
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్‌బోర్డులను విలీనం చేసి ముస్లిం వక్ఫ్‌బోర్డును ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. సున్నీ, షియా వక్ఫ్‌బోర్డులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయనీ, అందుకే త్వరలో ప్రభుత్వం వాటిని విలీనం చేసి కొత్త సంస్థను ఏర్పాటు చేయనుందని వక్ఫ్ శాఖ సహాయ మంత్రి మొహ్సిన్ రజా చెప్పారు.
దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ, కొత్తగా ఏర్పడే బోర్డులో సున్నీ, షియా ఇరు వర్గాల వారు ఉంటారని మంత్రి వెల్లడించారు. రెండు బోర్డులను విలీనం చేయాలని ప్రభుత్వానికి అనేక వినతులు వచ్చిన తర్వాతనే దీనిపై ఆలోచిస్తున్నామని రజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment