District Division
-
జిల్లాల విభజనకు రెండేళ్లు
సాక్షి, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా విభజన జరిగి నేటితో రెండేళ్లు పూర్తవుతుంది. 2016 అక్టోబర్ 11వ తేదీన దసరా పండగ నాడు ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటివరకు ఒక్కటిగా ఉన్న ఆదిలాబాద్ విభజనతో నాలుగు జిల్లాలుగా విడిపోయింది. దీంతో ఆయా జిల్లాలో పరిపాలనా వ్యవస్థ, పాలనా యంత్రాంగం ప్రజలకు చేరువైంది. విభజనకు ముందు ప్రజలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవారు. జిల్లా విస్తీర్ణం దృష్ట్యా ఉన్నతాధికారులు ఉమ్మడి జిల్లాలో పర్యటించడానికి ఇబ్బందులు పడేవారు. ఉదయం వెళ్లినవారు రాత్రయ్యే వరకు పర్యటించినా కొన్ని గ్రామాలు మాత్రమే తిరిగివచ్చే పరిస్థితి ఉండేది. ఆదిలాబాద్ నుంచి చెన్నూర్, మంచిర్యాల, కోటపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక రోజు సమయం పట్టేది. జిల్లాల విభజనతో అధికారులు మధ్యాహ్నంలోగానే ఆయా ప్రాంతాలను సందర్శించడంతో పాటు పాలనపరంగా ప్రజలకు చేరువయ్యారు. అయితే ఆయా శాఖల ఉద్యోగులను నాలుగు జిల్లాలకు విభజించడంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పడింది. ఇంకా చాలా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా ఉన్న సమయంలో ఏ కార్యాలయంలో చూసినా ప్రజలతో కిక్కిరిసిపోయి కనిపించేది. ప్రస్తుతం పరిస్థితి దానికి భిన్నంగా మారింది. గతంకంటే కొంత మేలు... ఉమ్మడి జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ వెనుకబాటుకు గురైంది. జిల్లాల విభజన తర్వాత ప్రభుత్వ పథకాలు ప్రజలకు కొంత మేరకు చేరువయ్యాయి. దీంతో పాలన ప్రగతిపథం వైపు సాగుతోంది. చిన్న జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ.. ప్రభుత్వ శాఖల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, ఉద్యోగుల భర్తీ విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. కొత్త పాలనకు రెండేళ్లు గడుస్తున్నా ఆయా శాఖల్లో ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. మరికొన్ని కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో పనుల్లో జాప్యం జరుగుతోంది. జిల్లా విభజన తర్వాత ప్రజలకు కొంత మేలు జరిగిందనే చెప్పుకోవచ్చు. పలు కార్యక్రమాల్లో జిల్లా ముందడుగు వేస్తోంది. అనుభవం ఉన్న అధికారులు ఉండడంతో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారుల అనుభవం తోడైంది. దీంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం అమలులో జిల్లాకు మొదటిస్థానం రావడంతో కలెక్టర్ అవార్డు అందుకున్న విషయం విదితమే. ఉద్యోగుల కొరతతో ఇబ్బందులు... జిల్లాల విభజన ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల కొర త ఎదురైంది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ప్రభు త్వ కార్యాలయాలన్ని ఉద్యోగులతో కలకలలాడే వి. కానీ ప్రస్తుతం ఏ కార్యాలయంలో చూసిన వెలవెలబోతున్నాయి. ఇటు పనుల్లో సైతం జాప్యం జరుగుతుండగా.. ఉన్న సిబ్బం దిపై పనిభారం పెరిగిపోతోంది. ప్రజలకు సకాలంలో పని కాకపోవడంతో ఉన్న అధికారులపైనే భారం పడుతోంది. ఇలా పలు ప్రభుత్వ కార్యాయాల్లో ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో వెయ్యి పోస్టుల వర కు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యు విభాగం, పంచాయతీరాజ్, సంక్షేమ శాఖల్లో పలు ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా జిల్లా విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఐదు మండలాల్లోని ఆయా కార్యాలయాల్లో సౌకర్యాలు కనిపించడం లేదు. సిబ్బంది కొరతతో పాటు కంప్యూటర్ వంటి యంత్రాలు, ఫర్నీచర్, తదితర సదుపాయలు పూర్తిస్థాయిలో కల్పించలేదు. శాంతిభద్రతలు అదుపులో... చిన్న జిల్లా ఏర్పాటు కావడంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో నేరాలు అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇటు నేరాల అదుపుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ గుర్తింపు పొందుతున్నారు. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసుల విధుల్లో సాంకేతికత వంటి అంశాలపై దృష్టి సారించారు. మహిళలకు రక్షణగా ఉట్నూర్, ఇచ్చోడలో సైతం షీ టీంలు ఏర్పాటు చేశారు. మట్కా నిర్వహణపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో నిఘా వేసి అరెస్టు చేస్తున్నారు. దీంతోపాటు మహారాష్ట్ర నుంచి అక్రమంగా జిల్లాకు రవాణా చేసే దేశీదారును అబ్కారీ శాఖ అధికారులతో కలిసి అడ్డుకట్ట వేసే పనుల్టో నిమగ్నమయ్యారు. గుడుంబా, గుట్కా స్వాధీనం చేసి పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడంతో జరిమానాలు విధిస్తున్నారు. దీంతోపాటు పోలీసు వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందేలా చర్యలు చేపట్టారు. మారిన కలెక్టర్, ఎస్పీ.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కలెక్టర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్, ఎస్పీగా విక్రమ్‌జిత్ దుగ్గల్ వ్యవహరించారు. జిల్లాల విభజన తర్వాత కూడా కలెక్టర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్ కొనసాగగా, విక్రమ్‌జిత్ దుగ్గల్ నూతనంగా ఏర్పడిన రామగుండం పోలీస్ కమిషనర్‌గా నియామకం అయ్యారు. దీంతో ఆదిలాబాద్ ఎస్పీగా ఎం.శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ఆదివాసీ ఉద్యమం నేపథ్యంలో వీరిద్దరిని బదిలీ చేసిన సర్కారు నూతన కలెక్టర్‌గా దివ్య దేవరాజన్, ఎస్పీగా విష్ణు ఎస్.వారియర్లను నియమించింది. ప్రస్తుతం వీరిద్దరు తమ పనితీరుతో జిల్లా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు. కొత్త జిల్లాలతో పాలనా సౌలభ్యం కొత్త జిల్లాలు ఏర్పడడం వల్ల పాలన సౌలభ్యంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా విశాలంగా ఉండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. జిల్లా అధికారులకు సమస్యలను విన్నవించడానికి అష్టకష్టాలు పడేవారు. ప్రస్తుతం జిల్లాలు చిన్నగా ఏర్పడడంతో ప్రజల వద్దకే అధికారులు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆయా శాఖల్లో ఖాళీలు ఉండడంతో ఉద్యోగులపై కొంత అదనపు భారం పడుతోంది. – వనజారెడ్డి, తహసీల్దార్, భీంపూర్ -
కేంద్రానికి సంబంధం లేదు
జిల్లాల విభజనపై ముఖ్యమంత్రి స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: జిల్లాల విభజనకు కేంద్రానికి సంబం ధంలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశమన్నారు. జిల్లాలను 31గా విభజించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందని.. అంగీకారం తెలపలేదంటూ ఇటీవల ఒక టీవీ చానల్లో వచ్చిన కథనాన్ని శుక్రవారం అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ లేవనెత్తగా సీఎం కలుగజేసుకొని సమాధానమిచ్చారు. అత్యుత్సాహపు మీడియా ఏదేదో చేస్తుందని... ఉన్నదీ లేనిదీ చెపుతుందని.. అది తప్పుడు కథనమని స్పష్టంచేశారు. -
రాత్రికిరాత్రి మార్చేశారు!
► జిల్లాల విభజనపై ప్రొఫెసర్ కోదండరాం ► నోటిఫికేషన్ ఓ రకంగా తుది ప్రకటన మరో రకంగానా..? ► ప్రజాభీష్టాన్ని పట్టించుకోకుండా విభజించారని ఆరోపణ ► ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘జిల్లాల పునర్విభజన ప్రజల అభీష్టం మేరకు జరగలేదు. అందుకే చాలా ప్రాంతాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళనలే ఇందుకు నిదర్శనం. ఆందోళన చేస్తున్న వారిని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి. అలా కాకుండా పోలీసులను పెట్టి అణచివేసే ప్రయత్నం చేయటం సరికాదు. తమ డిమాండ్లను పట్టించుకోవటం లేదన్న ఆవేదనతో ఇటీవల ముగ్గురు ఆత్మహత్యకు యత్నించగా.. ఇద్దరు మృతి చెందారు. ప్రభుత్వం వెంటనే మేల్కొనకపోతే ఈ ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది. ప్రజలు నేరుగా మాట్లాడే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించాలి. సహేతుకమైన ఆందోళనలకు తమ పూర్తి మద్దతు ఉంటుంది’ అని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాల విభజనలో భాగంగా మండలాలు, గ్రామాల విలీనాలకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం జేఏసీ ప్రతినిధులతో కలసి ఆయన సీఎస్ రాజీవ్ శర్మకు వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకున్నాక.. జిల్లాల విభజనకు సంబంధించి తొలుత నోటిఫికేషన్ ఓ రకంగా వెలువడగా, తుది నిర్ణయం మరోలా వచ్చిందని విమర్శించారు. ప్రజలతో ప్రమేయం లేకుండా రాజకీయ నేతల ఒత్తిళ్లతోనో, మరే కారణాలతోనో రాత్రికిరాత్రే మార్పులు చేర్పులు జరగటం స్థానికులను ఆందోళనకు గురి చేసిందన్నారు. గట్టుప్పల్ మండలం ఉంటుందని ప్రకటన వెలువడటంతో స్థానికంగా మండల కేంద్రం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక.. ముందురోజు రాత్రి దాన్ని రద్దు చేయటమే ఇందుకు నిదర్శనమన్నారు. దీన్ని జీర్ణించుకోలేక బొడిగ సోని అనే యువతి ఆత్మహత్య చేసుకుందని, ఏర్పుల యాదయ్య అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. నిజామాబాద్ (పాత) జిల్లా పరిధిలోని నాగిరెడ్డిపేట మండలాన్ని సమీపంలోని మెదక్ జిల్లాలో కలపాలని స్థానికులు గట్టిగా కోరగా, దూరంగా ఉన్న కామారెడ్డి జిల్లాలో కలపటంతో మనస్తాపం చెందిన స్థానిక దళిత యువకుడు రాజు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. వెనకబడ్డ నారాయణపేట ప్రాంతాలను ప్రత్యేక జిల్లా చేయాలనే కోరిక స్థానికుల్లో బలంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయని వివరించారు. కొడంగల్, దౌల్తాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో విలీనం చేయటాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఆ డిమాండ్లను పరిశీలించకుండా పోలీసులతో అణచివేస్తుండటం దారుణమని విమర్శించారు. రంగారెడ్డి-నల్లగొండ సరిహద్దులో ఉన్న మాల్ గ్రామం రెండు జిల్లాల పరిధిలో సగంసగం కలవటం గందరగోళాన్ని సృష్టిస్తోందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన, యత్నించిన వారి కుటుంబాలను ఆదుకోవటంతోపాటు ఆందోళనల సందర్భంగా పెట్టిన పోలీసు కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో చర్చ లు జరిపి సమస్య పరిష్కరించాలని కోరారు. సమాధానం తెలుసుగా.. ప్రజలకు సీఎం అపాయింట్మెంట్ దొరికితే నేరుగా సమస్యలు చెప్పుకుంటారని, పెద్ద సారుకు విన్నవించినందున సమస్యలు పరిష్కారమవుతాయన్న సంతృప్తితో వెనుదిరుగుతారని కోదండరాం పేర్కొన్నారు. విన్నపాన్ని నేరుగా సీఎంకు కాకుండా సీఎస్‌కు ఎందుకిచ్చారని విలేకరులు ప్రశ్నించగా, ‘సమాధానం ఏం వస్తుందో తెలిసి ఈ ప్రశ్న వేయటమెందుకు’ అంటూ దాటవేశారు. కొంతకాలంగా కోదండరాంకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ లభించటం లేదని ఆయన అనుయాయులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. -
రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు
కరీంగనగర్: జిల్లాల పునర్విభజన పేరుతో తెలంగాణను కుక్కులు చింపిన విస్తరి చేశారని టీ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిని ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా సిద్ధిపేటలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. దసరాను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలంటూనే బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో 144 సెక్షన్ విధించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని ఈ సంఘటన ద్వారా స్పష్టమౌతోందన్నారు. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వాలి
కిషన్‌రెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవ వివరణ పత్రాన్ని విడుదల చేయాలని బీజే ఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశా రు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమెంత, చెల్లించాల్సిన బకాయిలు, తెచ్చిన అప్పులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు చేస్తున్న వ్యయమెంతో వెల్లడించాలన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో ఆదాయమెంత పెరిగిందో ప్రకటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులే రూ.లక్ష కోట్లు దాటాయని (కార్పొరేషన్లకు కాకుండా)చెప్పారు.రాష్ట్రం పేరుకు మాత్రమే మిగుల్లో ఉందని, వాస్తవంగా అప్పులు, దుబారాల్లో మునిగితేలుతోందన్నారు. ప్రభుత్వం చెబుతున్న బంగారు తెలంగాణ కాస్తా బకాయిల తెలంగాణగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. భూముల అమ్మకం ద్వారా రూ.10వేల కోట్ల ఆదాయా న్ని ఆర్జిస్తామని ప్రభుత్వం చెప్పిందని, కనీసం రూ.500 కోట్లు కూడా రాలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా ఖర్చు చేసే పరిస్థితి లేదన్నారు. ఉద్యోగుల పీఆర్సీ బకాయిలు రూ.3,500 కోట్లు, ఆర్అండ్బీ కాంట్రాక్టర్లకు రూ.3వేల కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు (2015-16) రూ.1,900 కోట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీల స్కాలర్షిప్ రూ.2,500కోట్లు, ఫుడ్ సబ్సిడీ రూ.2,500కోట్లు, పొదుపు సంఘా లు, రైతులకు వడ్డీలేని రుణాలకు రూ.2 వేల కోట్లు, ప్రధాని ఫసల్ బీమా యోజన కింద రూ.500 కోట్ల బకాయిలు.. ఇలా అనేక రంగాల్లో రూ.వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. కేంద్రం ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ రూ.791 కోట్లు దారి మళ్లాయని, నేషనల్ హెల్త్ స్కీం కింద రూ.430 కోట్లు ఉపయోగించుకోలేదని ఆరోపించారు. -
కోదండరాంను ఆహ్వానించిన అఖిలపక్షం
హుస్నాబాద్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఈప్రాంత ప్రజల ఆకాంక్షను తెలుసుకునేందుకు హుస్నాబాద్ రావాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ కోదండరాంను ఆహ్వానించినట్లు టీపీసీసీ కార్యదర్శి, హౌజ్‌ఫెడ్ రాష్ట్ర మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి తెలిపారు. హుస్నాబాద్, కోహెడ మండలాల్లోని అత్యధిక గ్రామాలు కరీంనగర్లో కొనసాగించాలని తీర్మానాలు చేసినట్లు తెలిపామన్నారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా హుస్నాబాద్‌ను మూడు ముక్కలు చేస్తున్నారని చెప్పామన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు సంఘీభావం తెలపాలని కోరగా సానుకూలంగా స్పందించి ఈ నెల 30న హుస్నాబాద్‌కు వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సీపీఐ మండల కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, న్యాయవాదులు శ్రీనివాస్‌రెడ్డి, బద్దిపడిగ రాజిరెడ్డి, చిత్తారి రవీందర్, భీమాసాహెబ్ పాల్గొన్నారు. -
