టెక్నాలజీ విపరీతంగా పెరిగిన తరుణంలో దాదాపు ఏ పని చేయాలన్నా.. ఇంట్లో కూర్చునే చేసేస్తున్నారు. బ్యాంకింగ్ సేవలైతే మరీ సులభమైపోయాయి. కానీ ఇంకా చాలామందికి తెలియని విషయాలు లేకపోలేదు. కాబట్టి ఈ కథనంలో 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ (Mobile Number) ఎలా మార్చుకోవాలి? ఎక్కడ మార్చుకోవాలి? అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking) ద్వారా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్
➤ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న యూజర్లు లేదా కస్టమర్లు తమ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే.. ముందు ఎస్‌బీఐ అధికారిక నెట్ బేకింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
➤కుడివైపు కనిపించే కంటిన్యూ టూ లాగిన్ మీద క్లిక్ చేసి.. తరువాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
➤అక్కడ కనిపించే చేంజ్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి.
➤క్లిక్ చేసిన తరువాత మీరు మార్చాలనుకున్న మొబైల్ నెంబర్ లేదా కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
ఏటీఎం (ATM) ద్వారా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్
ఏటీఎం కేవలం మీ ఖాతాలోని నగదు విత్‌డ్రా చేసుకోవడానికి, డిపాజిట్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. అవసరమైనప్పుడు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కూడా మార్చుకోవడానికి సహాయపడుతుంది.
➢ముందుగా మీ సమీపంలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్ళండి.
➢మీ దగ్గరున్న డెబిట్ కార్డ్‌ని ఏటీఎం మెషీన్‌లోకి చొప్పించి.. పిన్ నెంబర్ ఎంటర్ చేయండి.
➢పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత స్క్రీన్ మీద కనిపించే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ సెలక్ట్ చేసుకోండి.
➢తరువాత మొబైల్ నెంబర్ చేంజ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
➢ఆప్షన్ ఎంచుకున్న తరువాత మీ పాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. తరువాత కొత్త నెంబర్ ఎంటర్ చేయాలి. ఇలా చేసినప్పుడు మీకు ఓటీపీ నెంబర్లు వస్తాయి. వీటిని ఎంటర్ చేయడం ద్వారా మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా మాత్రమే కాకుండా మీరు బ్యాంకును సంప్రదించి కూడా మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. అయితే దీనికి కావలసిన డాక్యుమెంట్స్ బ్యాంకులో అందించాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంకులు వెళ్లలేని వారు పైన చెప్పిన రెండు పద్దతుల ద్వారా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్
మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఎందుకు
సాధారణంగా మనం డబ్బు విత్‌డ్రా చేసినా లేదా డిపాజిట్ చేసినా, ఖాతాలో ఎంత ఉండనే విషయం తెలుసుకోవాలంటే తప్పకుండా బ్యాంకుకు వెళ్లాల్సి ఉండేది. కానీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల.. మీ లావాదేవీలకు సంబంధించిన విషయాలు మీకు మెసేజ్ రూపంలో వస్తాయి. కాబట్టి ప్రత్యేకించి మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ద్వారా బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి కూడా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment