ఘనంగా టీజీవీపీ ఆవిర్భావ దినోత్సవం | Richly TGVP established day | Sakshi
Sakshi News home page

ఘనంగా టీజీవీపీ ఆవిర్భావ దినోత్సవం

Published Sun, Jul 31 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

ఘనంగా టీజీవీపీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా టీజీవీపీ ఆవిర్భావ దినోత్సవం

కోదాడఅర్బన్‌: తెలంగాణ విద్యార్థి పరిషత్‌(టీజీవీపీ) 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం పట్టణంలో ఆ సంఘం నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని లక్ష్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నావత్‌ వంశీ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన తమ సంఘం ఇప్పుడు బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తుందన్నారు. ఆగష్టు 6న∙లక్ష మొక్కలు నాటుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిభార్గవ్, సాల్మన్, ప్రసాద్, రమేష్, రవి, నితిన్, గోపినా«ద్, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement