
జ్యోతినగర్ (రామగుండం): కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని ఉద్యోగ వికాస కేంద్రం ఆడిటోరియంలో స్వేరోస్ స్వర సునామి సీడీ–3 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
2013లో స్వేరోస్ స్థాపించి అందరికీ చదువుకునే అవకాశం కల్పించేలా ప్రతి గ్రామంలో చదువు విలువను తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 577 గురుకుల పాఠశాలల్లో 3 లక్షల పైచిలుకు విద్యార్థులు విద్యను పొందుతున్నారని, రాబోయే 2021 సంవత్సరం వరకు 8 లక్షల 60 వేల మందికి విద్యా బోధన చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment