![రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు](/styles/webp/s3/article_images/2017/09/4/71475132678_625x300_0.jpg.webp?itok=PNg9Yh0Q)
రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు
కరీంగనగర్: జిల్లాల పునర్విభజన పేరుతో తెలంగాణను కుక్కులు చింపిన విస్తరి చేశారని టీ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిని ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా సిద్ధిపేటలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. దసరాను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలంటూనే బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో 144 సెక్షన్ విధించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని ఈ సంఘటన ద్వారా స్పష్టమౌతోందన్నారు.