జిల్లాల విభజనకు ప్రాతిపదిక ఏమిటో?:కోదండరాం | Kodandaram comments on the division of districts | Sakshi
Sakshi News home page

జిల్లాల విభజనకు ప్రాతిపదిక ఏమిటో?:కోదండరాం

Published Tue, Sep 13 2016 8:00 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

Kodandaram comments on the division of districts

ఏ ప్రాతిపదికన జిల్లాలను విభజిస్తున్నారో అర్దం కాని పరిస్థితి అని, ఇది ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాల విభజన ప్రాతిపదికను ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయాలను చెప్పేందుకు నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే విభజన నిర్ణయాలు జరగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఆదివాసీల ప్రాంతాల విషయంలో షెడ్యూల్ 5, భూరియా కమిటీ సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ ప్రత్యేక జిల్లాల ఏర్పాటుతో వారికి సంబంధించిన అటవీ హక్కుల చట్టం, పంచారుుతీరాజ్ చట్టాలు సక్రమంగా అమలవుతాయని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాజకీయ జేఏసీ కూడా ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపుతుందని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఆదివాసీలు బలహీనంగా ఉన్నారనే వారిని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్నారని, 1/70 చట్టం అమలు కావడం లేదని అన్నారు.

 

ప్రత్యేక నాగరికత, అలవాట్లు ఉన్న గిరిజనులు వారి పంచారుుతీల్లో కోర్ట్‌ల కంటే భిన్నంగా చైతన్యవంతమైన తీర్పులిస్తారని అన్నారు. రాజ్యాంగంలో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, కేసీఆర్‌కు నిజమైన ప్రేమ ఉంటే గిరిజనులకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డియాండ్ చేశారు. సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేస్తున్న జిల్లాల్లో ఆదివాసీ జిల్లాల ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ర్టంలో 12శాతం ఉన్న ఆదివాసీలు స్వయంపాలిత జిల్లాలు కావాలని ఎంతోకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారని దీన్ని విస్మరించడం బాధాకరమన్నారు.

 

విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ముందు తరాల కోసం ప్రకృతి సంపదను కాపాడుతున్న ఆదివాసీల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కేసీఆర్‌కు యాదాద్రి సెంటిమెంట్ తప్ప మరోకటి లేదని ఎందుకంటే అది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ అని ఎద్దేవా చేశారు. కెచ్చల రంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, టిడిపి రాష్ర్ట నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్, కరుణం రామకృష్ణ, ఆర్‌ఎస్పీ నాయకులు జానకి రాములు, న్యూ డెమోక్రసీ నాయకులు పోటు రంగారావు, ఆదివాసీ నాయకులు వట్టం నారాయణ, పీవోడబ్ల్యూ అధ్యక్షులు ఝాన్సీ, కె. సూర్యం, ఎం.హన్మేష్, గౌతం ప్రసాద్, ఎస్‌ఎల్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement