t ysrcp
-
రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు
కరీంగనగర్: జిల్లాల పునర్విభజన పేరుతో తెలంగాణను కుక్కులు చింపిన విస్తరి చేశారని టీ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిని ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా సిద్ధిపేటలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. దసరాను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలంటూనే బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో 144 సెక్షన్ విధించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని ఈ సంఘటన ద్వారా స్పష్టమౌతోందన్నారు. -
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం : గట్టు
హైదరాబాద్: తెలంగాణలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని టీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ...కొంతమంది పార్టీ వీడినా క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీ శ్రేణులు తమతోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శాస్త్రీయవిధానం అవలంభించాలని గట్టు సూచించారు. రాష్ట్రంలో పాలకులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. తమ పార్టీ వీడి టీఆర్ఎస్లో చేరిన నేతలు ఇప్పుడు అవమానాలకు గురవుతున్నారన్నారు. ఈ నెల 18 నుంచి 28 వరకు వైఎస్సార్సీపీ అన్ని మండల శాఖల నియామకాలు పూర్తి చేస్తామని గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. -
'అర్థం లేని మాటలు మాట్లాడొద్దు'
వరంగల్: ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడే ఖమ్మంలో అభ్యర్థిని నిలబెట్టామని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఎవరినో గెలిపించడానికి అభ్యర్థిని నిలబెట్టలేదని చెప్పారు. అర్థం లేని మాటలు టీడీపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడొద్దని హితవు పలికారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌పై జెండా ఎగురవేస్తామని ఆయన చెప్పారు.