ప్రజల దృష్టి మరల్చేందుకే జిల్లాల విభజన నాటకాలు: భట్టి
కల్వకుర్తి రూరల్: రాష్ర్టంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం.. ప్రజల దృష్టి మరల్చేందుకే జిల్లాల విభజన పేరుతో డ్రామాలాడుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలు, మండలాల విభజనలో సహేతుకత లేదని విమర్శించారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి చేస్తున్న దీక్షను అడ్డుకోవడం ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. 90 శాతం ప్రజలు విభజనను అంగీ కరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం ఆలోచించుకోవాలని సూచించారు. కరువుతో అల్లాడుతున్న అన్నదాతలను ఆదుకోవాలని, డబుల్ బెడ్రూంలు మంజూరు చేయాలని, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. -
జిల్లాల విభజనకు ప్రాతిపదిక ఏమిటో?:కోదండరాం
ఏ ప్రాతిపదికన జిల్లాలను విభజిస్తున్నారో అర్దం కాని పరిస్థితి అని, ఇది ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాల విభజన ప్రాతిపదికను ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయాలను చెప్పేందుకు నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే విభజన నిర్ణయాలు జరగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల ప్రాంతాల విషయంలో షెడ్యూల్ 5, భూరియా కమిటీ సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ ప్రత్యేక జిల్లాల ఏర్పాటుతో వారికి సంబంధించిన అటవీ హక్కుల చట్టం, పంచారుుతీరాజ్ చట్టాలు సక్రమంగా అమలవుతాయని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాజకీయ జేఏసీ కూడా ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపుతుందని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఆదివాసీలు బలహీనంగా ఉన్నారనే వారిని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్నారని, 1/70 చట్టం అమలు కావడం లేదని అన్నారు. ప్రత్యేక నాగరికత, అలవాట్లు ఉన్న గిరిజనులు వారి పంచారుుతీల్లో కోర్ట్‌ల కంటే భిన్నంగా చైతన్యవంతమైన తీర్పులిస్తారని అన్నారు. రాజ్యాంగంలో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, కేసీఆర్‌కు నిజమైన ప్రేమ ఉంటే గిరిజనులకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డియాండ్ చేశారు. సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేస్తున్న జిల్లాల్లో ఆదివాసీ జిల్లాల ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ర్టంలో 12శాతం ఉన్న ఆదివాసీలు స్వయంపాలిత జిల్లాలు కావాలని ఎంతోకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారని దీన్ని విస్మరించడం బాధాకరమన్నారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ముందు తరాల కోసం ప్రకృతి సంపదను కాపాడుతున్న ఆదివాసీల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కేసీఆర్‌కు యాదాద్రి సెంటిమెంట్ తప్ప మరోకటి లేదని ఎందుకంటే అది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ అని ఎద్దేవా చేశారు. కెచ్చల రంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, టిడిపి రాష్ర్ట నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్, కరుణం రామకృష్ణ, ఆర్ఎస్పీ నాయకులు జానకి రాములు, న్యూ డెమోక్రసీ నాయకులు పోటు రంగారావు, ఆదివాసీ నాయకులు వట్టం నారాయణ, పీవోడబ్ల్యూ అధ్యక్షులు ఝాన్సీ, కె. సూర్యం, ఎం.హన్మేష్, గౌతం ప్రసాద్, ఎస్ఎల్ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ నాయకుల కోసమే జిల్లా విభజన
∙ఫౌంహౌస్ నిర్ణయాలే అమలు ∙వరంగల్‌ను ముక్కలు చేసే అధికారం ఎవరిచ్చారు ∙హసన్‌పర్తిలో రాస్తారోకో హసన్‌పర్తి : తెలంగాణ ప్రజల సౌలభ్యం కోసం కాదు..పార్టీ నాయకుల కోసమే జిల్లాలను విభజించారని బీజేపీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతక్క, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్, ఓరుగల్లు పరిరక్షణ కమిటీ కన్వీనర్ జయాకర్‌లు ఆరోపించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో పార్టీ నాయకులకు అనువుగా ఉండే విధంగా జిల్లాలను విభజించారని వారు పేర్కొన్నారు. నగరాన్ని విభజించొద్దని కోరుతూ స్థానిక పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిం చారు. ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ తుగ్లక్ పాలన గురించి పాఠ్యాంశంలో చదువామే తప్ప.. చూడలేదన్నారు. కేసీఆర్‌ను చూ స్తే ఆ పాఠ్యాంశాల్లో బోధించిన వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఫాంహౌస్ నుంచే సీఎం పాలన కొనసాగిస్తున్నారని ఆరోపిం చా రు. చారిత్రాత్మకత కలిగిన కాకతీయుల రాజధానిని ముక్కలు చేసేఅధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. జనగాం జిల్లా కోసం పోరాటాలు చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ' కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఈ.వి.శ్రీనివాస్, హసన్‌పర్తి పరిరక్షణ కమిటీ కన్వీనర్ పుట్టరవి, కో–కన్వీనర్ శీలం సారయ్య, నమిండ్ల శ్రీనివాస్, గుండమీది శ్రీనివాస్, కుమారస్వామి, కుమార్, యుగంధర్, పావుశెట్టి శ్రీధర్, తాళ్లపల్లికుమారస్వామి, సురేందర్‌రెడ్డి, యాదగిరి, దుర్గారాం, రాజేశ్వర్‌రావు, సంపత్‌యాదవ్, విద్యాసాగర్, ర వీందర్, శ్రీనివాస్, కృష్ణమూర్తి, Äæూర్మియా, అ మరేందర్‌రెడ్డి, రవీందర్‌గుప్తలు పాల్గొన్నారు. -
ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు
డీకే అరుణపై నిరంజన్‌రెడ్డి విసుర్లు సాక్షి, హైదరాబాద్: పాలనా సౌలభ్యం కోసమే జిల్లాలు ఏర్పాటు అవుతున్నాయి కానీ, వ్యక్తుల కోసం కాదని రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాల విభజనపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ముసాయిదాకు అన్ని పార్టీలూ అంగీకరించాయని చెప్పారు. తెలంగాణ భవన్లో గురువారం మాట్లాడుతూ.. 18 మండలాల ప్రజలు కోరితేనే వనపర్తి జిల్లాకు ముసాయిదాలో చోటు దక్కిందని, 3 మండలాలతో జిల్లా ఎలా అవుతుందో ఎమ్మెల్యే డీకే అరుణ చెప్పాలని ఎద్దేవా చేశారు. గద్వాలను జిల్లా చేయకుంటే దీక్ష చేస్తానని బెదిరిస్తున్నారని, ఆమె ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ప్రశ్నించారు. -
ప్రజల అభీష్టం మేరకే జిల్లాల విభజన
రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం సంస్థాన్ నారాయణపురం/మంచాల: జిల్లాల, మండలాల పునర్విభజన ప్రజల అభీష్టం మేరకే జరగాలని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. నల్లగొండ జిల్లా రాచకొండ అటవీ ప్రాంతంలో గిరిజనుల భూమిగోస అధ్యయన యాత్రలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజల కోరిక మేరకు పునర్విభజన చేయూలన్నారు. రాచకొండలో గిరిజన రైతులు నాలుగు తరాలుగా ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటూ న్యాయపరంగా పట్టా హ క్కులు పొంది గతంలో రుణాలు కూడా పొందారని, కానీ ప్రస్తుతం ఆ రైతులకు ఆన్లైన్ పహాణీలు ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో రుణాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెప్పారు. పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాల్సిన ప్రభుత్వం.. వాటిని లాక్కోవడానికి ప్రయత్నించడం సరైంది కాదన్నారు. -
