richly
-
అంబరాన్నంటిన ఆదివాసీ సంబరం
విశాఖ–కల్చరల్ : ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు. సమష్టి జీవన పద్ధతులు, పారదర్శకతకు నిలువెత్తు సాక్ష్యాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివాసీల సమాజానికి మూలవాసులులాంటి వారన్నారు. 22వ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆంధ్ర విశ్వకళాపరిషత్ డాక్టర్ అంబేడ్కర్ అసెంబ్లీ హాల్లో మంగళవారం ఘనంగా జరిగింది. ఏయూ క్యాంపస్ గిరిజన విద్యార్థుల సంఘం, గిరిజన పరిశోధకులు, ట్రైబల్ టీచింగ్, నాన్‌టీచింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ సంబరాలు అంబరాన్నింటాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఏయూ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ జి.నాగేశ్వరరావు మాట్లాడారు. గిరిజన యువత చదువుకొని ఉపాధిని పొందిన తర్వాత తమ సమాజం వైపు కన్నెత్తి చూడటం లేదని..ప్రతి వ్యక్తి తమ మూలాలను మర్చిపోవద్దని సూచించారు. జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ మాట్లాడుతూ ప్రపంచంలో నీతి, నిజాయతీ గల మనుషులెవరంటే ఆదివాసీ ప్రజలేనన్నారు. రెక్టార్ ప్రొఫెసర్ ఇ.ఎ.నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వాలను తప్పుదొవ పట్టించి గిరిజనుల వనరులను దోచుకొనే ప్రయత్నాలను గిరిజనులు తిప్పికొట్టాలన్నారు. సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెబ్బాప్రగడ రవి మాట్లాడుతూ రక్షణ కవచంలాంటి చట్టాలు, ఆదివాల చరిత్ర, హక్కులను భవిష్యత్తు తరాలకు చాటిచెప్పాల్సిన బాధ్యత గిరిజన యువతపై ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధి జేవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో సహజ వనరుల సంపదను దోచుకోవడానికి భూస్వామ్య వర్గాలు మభ్యపెడుతుందని విమర్శించారు. ఉన్న కొద్దివనులునైనా పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఏయూ తెలుగు విభాగం ఆచార్య జె. అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో ఏయూ రిజిస్ట్రార్ వి.ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె. రవిబాబు, ప్రొఫెసర్లు ఎస్. ప్రసన్నశ్రీ, టి. సుబ్బరాయుడు,వీవీఎస్ ప్రసాదరావు, గిరిజన స్కాలర్స్ టి. జగత్రావు, బలరామ్, సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా గాయకుడు వంగపండు,ఉదయ భాస్కర్లు ఆలపించిన పలు ప్రజా గేయాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ‘థింసా’15వ వార్షిక మాసపత్రికను ఏయూ వీసీ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈసందర్భంగా గిరిజన పరిశోధకులు, ఏయూ గిరిజన అచార్యలు కలిసి వీసీ నాగేశ్వరరావును, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ ఘనంగా సత్కరించారు. -
ఘనంగా టీజీవీపీ ఆవిర్భావ దినోత్సవం
కోదాడఅర్బన్: తెలంగాణ విద్యార్థి పరిషత్(టీజీవీపీ) 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం పట్టణంలో ఆ సంఘం నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని లక్ష్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నావత్ వంశీ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన తమ సంఘం ఇప్పుడు బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తుందన్నారు. ఆగష్టు 6న∙లక్ష మొక్కలు నాటుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిభార్గవ్, సాల్మన్, ప్రసాద్, రమేష్, రవి, నితిన్, గోపినా«ద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బక్రీద్
మహబూబ్‌నగర్ అర్బన్: ముస్లింలు బక్రీద్ (ఈదుల్జుహా) పండుగను సోమవారం జిల్లావ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లాలోని అన్నిపట్టణాలు, మండలకేంద్రాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేకప్రార్థనలు చేశారు. అనంతరం హిందూ, ముస్లింలు అలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాలమూరు పట్టణంలోని వానగుట్టపై గల రహెమానియా ఈద్గా మైదానంలో భారీసంఖ్యలో ముస్లింలు ఈద్ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జామె మసీద్ ఇమామ్ మౌలానా హాఫిజ్ ఇస్మాయిల్ ఉదయం 9 గంటలకు ప్రత్యేకనమాజ్ చేయించారు. పండుగ ప్రాశస్త్యాన్ని ఖుత్బా రూపంలో వివరించి, దైవకృప కోసం ఖురాన్‌లోని సందేశాలతోపాటు ప్రవ క్త మహ్మద్ ఆచరించిన ధర్మమార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం లోకకల్యాణం కోసం దువా(ప్రార్థన) చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థించారు. ప్రముఖుల ఈద్ ముబారక్ సోమవారం జరిగిన బక్రీద్‌ను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్‌ముబారక్ చెప్పారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తరఫున ఈద్గా ఆవరణలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు డీకే అరుణ, శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, మునిసిపల్ చైర్పర్సన్ రాధాఅమర్, వైస్ చైర్మన్ కె.రాములు, ఎస్పీ డి.నాగేంద్రకుమార్, ఏజేసీ డాక్టర్ రాజారాం, మాజీమంత్రి పొడపాటి చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ మునిసిపల్ చైర్మన్లు సహదేవ్‌యాదవ్, ముత్యాల ప్రకాశ్, ఎన్పీ వెంకటేశ్ తదితరులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. భారీ బందోబస్తు బక్రీద్ పురస్కరించుకుని జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేకపోలీసు బలగాలను మోహరించారు. అన్ని ని యోజకవర్గ కేం ద్రాల్లో కూడా పోలీ సులు పహారా కాశా రు. అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి సోదరభావాన్ని చాటుకోవడం ఆదర్శనీయమని పలువురు ప్రశంసించారు.