పార్టీ నాయకుల కోసమే జిల్లా విభజన
-
∙ఫౌంహౌస్ నిర్ణయాలే అమలు
-
∙వరంగల్‌ను ముక్కలు చేసే అధికారం ఎవరిచ్చారు
-
∙హసన్‌పర్తిలో రాస్తారోకో
హసన్‌పర్తి : తెలంగాణ ప్రజల సౌలభ్యం కోసం కాదు..పార్టీ నాయకుల కోసమే జిల్లాలను విభజించారని బీజేపీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతక్క, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్, ఓరుగల్లు పరిరక్షణ కమిటీ కన్వీనర్ జయాకర్‌లు ఆరోపించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో పార్టీ నాయకులకు అనువుగా ఉండే విధంగా జిల్లాలను విభజించారని వారు పేర్కొన్నారు. నగరాన్ని విభజించొద్దని కోరుతూ స్థానిక పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిం చారు.
ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ తుగ్లక్ పాలన గురించి పాఠ్యాంశంలో చదువామే తప్ప.. చూడలేదన్నారు. కేసీఆర్‌ను చూ స్తే ఆ పాఠ్యాంశాల్లో బోధించిన వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఫాంహౌస్ నుంచే సీఎం పాలన కొనసాగిస్తున్నారని ఆరోపిం చా రు. చారిత్రాత్మకత కలిగిన కాకతీయుల రాజధానిని ముక్కలు చేసేఅధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. జనగాం జిల్లా కోసం పోరాటాలు చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. '
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఈ.వి.శ్రీనివాస్, హసన్‌పర్తి పరిరక్షణ కమిటీ కన్వీనర్ పుట్టరవి, కో–కన్వీనర్ శీలం సారయ్య, నమిండ్ల శ్రీనివాస్, గుండమీది శ్రీనివాస్, కుమారస్వామి, కుమార్, యుగంధర్, పావుశెట్టి శ్రీధర్, తాళ్లపల్లికుమారస్వామి, సురేందర్‌రెడ్డి, యాదగిరి, దుర్గారాం, రాజేశ్వర్‌రావు, సంపత్‌యాదవ్, విద్యాసాగర్, ర వీందర్, శ్రీనివాస్, కృష్ణమూర్తి, Äæూర్మియా, అ మరేందర్‌రెడ్డి, రవీందర్‌గుప్తలు పాల్గొన్నారు.