
ప్రజల దృష్టి మరల్చేందుకే జిల్లాల విభజన నాటకాలు: భట్టి
రాష్ర్టంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం.. ప్రజల దృష్టి మరల్చేందుకే జిల్లాల విభజన పేరుతో డ్రామాలాడుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు.
కల్వకుర్తి రూరల్: రాష్ర్టంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం.. ప్రజల దృష్టి మరల్చేందుకే జిల్లాల విభజన పేరుతో డ్రామాలాడుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలు, మండలాల విభజనలో సహేతుకత లేదని విమర్శించారు.
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి చేస్తున్న దీక్షను అడ్డుకోవడం ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. 90 శాతం ప్రజలు విభజనను అంగీ కరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం ఆలోచించుకోవాలని సూచించారు. కరువుతో అల్లాడుతున్న అన్నదాతలను ఆదుకోవాలని, డబుల్ బెడ్రూంలు మంజూరు చేయాలని, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.