీయ ప్రాజెక్టు నిర్మితమవుతున్న దృష్ట్యా పోలవరానికి ప్రాధాన్యత ఏర్పడిందని కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని బాలరాజుకు కలెక్టర్ హామీ ఇచ్చారు.