ఎవరిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు
డీకే అరుణపై నిరంజన్‌రెడ్డి విసుర్లు
సాక్షి, హైదరాబాద్: పాలనా సౌలభ్యం కోసమే జిల్లాలు ఏర్పాటు అవుతున్నాయి కానీ, వ్యక్తుల కోసం కాదని రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాల విభజనపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ముసాయిదాకు అన్ని పార్టీలూ అంగీకరించాయని చెప్పారు. తెలంగాణ భవన్‌లో గురువారం మాట్లాడుతూ.. 18 మండలాల ప్రజలు కోరితేనే వనపర్తి జిల్లాకు ముసాయిదాలో చోటు దక్కిందని, 3 మండలాలతో జిల్లా ఎలా అవుతుందో ఎమ్మెల్యే డీకే అరుణ చెప్పాలని ఎద్దేవా చేశారు. గద్వాలను జిల్లా చేయకుంటే దీక్ష చేస్తానని బెదిరిస్తున్నారని, ఆమె ఎవరిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ప్రశ్నించారు.