ఘనంగా బక్రీద్
మహబూబ్‌నగర్ అర్బన్: ముస్లింలు బక్రీద్ (ఈదుల్‌జుహా) పండుగను సోమవారం జిల్లావ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లాలోని అన్నిపట్టణాలు, మండలకేంద్రాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేకప్రార్థనలు చేశారు. అనంతరం హిందూ, ముస్లింలు అలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాలమూరు పట్టణంలోని వానగుట్టపై గల రహెమానియా ఈద్గా మైదానంలో భారీసంఖ్యలో ముస్లింలు ఈద్‌ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జామె మసీద్ ఇమామ్ మౌలానా హాఫిజ్ ఇస్మాయిల్ ఉదయం 9 గంటలకు ప్రత్యేకనమాజ్ చేయించారు. పండుగ ప్రాశస్త్యాన్ని ఖుత్బా రూపంలో వివరించి, దైవకృప కోసం ఖురాన్‌లోని సందేశాలతోపాటు ప్రవ క్త మహ్మద్ ఆచరించిన ధర్మమార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం లోకకల్యాణం కోసం దువా(ప్రార్థన) చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థించారు.
ప్రముఖుల ఈద్ ముబారక్
సోమవారం జరిగిన బక్రీద్‌ను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్‌ముబారక్ చెప్పారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తరఫున ఈద్గా ఆవరణలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు డీకే అరుణ, శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, మునిసిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, వైస్ చైర్మన్ కె.రాములు, ఎస్పీ డి.నాగేంద్రకుమార్, ఏజేసీ డాక్టర్ రాజారాం, మాజీమంత్రి పొడపాటి చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ మునిసిపల్ చైర్మన్లు సహదేవ్‌యాదవ్, ముత్యాల ప్రకాశ్, ఎన్‌పీ వెంకటేశ్ తదితరులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
భారీ బందోబస్తు
బక్రీద్ పురస్కరించుకుని జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేకపోలీసు బలగాలను మోహరించారు. అన్ని ని యోజకవర్గ కేం ద్రాల్లో కూడా పోలీ సులు పహారా కాశా రు. అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి సోదరభావాన్ని చాటుకోవడం ఆదర్శనీయమని పలువురు ప్రశంసించారు.