పోలీసు రిక్రూట్మెంట్లో ‘స్థానికం’ చిక్కులు!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో జిల్లాల విభజన ప్రక్రియతో రాజధానిలో ఉన్న రెండు కమిషనరేట్లలో ‘లోకల్ ప్రాబ్లమ్స్’ రానున్నాయి. వీటిని సరిచేస్తూ సవరణ ఉత్తర్వులు ఇవ్వకుంటే పోలీసు ఎంపికలో అనేక న్యాయపరమైన చిక్కులు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. సైబరాబాద్, రాచకొం డ కమిషనరేట్ల పరిధిలో ఒకటి కంటే ఎక్కువ జిల్లాలు వస్తుండటమే దీనికి ప్రధాన కారణం. ఈ విభజన ప్రభావం హైదరాబాద్ జిల్లాపై లేకపోవడంతో సిటీ కమిషనరేట్ ‘సేఫ్ జోన్’లో ఉండిపోయింది. యూనిట్ ఆధారంగా ఎంపికలు... పోలీసు విభాగంలో ఎంపికలు యూనిట్ ఆధారంగా జరుగుతుంటాయి. ఒక్కో పోస్టుకు ఒక్కో భౌగోళిక ప్రాంతాన్ని యూని ట్‌గా పరిగణిస్తూ పోలీసు రిక్రూట్మెంట్ రూల్స్ రూపొందిం చారు. పోలీసు విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా కేవలం మూడు స్థాయిల్లోనే ఎంపికలు చేస్తుంది. ప్రాథమికంగా కానిస్టేబుల్, ఆపై సబ్–ఇన్స్పెక్టర్తో (ఎస్సై) పాటు గ్రూప్–1లో భాగమైన డీఎస్పీ పోస్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ మూడింటిలోనూ కానిస్టేబుల్‌కు రెవెన్యూ జిల్లా, ఎస్సైకి జోన్, డీఎస్పీకి రాష్ట్రం యూనిట్‌గా ఉంటుంది. ఆయా యూనిట్స్‌కు చెందిన దరఖాస్తుదారుల్ని స్థానికులుగా ఇతరుల్ని స్థానికేతరులుగా పరిగణిస్తారు. గందరగోళంలో రెండు కమిషనరేట్స్... జిల్లాల విభజన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా ఉత్తర్వులు సైబరాబాద్‌తో పాటు రాచకొండ కమిషనరేట్నూ గందరగోళంలో పడేశాయి. కొత్తగా ఏర్పడనున్న శంషాబాద్ జిల్లాలోకి షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, శేరిలిం గంపల్లి, రాజేంద్రనగర్ వస్తున్నాయి. వీటిలో ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ రాచకొండ కమిషనరేట్‌లో, మిగిలినవి సైబరాబాద్ కమిషనరేట్‌లోని ప్రాంతాలు. అలాగే మల్కాజిగిరి జిల్లాలో కి కూకట్పల్లి, కుద్బుల్లాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్ ప్రాంతాలు చేరుతున్నాయి. వీటిలో మొదటి రెండూ సైబరాబాద్‌లో, మిగి లినవి రాచకొండలో భాగాలు. ఇక రాచకొండ కమిషనరేట్‌లో ఉన్న భువనగిరిని యాదాద్రి జిల్లాలోకి చేరుస్తూ అందులోకి వరంగల్, నకిరేకల్, తుంగతుర్తి నుంచి కొన్ని ప్రాంతాలను కలుపుతున్నారు. ఇలా సైబరాబాద్, రాచకొండ క మిషనరేట్ల పరిధిలో భౌగోళికంగా ఒకటి కంటే ఎక్కువ జిల్లాలు వచ్చేలా విభజన ముసాయిదా ఉంది. దీనివల్ల రిక్రూట్మెంట్లో అనేక న్యాయపరమైనచిక్కులొచ్చే ఆస్కారం కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఉత్తర్వులివ్వాల్సిందే... పోలీసు రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ పోస్టుల దగ్గరకు వచ్చేసరికి ఆయా రెవెన్యూ జిల్లాలనే పరిధిగా ఎంచుకుంటారు. రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం ప్రతి యూనిట్‌లోనూ కచ్చితంగా 80 శాతం స్థానికుల్ని, 20 శాతానికి మించకుండా స్థానికేతరుల్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర జిల్లాల్లో విభజన వల్ల ఇబ్బందు లు లేకపోయినా సైబరాబాద్, రాచకొండలకు చిక్కులు వస్తున్నాయి. ఈ రెండింటి పరిధిలోనూ ఒకటి కంటే ఎక్కువ రెవెన్యూ జిల్లాలు ఉంటున్నాయి. దీంతో ఇక్కడ జరిగే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ఎవరిని స్థానికులుగా పరిగణించాలి అనేది ప్రశ్నగా మారుతోంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న పోలీసు విభాగం ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా సవరణ ఉత్తర్వులు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వీటిలో సైబరాబాద్, రాచకొండల వరకు పోలీసు జిల్లానే యూనిట్‌గా తీసుకునేలా ఆదేశాలు ఉండేలా కసరత్తు చేస్తున్నారు.